Bigg Boss7 : హౌస్ లో రాత్రి పూట ఏం జరుగుతోంది..? గౌతమ్ కి వెన్ను పోటు పొడుస్తుంది ఎవరు..?

Bigg Boss7 : హౌస్ లో రాత్రి పూట ఏం జరుగుతోంది..? గౌతమ్ కి వెన్ను పోటు పొడుస్తుంది ఎవరు..?

Add a heading 8 Bigg Boss7 : హౌస్ లో రాత్రి పూట ఏం జరుగుతోంది..? గౌతమ్ కి వెన్ను పోటు పొడుస్తుంది ఎవరు..?

Bigg Boss7 : హౌస్ లో రాత్రి పూట ఏం జరుగుతోంది..? గౌతమ్ కి వెన్ను పోటు పొడుస్తుంది ఎవరు..?

బిగ్ బాస్ హౌస్ లో రాత్రిపూట చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. అవి ప్రేక్షకులను ఒక్కోసారి ఆశ్చర్యానికి గురిచేస్తే ఒక్కోసారి చిరాకు తెప్పిస్తాయి, మరికొన్ని సందర్భాల్లో చుస్తే హౌస్ లో ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచనలో పడేలా చేస్తాయి.

ఇవన్నీ పక్కన పెడితే గత రాత్రి హౌస్ లో ఎం జరిగిందో చూద్దాం. గత రాత్రి పల్లవి ప్రశాంత్ తేజ దగ్గరకు వచ్చి ఒక మాట అడుగుతాడు. అన్నా నేను సంచాలక్ గా ఎలా చేశాను ? బాగా పెర్ఫార్మ్ చేశానా అని అంటాడు. అందుకు తేజా కొంత విచిత్రంగా రియాక్ట్ అయ్యాడు.

ఆ ఏదో ఏడిశావులే అన్న అర్ధం వచ్చేలా చెప్పాడు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ను కూడా నిరాశపరచవు అన్నట్టు చెప్పాడు, టాస్క్ లో ఇద్దరి లో ఎవరో ఒకరి చెయ్యి ఎత్తాలి అని ఉంటుంది.

పల్లవి ప్రశాంత్ ఎవరి చెయ్యి అయితే ఎత్తుతాడో వారు టాస్క్ లో గెలిచినట్టు. అయితే ప్రశాంత్ అమర్ దీప్ చెయ్ ఎత్తుతాడు. కానీ తేజా అనడం ఏమిటంటే నువ్వు ప్రియాంక చెయ్యి ఎత్తితే మా టీమ్ గెలిచేది నేను కెప్టెన్ అయ్యేవాడిని, బిగ్ బాస్ కూడా అదే కోరుకున్నాడు అన్నట్టు చెప్పుకొచ్చాడు.

ఇక తేజా పరిస్థితి హౌస్ లో దారుణంగా ఉంది అని చెప్పాలి. టాస్క్ లో అమర్ దీప్ తో తన కోసం తలపడుతున్న ప్రియాంకను తేజా కనీసం ప్రోత్సహించలేని స్థితిలో ఉండిపోయాడు.

ఎందుకంటే ప్రియాంకను ఎంకరేజ్ చేస్తే శోభా ఎలా రియాక్ట్ అవుతుందో అని తేజ భయం అయి ఉండొచ్చు.

ఇక డైనింగ్ టేబుల్ దగ్గర శోభా ఒక మాట అంటుంది, అశ్విని ఫ్లిప్పింగ్ అవ్వడం తన కు నచ్చలేదని చెబుతుంది. ఆమె ఎవరో ఒకరి కోసం ఆడతనని ఒప్పుకోవాలి, వారికోసమే ఆడాలి అంటుంది.

అంతే కానీ ముందు గౌతమ్ అని ఆతరువాత అర్జున్ అని మార్చకూడదు అని చెబుతుంది. అందుకు రతిక స్పందిస్తుంది, అదే డైనింగ్ టేబుల్ వద్ద ప్రిన్స్ కూడా ఉంటాడు.

బోలె షావలి తనకోసం బాగా కష్టపడి ఆడాడు అని చెబుతుంది. తనకోసం ఎంత ఎఫర్ట్ పెట్టగలడో అంతా పెట్టి ఆడాడు అంటుంది. ఇక శోభా రతిక ఇద్దరు కూడా తమ తమ డిప్యూటీ కెప్టెన్సీల గురించి పరస్పరం పొగుడుకుంటూ ఉంటారు.

