Bigg Boss7 : ఎలిమినేషన్ లో ఎమోషనల్, నాగ్ టేస్టీ తేజకి ఎం చెప్పాడు,కంటెస్టెంట్లకు తేజా మార్కులిచ్చాడా షాకిచ్చాడా,

ezgif 1 301c433968 Bigg Boss7 : ఎలిమినేషన్ లో ఎమోషనల్, నాగ్ టేస్టీ తేజకి ఎం చెప్పాడు,కంటెస్టెంట్లకు తేజా మార్కులిచ్చాడా షాకిచ్చాడా,

Bigg Boss7 : ఎలిమినేషన్ లో ఎమోషనల్.. నాగ్ టేస్టీ తేజకి ఎం చెప్పాడు.కంటెస్టెంట్లకు తేజా మార్కులిచ్చాడా షాకిచ్చాడా.

బిగ్ బాస్ లో ఎలిమినేషన్ అన్నది తప్పనిసరి, అయితే 4 లేదా 5 వారాల్లో ఎలిమినేటి అయితే దానిని పెద్దగా పట్టించుకోరు. కానీ పోను పోను వరాలు గడిచే కొద్దీ ఎలిమినేట్ అవుతున్న కంటెస్టెంట్లపై మిగిలిన వారు ప్రేమ చూపెడతారు.

వారు హౌస్ నుండి బయటకు వెళుతున్న సమయంలో కన్నీళ్లు పెట్టుకుంటారు. ఎందుకంటే రోజులు గడుస్తున్నా కొద్దీ వారిపై అటాచ్మెంట్ పెరుగుతుంది.

ఒక రైలులో ప్రయాణం చేసిన వారు కూడా అందులో పరిచయం అయినా వారు, వారి స్టేషన్ వచ్చాక దిగి వెళుతుంటే ఎందుకో కొంచం ఫీల్ అవుతారు.

అది వారికి కూడా తెలుసు వెళ్ళక తప్పదని, కానీ ఉన్న ఆకొంచం సేపు ఆప్యాయతగా మాట్లాడుకోవడమే అందుకు కారణం.

మరి కుటుంబాలను, ఫ్రిండ్స్ ను తన వృత్తని వదిలి బిగ్ బాస్ హౌస్ లో ఉండేందుకు వచ్చిన వారు దాదాపు 8, 9 వారల తరవాత ఒకరిని విడిచి మరొకరు వెళ్ళిపోవాలి అంటే కొంత భావోద్వేగానికి గురవుతారు.

ఈ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఇపుడు 9వ వారంలో హౌస్ నుండి బయటకు వస్తున్నా తేజ ఎలిమినేషన్ గురించి చెప్పుకోవాలి.

తేజా మొదటి నుండి చెబుతున్న మాటేమిటంటే తాను మహా అయితే 4 వారాలు ఉంటాను, లేదంటే 7 వారాలు ఉంటాను అని అనేవాడు. కానీ 9 వరాల పాటు హౌస్ లో కొనసాగుతానని అనుకోలేదు.

అయితే మనిషి ఆశావాది, కాబట్టి ఇక్కడ వరకు వచ్చాక తేజాకి కూడా ఒక ఆశ కలిగింది. ఎలాగూ 9 వారలు ఉన్నాను కదా ఫ్యామిలీ వీక్ వరకు ఉంటె బాగుండేది అని అనుకున్నాడు.

ఈ విషయాన్నే హోస్ట్ నాగార్జున తో కూడా హౌస్ నుండి బయటకు వచ్చాక స్టేజి మీద పంచుకున్నాడు. అసలు ఎలిమినేషన్ సమయంలో నాగార్జున వచ్చి ఈ వారం ఎలిమినేషన్ కాబోయే కంటెస్టెంట్ టేస్టీ తేజా అని చెప్పగానే తేజా ఏమాత్రం ఎమోషనల్ అవ్వడం కానీ,

లేదంటే నేను ఎలిమినేటి అవ్వడం ఏంటి అని షాక్ అవ్వడం కానీ లేదు, ఏంటి నేను ఎలిమినేటి అవుతున్నాను, హౌస్ నుండి బయటకు వెళ్ళాలి, అంతేనా అన్నట్టు చాలా లైట్ తీసుకున్నట్టు ఉంది అతని భావన. ఇదంతా చూస్తున్న ఆడియన్స్ కి మాత్రం ఒక సందేహం కలుగుతోంది.

చూడబోతే బిగ్ బాస్ లో ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది తేజా నే అని, తేజాకి ముందుగానే తెలిసిపోయిందా అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే తేజా లో ఏమాత్రం ఆశ్చర్యం లేనే లేదు ఎలిమినేషన్ మాట విన్న తరవాత.

ఇక ఈ వారం ఎలిమినేషన్ ఉంటుంది అన్న విషయం కంటెస్టెంట్లకి అందరికి తెలుసు, అయితే ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అన్నది మాత్రం తెలీదు.

ఎలిమినేషన్ ఉంది కాబట్టి హోస్ట్ నాగ్ కంటెస్టెంట్లను కాస్త ఉత్సాహపరచాలి అనుకున్నారు. దాని కోసమే ఈ వారం గెస్టులుగా నటులు, దర్శకులైన రాఘవ లారెన్స్, అలాగే ఎస్.జె సూర్య లను హౌస్ లోకి తీసుకు వచ్చారు. వీరు హౌస్ మేట్స్ తో కాసేపు సరదాగా గడిపారు, వారితో స్టెప్పులు కూడా వేయించారు.

ఆతరువాత నాగ్ హౌస్ మేట్స్ తో చిన్న చిన్న ఫన్నీ గేమ్స్ కూడా ఆడించారు. ఆతరువాతే ఎలిమినేషన్ అనే మాట బయటపెట్టారు.

