సాధారణం గా మన ఇంటిలోకి చిన్న చిన్న పురుగులు, అలాగే పక్షులు తరచూ రావడం సహజం. అయితే ఇంటి లోకి పురుగులు మాత్రం రావడం అంత మంచిడి కాదు ఎందుకంటే మన ఇంటిలో చిన్న పిల్లలు తో పాటు పెద్ద వాళ్ళు కూడా ఉంటారు. ఈ పురుగులలో కొన్ని మామూలు అయితే మరి కొన్ని విషపూరితం అయినవి కుడా ఉంటాయి.
వీటి వల్ల చిన్న పిల్లలు, పెద్ద వాళ్ళ కి ఏదైనా జరిగినా వారు చెప్పుకోలేరు అందుకని ఇంటిలోకి ఎటువంటి పురుగులు రాకుండా చూసుకోండి. ఇక అప్పుడప్పుడు మన ఇంటిలోకి పక్షలు కుడా రావడం జారుతూ ఉంటుంది. అందులో కొన్ని పక్షలు రావడం శుభ సూచికం అని చెప్తారు పండితులు. కాని కొన్ని పక్షులు ఇంటి లోని కి రావడం అంత మంచిది కాదు అని కుడా చెప్తున్నారు. కొందరు ఇళ్లల్లో రక రకాల పక్షలు తీసుకొచ్చి పెంచుకుంటారు.
ఇందులో కుడా మంచివి ఉంటాయి చెడ్డవి ఉంటాయి. అంతే కాదు కొన్ని పక్షులు వాటి కదలికల వల్ల వచ్చే మార్పులు శగుణ శాస్త్రంలో కూడా చెప్పడం జరిగింది. పూర్వ కాలం లో మన పెద్దలు కూడా వాటి కదలికల ద్వారా వారి జీవితంలో రాబోయే ఎటువంటి మార్పులను అయినా ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా వారు తగు జాగ్రత్తలు తీసుకనే వారు.
మరి ఎలాంటి పక్షులు మన ఇంట్లోకి వస్తే శుభప్రదం అనే విషయాలను తెలుసుకుందాం. అయితే పక్షులలో ముఖ్యం గా పిచ్చుకలు ఇంటిలోకి రావడం శుభప్రదంగా మన శాస్త్రంలో చెప్పడం జరిగింది. అందుకే మన పెద్దలు ఆ కాలంలో ఇంటిదగ్గర ధాన్యపు గింజలను కట్టి వాటిని మచ్చిక చేసుకోవడం జరిగేది.
ఇక ఈ పిచ్చుకలు రావడం అనేది పాజిటివ్ కు మంచి సంకేతమని చెప్పాలి. అయితే మన ఇంట్లోకి పిచ్చుకలు వచ్చే తీరును బట్టి మనం కొన్నింటిని ముందే అంచనా వేయచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే జంట పిచ్చుకలు పదే పదే మీ ఇంటిలోకి వస్తుంటే త్వరలోనే మీ ఇంట్లో శుభకార్యం జరగబోతుందనే సంకేతమని శాస్త్ర పండితులు చెప్తున్నారు. అదేవిధంగా కొత్తగా పెళ్ళైన దంపతులు ఉంటె వారికి త్వరలోనే సంతాన ప్రాప్తి కలగబోతోందని ఈ జంట పిచ్చుకలు తెలియజేస్తాయని పెద్దలు చెప్తున్నారు.
అదేవిధంగా పిచ్చుకలు మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా మంచిదట. ఆ గూడు లో పిల్లలు పెట్టినట్లయితే ఇక నుండి మీ ఇంట్లో డబ్బుకు అస్సలు లోటు ఉండదని పండితులు చెప్తున్నారు. ఇక అందరూ ఎక్కువగా భయపడేది గుడ్లగూబ చేసే శబ్దాలు. కొందరు అయితే చూడగానే భయపడి పోతారు. అలాగే గుడ్లగూబ ఇంట్లోకి వచ్చినట్లయితే ఏదో కీడు జరగబోతుందని భయపడతారు. అంతే కాదు దానిని అశుభంగా భావిస్తారు కుడా కానీ గుడ్లగూబ ఇంటిలోకి రావడం అనేది చాల మంచిదని అసలు గుగ్లగూబ లక్ష్మీదేవి వాహనం అని పండితులు చెప్తున్నారు.
అలాంటి గుడ్లగూబ మీ ఇంట్లోకి ప్రవేశిస్తే త్వరలోనే మీకు లక్ష్మీ కటాక్షం కలగబోతుందని సంకేతమని పెద్దలు చెప్తున్నారు. కొందరు ఇంటి ముందు కాకి వాలితే వెంటనే దానిని తరిమేస్తారు . కానీ అలా ఎప్పుడూ చేయకండి ఎందుకంటే కాకిని మన పితృదేవతలకు ప్రతినిధిలు అని శాస్త్రాలలో ఉందని పండితులు చెప్తున్నారు. అలాగే మనం కాకికి పెట్టే ఆహారం మన పితృదేవతలకు చేరుతుందని శాస్త్రాలలో చెప్పడం జరిగింది. అందుకనే పిత్రు కార్యాలలో కుడా కాకి కి ఆహారం పెట్టిస్తారు. దీనివల్ల వారి ఆత్మ శాంతిస్తుందని పెద్దలు నమ్ముతారు. అదే విధంగా కందిరీగలు కుడా మీ ఇంట్లో గూడు కట్టుకుని ఉంటె కూడా శుభ సూచికమని పెద్దలు చెప్తున్నారు.
మీ ఇంటి పరిసరాల్లో పదే పదే రామచిలుకలు కనిపించిన కుడా మీ పూజలు ఫలించి త్వరలోనే మీకు మంచి జరగడం కాని మంచి శుభవార్తలు వినడం కానీ జరుగుతుంది అని అనుకోవాలి పండితులు చెప్తున్నారు. కొందరు ఇళ్ళల్లో పంజరం లో పక్షలను పెంచుతారు. ఇది అంత మంచిది కాదు అని వాటి స్వేచ్ఛను మీరు హరిస్తున్నట్లు అవుతుందని దీని వల్ల అనేక సమస్యలు వస్తాయని కాబాట్టి ఇంటిలో పక్షలు పెంచుకోవాలని అనుకున్నవారు ఒకసారి పెద్దలని సంప్రదించి అప్పుడు పక్షులను పెంచుకోవాలని చెప్తున్నారు పండితులు.