అశ్విని చుస్తే అర్జున్ గురించి మరో మాట చెబుతుంది. అర్జున్ ఎందుకో పట్టీపట్టనట్టు ఉంటాడని అంటుంది. తన గురించి ఏమి పట్టించుకోడు అంటుంది, అదే విధంగా గౌతమ్ తోమాత్రం తనకి మంచి ఫ్రీక్వెన్సీ కుదిరింది అని చెబుతుంది.

అయితే అర్జున్ మీద మొదటి నుండి ఇదే తరహా విమర్శలు వినిపించాయి. ఒకవేళ అర్జున్ కి రానున్న రోజుల్లో నామినేషన్ కు కారణం కూడా కావొచ్చు. గౌతమ్ కెప్టెన్సీ లో ఒక డెసిషన్ తీసుకుంటాడు.

దాని వల్ల ఆడవారికి పని చేయకుండా రెస్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అసలు హౌస్ లో ఉన్న 12 మందిలో 4 ఆడవారే ఉన్నారు. శోభా, రాతిక, ప్రియాంక, అశ్విని. మరి ఈ నాలుగురుతోపాటు చేతికి దెబ్బ తగలడం వల్ల శివాజీ పనిచేయలేదు.

103812714 1 Bigg Boss7 : హౌస్ లో రాత్రి పూట ఏం జరుగుతోంది..? గౌతమ్ కి వెన్ను పోటు పొడుస్తుంది ఎవరు..?

కాబట్టి మిగిలిన అబ్బాయిలే హౌస్ మొత్తం శుభ్రం చేయాలి, వంట చేయాలి, వంట పాత్రలు కడగాలి, బాత్ రూమ్స్ క్లీన్ చేయాలి. అయితే ఇంత చేసినా గౌతమ్ కెప్టెన్సీ మీద శోభా, రతికలు అసంతృప్తిగానే ఉన్నారు.

గౌతమ్ సరిగా ప్లాన్ చేయడం లేదు, పైగా గౌతం స్ట్రిక్ట్ గా లేడు అంటుంది శోభ. ఇక రాతిక ఏమంటుంది అంటే.. కెప్టెన్ అంటే పనిచేయకూడదా అంటుంది. దానికి శోభ, ప్రిన్స్ ఇద్దరు సమాధానం చెబుతారు.

కెప్టెన్ పని చేయనక్కర్లేదు అని, పైగా ప్రశాంత్ కెప్టెన్ గా ఉండి పనిచేసినందుకు నాగార్జున కోప్పడ్డ విషయాన్నీ కూడా గుర్తు చేస్తారు. అయితే తన కెప్టెన్సీ ఎలా ఉందని ప్రిన్స్ అడగ్గా, చాల బాగుంది అంటారు రాతిక శోభలు.

గౌతమ్ ను చుస్తే కొందరికి పాపం అనిపిస్తుంది, తాను ఏరికోరి డిప్యూటీ కెప్టెన్లు గా పెట్టుకున్న రాతిక, శోభాలు అతనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని జాలి పడుతున్నారు. వీళ్ళే కెప్టెన్ గౌతమ్ ను యాక్సప్ట్ చేయకపోతే మిగిలిన వాళ్ళు యాక్సప్ట్ చేస్తారా అని జాలి పడుతున్నారు.

గౌతమ్ నిర్ణయాన్ని చూసి పాపం అంటున్నారు. గౌతం స్ట్రిక్ట్ గా రూల్స్ పాటించడు అని చెబుతున్న శోభా ఏమైనా రూల్స్ పాటిస్తుందా అంటే అదీ లేదు, డిప్యూటీ కెప్టెన్ అయిన శోభా రూల్ ప్రకారం విఐపి రూమ్ లో పాడుకోవాలి, కానీ ఆమె వెళ్లి తన ఫ్రెండ్స్ రోమ్ లోనే పడుకుంటుంది.

ఇక సోమవారం నుండి తనకు కెప్టెన్సీ వస్తుందని, కెప్టెన్ గా తానంటే ఏంటో నిరూపించుకుంటాను అని చెబుతోంది శోభా. నేను పనులు చెప్పి చేయిస్తాను, నేను చెప్తే ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసు కదా అన్నట్టు అంటుంది.

అప్పుడు రతిక, ప్రిన్స్ అంటారు, నువ్వు పనులు చెప్పొచ్చు, కమాండింగ్ గానే చెప్పొచ్చు, కానీ అరిచి చెప్పకూడదు, కొట్టినట్టు చెప్పకూడదు అని చెప్తారు. ప్రిన్స్ కూడా ఒకప్పుడు కెప్టెన్సీ చేసినప్పుడు తప్పులు చేశాడు. కా…

Leave a Comment