Liquor Price hiked: ఏపీ లో మందు బాబులకు చేదు వార్తా..రాష్ట్రంలో పెరిగిన మద్యం ధరలు..ఏయే బ్రాండ్లపై ఎంతెంత పెరిగిందంటే..
ఆంధ్ర ప్రదేశ్ లో మందబాబులకు బీరు కన్నా కటిక చేదు వార్త వినిపించింది జగన్ సర్కారు. ఏపీ లో మద్యం ధరల్ని పెంచాలని నిర్ణయం తీసుకుంది వైసీపీ ప్రభుత్వం.
రాష్ట్రంలో ఇప్పటి వరకు వివిధ మద్యం బ్రాండ్లపై వాటి ఎమ్మార్పీ ఆధారంగా ఫిక్స్‌డ్ కాంపొనెంట్ రూపంలో అదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తున్నారు. అయిత ప్రస్తుతం విధిస్తున్నఏఆర్‌ఈటీ మీద మరింత టాక్స్ వడ్డించనుంది ఏపీ సర్కారు.
ఇక నుండి ఆయా బ్రాండ్ల ధరపై శాతాల రూపంలో టాక్సులు వసూలు ఉండనుంది. వ్యాట్, ఏఈడీనీ సవరిస్తూ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
ఈ సవరణల వల్ల రాబోయే రోజుల్లో అన్ని రకాల మద్యం బ్రాండ్లపై ఒకే తరహాలో పన్నుల భారం పడనుందని తెలుస్తోంది.
కొన్ని రకాల బ్రాండ్ల మద్యం ధరలు చూస్తే క్వార్టర్ సీసా పై 10 రూ – 40రూ వరకూ పెరిగింది, హాఫ్ బాటిల్ మీద చుస్తే .10 రూ – 50 రూ వరకూ పెరగనుంది, ఫుల్ బాటిల్ పై మాత్రం 10 రూ- 90 రూ వరకూ పెరిగాయని తెలుస్తోంది.
అయితే ఇక్కడ కొన్ని బ్రాండ్ల ధరలు మాత్రం తగగ్గయి. అయితే అవి చాల తక్కువగా సేల్ అవుతున్న బ్రాండ్లు కాబట్టి వాటి ధరలు తగ్గించారని తెలుస్తోంది.
కానీ తరచూ అమ్ముడయ్యే బ్రాండ్లు, మార్కెట్ లో డిమాండ్ ఉన్న బ్రాండ్ల పై మాత్రం ధరలు పెరిగాయి. ఐఎంఎఫ్‌ఎల్ కనీస ధర 2,500 రూపాయల లోపు ఉంటే దానిపై 250 శాతం పెంచనున్నారు, ఐఎంఎఫ్‌ఎల్ కనీస ధర 2,500 రూపాయల కన్నా ఎక్కువ ఉంటె దానిపై 150 శాతం పెరగనుంది.
ఇక అధికంగా అమ్ముడయ్యే బీరుపై 225 శాతం పెంచగా, వైన్ పై 200శాతం పెంచారు. ఫారిన్ లిక్కర్‌పై 75 శాతం పెంచారు. ఫారిన్ లిక్కర్ పై వడ్డన మాత్రం తక్కువగానే ఉంది. దీన్ని బట్టి చుస్తే మద్యం కేవలం ఉన్నత వర్గాలకు మాత్రమే అన్నది జగన్ సర్కారు ఆలోచగా కనిపిస్తోంది.
పేద వారు మద్యం జోలికి వెళ్లకూడదని మద్యంపై ధరలు పెంచినట్టు సమాచారం. అయితే జగన్ సర్కారు మాత్రం పూర్తి మద్యపాన నిషేధం విధిస్తామని గత ఎన్నికల సమయం లో హామీ ఇచ్చిన విషయాన్నీ ప్రతిపక్షాలు గుర్తు చేస్తున్నాయి.
కానీ ఇలా బ్రాండ్ల పై ధరలు అమాంతం పెంచేసి పేద వారి అలవాటుని ఆసరాగా చేసుకుని ప్రభుత్వ ఖజానా నింపుకోవడం సమంజసం కాదని మండి పడుతోంది.
ఏపీలో ఇక మీదట ఒక బ్రాండ్ ఫుల్ బాటిల్ ప్రస్తుత ధర 570 రూపాయలు ఉంటె అది పెరిగిన ధరల ప్రకారం 590 రూపాయలకు పెరుగుతుంది.
మరో బ్రాండ్ క్వార్టర్ 200 రూపాయలు ఉంటె 210 రూపాయలకు చేరుతుంది. గడిచిన చాలాకాలంగా ఫారిన్ లిక్కర్‌పై ధరలు సవరించలేదని అధికారుల ద్వారా తెలుస్తోంది, అయితే పెరుగుతున్న రవాణా, ఇతర ఖర్చుల నేపథ్యంలో ధరలు పెంచాల్సిన అవసరం ఏర్పడిందని వారు చెబుతున్నారు.