Bigg Boss7 Final Astra Task: బిగ్ బాస్ ఫైనల్ అస్త్ర టాస్క్..అర్జున్ అంబటిని ఓడించేందుకు ఏంచేశారంటే..

Bigg Boss7 Final Astra Task

Bigg Boss7 Final Astra Task: బిగ్ బాస్ ఫైనల్ అస్త్ర టాస్క్..అర్జున్ అంబటిని ఓడించేందుకు ఏంచేశారంటే..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 చూస్తున్న వారందికీ ఫినాలే టికెట్ అంటే బాగానే తెలుసు, కానీ ఫాలో అవ్వని వారు మాత్రం అసలు ఫైనలే ఏంటి ఆ ఫినాలే టికెట్ ఏంటి అని విచిత్రంగా అడుగుతూ ఉంటారు.

ఆలా అడిగే వారికి బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూపించాలి తప్ప చెప్పినా అర్ధం కాదు. అయితే ఆ విషయాన్నీ పక్కన పెట్టి అర్జున్ అంబటి ఫైనల్ టిక్కెట్‌ను గెలుచుకున్న విషయం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎక్కడ చుసిన ఇదే టాపిక్ నడుస్తోంది.

బిగ్ బాస్ తెలుగు 7లో కొన్ని రోజులుగా టికెట్ టు ఫినాలే టాస్క్ నడుస్తున్న విషయం బిగ్ బాస్ ఫాలోవర్స్ అందరికి తెలుసు. ఈ రేసులో నుండి శివాజీ, శోభలు ఔట్ ఇప్పటికే అవుట్ అయిపోయారు, వారు అవుట్ అవ్వడంతో ప్రియాంక జైన్, ప్రిన్స్ యావార్, గౌతమ్ కృష్ణ, పల్లవి ప్రశాంత్ లు రేసులో ఉన్నారు.

ఇక ఈ రేసు చివరిలోకి వచ్చినప్పుడు బాగా రసవత్తరంగా సాగింది అని చెప్పాలి. ఆఖరున అర్జున్ ఇంకా అమర్ రేసులో తలపడ్డారు. మొత్తానికి అర్జున్ అంబటి ఈ సీజన్ ఫైనల్ టిక్కెట్‌ను సొంతం చేసుకున్నాడట.

అర్జున్ గనుక ఈ వారం జరగబోయే ఎలిమినేషన్స్ నుండి తప్పించుకోగలిగితే, అధికారికంగా బిగ్ బాస్ తెలుగు ఈ సీజన్‌లో మొదటి ఫైనలిస్ట్ గా నిలుస్తాడు అనడంలో ఎలాంటి సందేహము లేదంటున్నారు వ్యువర్స్, విశ్లేషకులు.

అయితే బిగ్ బాస్ హౌస్ లో నెగ్గుకురావాలంటే హౌస్ లో బాగా ఆడటమే కాదు, ఓటింగ్‌ విషయంలో కూడా ముందంజలో ఉండి తీరాల్సిందే, కానీ అర్జున్ ఆ విషయంలో వెనకపడ్డాడని చెప్పాలేమో, అర్జున్ చివరి స్థానంలో ఉన్నాడని అలాగే అర్జున్

తపో పాటు ఓటింగ్‌లో చివరి స్థానంలో ఉన్న ముగ్గురు కంటెస్టెంట్లు మధ్య, ఓట్లు, వోటింగ్ విషయంలో పెద్దగా వ్యత్యాసం లేదని అంటున్నారు ప్రోగ్రామ్ చూసేవారు.

Add a heading 2023 12 02T143510.305 Bigg Boss7 Final Astra Task: బిగ్ బాస్ ఫైనల్ అస్త్ర టాస్క్..అర్జున్ అంబటిని ఓడించేందుకు ఏంచేశారంటే..

ఈ బిగ్ బాస్ విషయంలో ధికారిక సర్వేలతోపాటు, అనధికారిక సర్వేలు కూడా ఉంటాయి, ఆ అనధికారిక సర్వేలను బట్టి చూస్తే ప్రియాంక, శోభ, అర్జున్ చివరి మూడు స్థానాల్లో ఉన్నారని తెలుస్తోంది.

బిగ్ బాస్ సీజన్ అంటేనే టాస్కులు, ఈ టాస్కుల ఆధారం గానే హౌస్ లోని వ్యక్తుల ప్రవర్తన బయటబడుతుంది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కును ఎవరు ఎలా ఆడుతున్నారు,

ఆట గెలవడం కోసం ఎవరైనా రూల్స్ అతిక్రమించారా, ఆట ఆడే సమయంలో మిగతా కంటెస్టెంట్లతో ఎలా ప్రవర్తిస్తున్నారు, అనే విషయాలను కూడా బిగ్ బాస్ పరిగణలోకి తీసుకుంటాడు.

అయితే ఇప్పటివరకు జరిగిన టాస్కులన్నీ ఒక ఎత్తు ఇప్పుడు కొనసాగుతున్న ఫైనల్‌ అస్త్ర టాస్క్‌లు మరో ఎత్తు లేన్నట్టు ఉంది వ్యవహారం. ఫైనల్ అస్త్ర టాస్కులో తమను తాము నిరూపించుకోవచాలని, ఫైనలిస్ట్ గా నిలబడాలని, కంటెస్టెంట్లు రెచ్చిపోయి ఆడుతున్నారు.

హౌస్ లో ఉన్నవారు ఒకరిపై ఒకరు పోటీపడి మరీ టాస్కులను ఆడటంతో స్కోరుబోర్డులో రోజురోజుకూ మార్పులు కనిపిస్తున్నాయి. పార్టిసిపెంట్లు ఆటతీరుతో స్కోరు పరిగెడుతోంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని బాగా గమనించాలి.

బిగ్ బాస్ హౌస్ లో అమర్ దీప్ చౌదరి టికెట్ టు ఫినాలే టాస్కు ల విషయంలో మొదటి నుండి ముందంజలో ఉన్నాడు. స్కోర్ బోర్డు లో కూడా అతని పేరే పైన ఉంది. కానీ చివర్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. అర్జున్ అంబటి చేతిలో అమర్ ఓటమి పాలయ్యాడు.

గత వారం రోజులుగా హోరాహోరీగా సాగుతున్న ‘ఫైనలే అస్త్ర’ రేసు ఎట్టకేలకు చివరి అంకానికి చేరుకొని ముగిసింది. మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఈ ఫినాలే అస్త్ర లో తల పడ్డారు.

పోటీ అన్న తరువాత ఒకరి తరువాత ఒకరు డ్రాప్ అవ్వక తప్పదు, అలా ఒక్కొక్కరు డ్రాప్ అవుతూ రాగా చివరకు అమర్‌దీప్, అర్జున్ అంబటి, పల్లవి ప్రశాంత్ మిగిలారు. అయితే నివేదిత, గౌతమ్ ఇద్దరు కూడా తమతమ పాయింట్లను అమర్‌కి ఇచ్చారు.

నివేదిత గౌతమ్ లు చేసిన త్యాగం ఫలించలేదని చెప్పాలి. అమర్ దీప్, అర్జున్ అంబటి చేతిలో ఓడిపోయాడు. అమర్ ను ఓడించి అర్జున్ ఫైనల్ అస్త్ర టికెట్ ను సొంతం చేసుకున్నాడు.

ఫైనల్ అస్త్ర టాస్క్‌ ను గనుక మనం జాగ్రత్తగా గమనిస్తే మొదటి నుండి అమర్ దీప్ స్కోర్ బోర్డు లో ప్రధమ స్థానంలో నిలిచాడు అని చెప్పుకున్నాం.

కొంత వరకు అమర్ టాస్కులను బాగా ఆడటంతో స్కోర్ బోర్డు లో ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకున్నాడు, కానీ తరువాత తరువాత ఆటను వెనుకపడటం మొదలైంది, అర్జున్ అంబటి అమర్ ను మెల్లగా అధిగమిస్తూ వచ్చాడు.

ఈ క్రమంలోనే గౌతమ్, శివాజీ, శోభాశెట్టి తమ పాయింట్లను అమర్‌కి అందించారు. కాబట్టే అమర్ రేసులో చివర వరకు పోటీపడగలిగాడు అంటున్నారు వ్యువర్స్. ఇక అర్జున్ అంబటి విషయానికి వస్తే మాత్రం అర్జున్ ఎవరి దగ్గరా పాయింట్లు తీసుకోకుండానే స్కోర్ బోర్డు ,లో రెండవ స్థానాన్ని దక్కించుకున్నాడు.

అలాగే సమర్ధవంతమైన ఆటతీరు కనబరిచి ఆకాహారి పోరులో అమర్‌ను డిఫీట్ చేసేశాడు. అలా ఫైనల్ అస్త్ర టాస్క్‌ ను జయించి ఫైనల్ అస్త్ర లో బిగ్ బాస్ ఫినాలే టికెట్ అర్జున్ సొంతం చేసుకున్నాడు.

దీంతో బిగ్ బాస్ తెలుగు 7 ఫైనల్‌కి అర్జున్ అంబటి టికెట్ గెలుచుకుని ఎంట్రీ సాధించడంతో అతని ఫాన్స్, ఇంకా సపోర్టార్స్ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

Leave a Comment