తెలంగాణ భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణాలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకునే అన్ని స్థానాలు గెలకపోయినా పార్టీ కి వీర విధేయుడిలా ఉండే బండి సంజయ్ మాత్రం తప్పక గెలిచి తీరుతారని అంతా భావించారు.
కానీ ఈ ఎన్నికల ఫలితాలు బండి సంజయ్ కి చేడూ వార్తను అందించాయి. అయన కరీంనగర్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. భారతీయ జనతా పార్టీ కోసం పాద యాత్రలు కూడా చేపట్టారు బండి సంజయ్. తెలంగాణ లో పార్టీని బలోపేతం చేసేందుకు అధికార బి.ఆర్.ఎస్ పార్టీ పైకి ఒంటి కాలు మీద దూకారు.
ఆయన చూపెట్టే దూకుడు స్వభావంతో గులాబీ పార్టీ కూడా కొన్ని సందర్భాల్లో ఇరుకున పడుతూ ఉండేది. అయితే అనూహ్యంగా బీజేపీ అధినాయకత్వం బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుండి పక్కన పెట్టింది.
దీంతో ఆయన చాలా నిరుత్సాహ పడినట్టు కూడా అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఈ విషయం బీజేపీ పార్టీ శ్రేణులకు కూడా కొత్త ఇబ్బంది కలిగించినట్టు రాజకీయ విశ్లేషకులు రాసుకొచ్చారు. ఏది ఏమైనా బండి సంజయ్ మాత్రం ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యి అసెంబ్లీ లో అడుగుపెట్టే అవకాశాన్ని చేజార్చుకున్నారు.