Bigg Boss Latest Promo : లేటెస్ట్ ప్రోమో తో దుమ్మురేపుతున్న బిగ్ బాస్..ఈ ప్రోమో చుస్తే ఎలాంటివారైనా కన్నీరు పెట్టుకుంటారు..
అమ్మ.. ఈ పిలుపు కోసం ప్రతి స్త్రీ తపిస్తూనే ఉంటుంది. అమ్మ అనేది ప్రతి బిడ్డకి నెవర్ ఎండింగ్ ఎమోషన్. అందుకు బిగ్ బాస్ మాత్రమే కాదు బ్రహ్మ దేవుడు కూడా అతీతుడు కాదు.
తల్లి పిలుపు వింటే పశుపక్షాదులే పరుగున వెళ్లి తల్లి చెంత చేరతాయి. మరి అన్ని తెలిసిన మనిషి తల్లి పిలుపు వింటే ఆగుతాడా, తల్లి ఒడిలో వాలిపోడూ. అదే జరుగుతోంది బిగ్ బాస్ షోలో.
ఫామిలీ వీక్ లో భాగంగా బిగ్ బాస్ నుండి వదిలిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట బాగా హల్ చల్ చేస్తోంది. బిగ్ బాస్ సీజన్ లో ముందునుండి అనుకున్నట్టుగానే ఫామిలీ వీక్ లో ఎమోషన్లు బాగా పండాయి.
కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు వచ్చి వారిని కలుస్తున్నారు. అయితే ఈ ఫామిలీ వీక్ అనేదే భావిద్వేగ భరితంగా సాగే సమయం. ఇక అందులోను అమ్మ గనుక వచ్చిందంటే అది ఎంత ప్రత్యేకత సంతరించుకుంటుందో చెప్పలేం. అదే జరిగింది ఇప్పుడు.
గత ఎపిసోడ్ లో హీరో శివాజీ కుమారుడు హౌస్ లోకి వచ్చాడు. డాక్టర్ గా వచ్చిన కొడుకుని చూసి శివాజీ చాలా సంతోషించాడు. పట్టరాని ఆనందంతో శివాజీ కళ్ళు చెమర్చాయి.
ఇక శివాజీ కొడుకు కూడా తండ్రికి తగ్గ తనయుడే అనిపించాడు. అయితే అశ్విని తల్లి కూడా హౌస్ లోకి వచ్చారు. కానీ వారిద్దరూ ఒకరిని ఒకరు హత్తుకుని భోరున ఏడవడమే సరిపోయింది.
అంటే ప్రతి రోజు చూసే తల్లిని కొన్ని వరాల పాటు చూడకుండా ఒక్కసారిగా చూడటంతో అశ్విని, తనని తాను నియంత్రించుకోలేకపోయింది. దుఃఖం పొంగుకొచ్చి ఇద్దరు హత్తుకుని ఏడ్చేశారు.
ఇక మరో కంటెస్టెంట్ అర్జున్ భార్య కూడా హౌస్ లోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె గర్భవతి. కాబట్టి హౌస్ లోకి అవిచ్చిన ఆమెకు హౌస్ మేట్స్ సీమంతం చేశారు.
ఇక తాజా ప్రోమో చుస్తే ఇవాళ్టి ఎపిసోడ్ ప్రోమోను రిలీస్ చేశాడు బిగ్ బాస్. అందులో గౌతమ్ కి కన్నయ్య అన్న పిలుపు వినిపిస్తుంది. అది విని ఆశ్చర్యపోతాడు గౌతమ్.
వెంటనే హౌస్ మొత్తం వేదుకుతూఉంటాడు. అప్పుడే గౌతమ్ తల్లి మంగాదేవి హౌస్ లోకి ఎంటర్ అవుతుంది. ఆమెను చూసిన గౌతమ్ వెళ్లి తల్లి గుండెలపై వాలి పోతాడు. ఆ సన్నివేశం చుసిన వారు కూడా భావోద్వేగానికి గురవుతున్నారు.
కొడుకుతో ముచ్చటించిన అనంతరం హౌస్ లోని కంటెస్టెంట్లకి అందరికి గోరుముద్దలు తినిపిస్తుంది మంగాదేవి. అయితే ఇదే సమయంలో ప్రిన్స్ యావర్ కన్నీరు పెట్టుకుంటాడు.
అతనికి తన తల్లి జ్ఞాపకానికి వస్తుంది. దీంతో మంగాదేవి ప్రిన్స్ ను ఓదార్చి నువ్వు కూడా నా కొడుకువే, మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు అంటుంది. ఇక గౌతమ్ ఆటతీరును తల్లి మంగాదేవి మెచ్చుకుంటుంది.
నువ్వు చాలా చక్కగా ఆడుతున్నావు, ఇదే కంటిన్యూ చెయ్యి. బయట నీకు ఫాన్స్ రోజు రోజుకి పెరుగుతున్నారు కన్నయ్య అని అంటుంది. గౌతమ్ తల్లి హౌస్ లో ప్రవర్తించిన తీరు చుస్తే తల్లి ఎవరికైనా తల్లే అనిపిస్తుంది.
అమ్మ అనే పిలుపుకు ఎవరైనా కరిగిపోతారు అనిపిస్తుంది. అందుకే తాజా ప్రోమో సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతోంది.