‘Bigg Boss’ OTT 2: బిగ్ బాస్ షో.. ఈ రియాలిటీ గేమ్ షోకి అన్ని భాషల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ బిగ్ బాస్ హౌస్ లోకి సెలెబ్రెటీలు వచ్చి సందడి చేస్తారు, ఆడతారు పాడతారు, టాస్కులు ఇచ్చినప్పుడు గెలవడానికి పోటీ పడతారు.
మొత్తమ్మీద బిగ్ బాస్ ప్రైజ్ మని గెలవడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. మొత్తమ్మీద చూసే వారికి వినోదాన్ని పంచుతారు. ఇక ఈ మధ్యన ముగిసిన బిగ్ బాస్ సీజన్ తో ఏడు సీజన్లు కంప్లీట్ అయ్యాయి.
పైగా తాజా సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ వివాదాలకు కేంద్ర బిందువు కూడా అయ్యాడు. ఆ వివాదాల వల్లనే అతను జైలుకి కూడా వెళ్లాల్సి వచ్చింది.
ఈ విషయాలను పక్కన పెడితే బిగ్ బాస్ సీరీస్ రెండు రకాలుగా ఉంటుంది. అందులో టెలివిజన్ లో ప్రసారమయ్యే సీజన్ ఒకటయితే, ఓటిటి లో ప్రసారమయ్యే సీజన్ మరొకటి.
Barrelakka In Big Boss OTT..? : బిగ్ బాస్ లోకి బర్రెలక్క?
ఓటిటీ లో ప్రసారమయ్యే సీజన్ కి ఒక ప్రత్యేకత ఉంది, ఇందులో బిగ్ బాస్ 24 గంటలు ప్రసారం అవుతూనే ఉంటుంది, అంటే ఈ గేమ్ నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది. ఇక ఈ ఓటిటీ తరహా సీజన్ కి టెలివిజన్ లో ప్రసారమయ్యే సిరీస్ కి వచ్చినంత మేర గుర్తింపు రాలేదనే చెప్పాలి.
అయినా కూడా దీనిని ఆదరించిన వారూ లేకపోలేదు. ఈ ఓటిటీ బిగ్ బాస్ సీజన్ 1 లో సినీ నటి బిందు మాధవి టైటిల్ విన్నర్ అయింది. గతంలో జరిగిన లోటు పాట్లను సరిచేసుకుని ఇప్పుడు ఓటిటీ బిగ్ బాస్ ను పటిష్టంగా ప్లాన్ చేస్తున్నారు.
ఈ సీరీస్ కి సెలెబ్రెటీ స్టార్స్ ను తీసుకురావడమే కాక గేమ్ షోను కూడా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారట. అందులో భాగంగానే ఈ గేమ్ షోకి బర్రెలక్కను తీసుకువస్తున్నట్టు వినికిడి.
యూట్యూబ్ లో బర్రెలక్క పేరుతో చానెల్ స్టార్ట్ చేసి, చాలామంది యూట్యూబ్ వీక్షకులకు చేరువైడి బర్రెలక్క, అయితే తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో కొల్లాపూర్ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి సంచలనం సృష్టించింది.
ఆ దెబ్బతో రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్రెలక్క పేరు మారుమ్రోగిపోయింది. చివరకి రామ్ గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్లు సైతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కన్నా బర్రెలక్కే బెటర్ అంటూ ఆమె పై ప్రసంశలు కురిపించారు.
మరి ఈమె గనుక ఓటిటీ వేదికగా నిర్వహించే బిగ్ బాస్ కి గనుక వస్తే ఆ గేమ్ షోకి మరింత హైప్ వస్తుంది అన్నది నిర్వాహకుల యోచన.
కొత్త కంటెస్టెంట్లు : New Contestants
ఇక బిగ్ బాస్ ఓటిటీ సీజన్ 2 లోకి బర్రెలక్క తో పాటు కొత్త కాంటెస్టెంట్లు ఎవరున్నారు అని సందేహం రావచ్చు, కాబట్టి కొత్తవారి వివరాలు ఒకచూద్దాం.
ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని బట్టి సరిగమప(Sarigamapa) షోతో బాగా ఫెమస్ అయిన యువ గాయని పార్వతిని (Parvathi) కూడా బిగ్ బాస్ ఓటిటీ లోకి తీసుకురానున్నారట.
ఆతరువాత నవాబ్ కిచెన్ తో నెట్టింట బాగా ఫెమస్ అయిన మొయిన్ భాయ్(Moin Bhai), వీరితోపాటు సోషల్ మీడియాలో బాగా ఫెమస్ అయిన వారిని కూడా బిగ్ బాస్ నిర్వాహకులు
సంప్రదిస్తున్నారనివిశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. అల్లరి నరేష్ సినిమా యముడికి మొగుడు లో కనిపించిన రిచా పనై(Richa Panai), డాన్స్ మాస్టర్ ఢీ ఫేమ్ యాష్(Yash), నటుడు జోతిలక్ష్మి ఫేమ్ భద్రం(Bhadram),
పాత కంటెస్టెంట్లు : Old contestants
అలాగే పాత కంటెస్టెంట్లు కూడా కొత్త గా వస్తున్నా ఓటిటీ బిగ్ బాస్ లో మరో సారి మెరిసి బిగ్ బాస్ విన్నర్ అవ్వడానికి మరో ప్రయత్నం చేస్తారు అని సమాచారం.
అయితే పాత వారు మరో సరి ఓటిటీ షో ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి రావడం ఇది కొత్తేమి కాదు, ఇంతకీ మునుపు బిగ్ బాస్ ఓటిటీ సీజన్ 1 లో కూడా ఇలా జరిగింది. ఇక కొత్త షోలో పాటల బిడ్డ బోలె షావలి(Bole Shavali), నాయని పావని (Nayani Pavani), పేర్లు ఇప్పటివరకైతే వినిపించాయి.