Bigg Boss 7 Telugu Contestant: పెళ్లి గురించి నోరు విప్పిన ప్రియాంక జైన్..ఎప్పుడంటే.
మౌనరాగం, జానకి కలగనలేదు వంటి సీరియల్స్ ద్వారా అందరికీ సూపరిచితురాలయింది ప్రియాంక జైన్.
బుల్లితెర ద్వారా ఫేమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ, BIG BOSS SEASON 7 CONTESTANT గా అవకాశం సొంతం చేసుకుంది.
BIG BOSSలో ఎంట్రీ ఇచ్చిన తరువాత చాలా సాఫ్ట్ అమ్మాయిగానే కొనసాగింది.
బిగ్ బాస్ వంటలక్క – ప్రియాంక :
BIG BOSS లోని సభ్యులకి వంట చేస్తూ, BIG BOSS వంటలక్క అంటూ ప్రేక్షకుల చేత అనిపించుకుంది.
BIG BOSS లో AMAR DEEP మరియు SHOBHA SHETTY లతో చాలా స్నేహంగా ఉండేది. ఈ స్నేహం ఆమెకి ప్రేక్షకుల దగ్గర దెబ్బ కొట్టిందనే చెప్పాలి.
వంటల్లోనే కాదు, హౌస్లో పీట్టే టాస్క్ లలోనూ గట్టి పోటీ ఇస్తూ, లేడి సింహంలా విజృoబించింది.
BIG BOSS ఉల్టా పుల్టా సీజన్ లో టాప్ 5కి వచ్చిన ఏకైక లేడి కంటస్టెంట్ గా నిలిచింది ప్రియాంక.
ప్రియాంక పెళ్లి :
ప్రియాంకా, శివకుమార్ ప్రేమలో ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే.BIG BOSS హౌస్లోకి శివకుమార్ వచ్చినప్పుడు శివకుమార్ పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అని అడగటం, ప్రియాంక ఇప్పుడే చేసుకుందాం అనటం వైరల్ అయింది.
బయటకు వచ్చాక అయితే ఆ ప్రస్తావనే రాలేదు.అయితే ఇటీవల ప్రియాంక సోషల్ మీడియా లో చిట్ చాట్ నిర్వహించింది.
ఆ చాట్ లో ప్రియాంక ని పెళ్ళేప్పుడు అని అడిగితే శివ ఇష్టం.. అతన్నే అడగండి, అతను ఎప్పుడంటే అపుడు నేను రెఢీగా ఉన్నాను అంటూ బదులిచ్చింది.
ప్రస్తుతం శివ కుమార్ సినిమాల్లో బిజీగా ఉన్నదని ఇప్పట్లో ఏమి లేదని చెప్పింది.