ఇక హౌస్ లో నుండి తేజ ఎలిమినేషన్ కి గురయ్యాడు అనగానే ఎక్కువ బాధ పడింది మాత్రం శోభా నే అని చెప్పాలి. అయితే కంటెస్టెంట్ల పై రెచ్చిపోయే శోభా ఇలా కన్నీరు పెట్టుకోవడం, బాధ పడటం మాత్రం ఆశ్చర్యానికి గురి చేసింది. దానికి కారణం మాత్రం తేజా తో శోభకు ఉన్న చనువు అనే చెప్పాలి.

అది ఎంతలా అంటే చేతిపై టాటూ వేయించుకునే అంత, అయితే టాటూ గురించి నాగ్ దగ్గర ప్రస్తావన వచ్చినప్పుడు దానిపై తేజ క్లారిటీ కూడా ఇచ్చాడు.

అది గేమ్ లో భాగమేనని, శోభా ఒప్పుకుంటే ఇప్పటికిప్పుడు వేయించుకుంటా టాటూ అని చెప్పాడు. కానీ శోభా మాత్రం ఏడుస్తూ ఉండిపోయింది కానీ సమాధానం మాత్రం చెప్పలేదు.

ఇక ఎలిమినేషన్ గురించి చెప్పిన తరువాత హౌస్ మేట్స్ దగ్గరకు వెళ్లి ఒక్కొక్కరిని పలుకరించి రావడానికి అని వెళ్ళాడు తేజా, అప్పుడు అతను శోభా దగ్గరకు వెళ్లగా శోభా బాగా ఏడ్చేసింది.

నా కెప్టెన్సీ చూసి వేళ్ళు రా ప్లీజ్ అని అంటుంది, ఒక్కేఒక్క రోజు ఉండవా అని బ్రతిమాలాడింది. కానీ ఎలిమినేషన్ అయ్యాక అలా కుదరదు కాబట్టి తేజా ఒక మాట చెప్పాడు.

నేను బయటకు వెళ్ళాక కూడా నీ ఆట తీరు చూస్తా, నీ కెప్టెన్సీ చూస్తా, నువ్వు బాగా ఆడు, ఫైనల్స్ వరకు వెళ్ళు అని ఎంకరేజ్ చేశాడు. ఆతరువాత శివాజీ దగ్గరకు వెళ్తాడు.

అన్నా బై అన్నా వెళ్లొస్తా అని చెబుతాడు. నో హార్ట్ ఫీలింగ్స్‌రా నేను ఏమి చేసినా గేమ్ లో భాగంగానే చేశాను అని చెప్పాడు శివాజీ. ఆ సమాధానాన్ని తేజా కూడా సానుకూల దృక్పధంతోనే తీసుకున్నాడు.

నువ్వు గేమ్ ని గేమ్ లనే అడావు అన్నాడు. అయితే నాగ్ తో చెప్పినట్టు శివాజీ తో కూడా అదే మాట చెప్పాడు తేజ, ఫ్యామిలీ వీక్ వరకు ఉంటె బాగుండేది, అమ్మను ఇక్కడకి తీసుకువచ్చేవాడిని అన్నాడు. కానీ అదే జరగలేదు అంటూ కొంచం ఎమోషనల్ అయ్యాడు.

ఇక నాగ్ మాత్రం తేజా కి స్పెషల్ కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. నీతో మాట్లాడుతున్నంత సేపు చాలా సరదాగా ఉంటుంది తేజా అని చెప్పాడు.

ఆతరువాత హౌస్ లో ఉన్నవారికి ఎవరెవరికి ఎన్ని మార్కులిస్తావు అని అడిగాడు. అప్పుడు తేజా చెప్పిన మొదటి పేరు శోభా, ఆమెకు 10 కి 20 అని చెప్పాడు. అంతే కాక బయటకు వచ్చాక ఒక ఫుడ్ వీడియో కూడా ఇవ్వు శోభా అని అడిగేశాడు తేజ.

ప్రోగ్రాం లో భాగంగా తన జర్నీ వీడియో చుస్తే, అందులో తేజా ఉన్న ప్రతి చోట శోభా కూడా ఉంటుంది. అది చూసిన తేజ ఇది నా జర్నీ వీడియోనా శోభా జర్నీ వీడియోనా అర్ధం కావడం లేదంటాడు.

అందుకు శోభా కూడా నవ్వుకుంటుంది. ప్రియాంక గురించి మాత్రం ఒక ఆశక్తికర విషయం పంచుకున్నాడు. ఆమె అంటే ఎనలేని గౌరవం అని, ఆమె బిగ్ బాస్ హౌస్ వంటలక్క అని చెప్పాడు.

అలానే అమరం, యావర్, రతిక, అశ్విని, భోలే సహా అందరికీ తనకు నచ్చినట్టుగా మార్కులు ఇచ్చాడు. శివాజీ కూడా తేజ కి మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు.

హౌస్ లో అందరికన్నా తేజా చాలా తెలివిగలవాడని అన్నాడు. కావాలంటే అన్ని ఎపిసోడ్స్ ఒక్కసారి ఇంటికి వెళ్ళాక చుస్తే తన తప్పులు తనకు తెలుస్తాయని సలహా కూడా ఇచ్చాడు.

కంటెస్టెంట్లతో ఇంత బాండింగ్ ఏర్పడిన తరువాత తేజా ఎలిమినేషన్ ను ఊహించినప్పటికీ ఎమోషనల్ కాకుండా మాత్రం ఉండలేకపోయాడు. తడి కన్నులతోనే హౌస్ నుండి బయటకు వచ్చాడు

Leave a Comment