BJP final list released : భారతీయ జనతా పార్టీ తుది జాబితాను విడుదల చేసిన నేతలు నామినేషన్లు వేసే సమయం.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ గడువు ముగుస్తున్న రోజున భారతీయ జనతా పార్టీ తన తుది జాబితాను విడుదల చేయడం గమనించదగ్గ విషయం. పైగా ఈ జాబితా తోపాటు గతంలో టికెట్లు పొందిన వారిలో కొందరిని తప్పించి వారి స్థానంలో మరొకరిని ఖరారు చేస్తూ తుది జాబితాను విడుదల చేసింది.
ఈ ఆఖరు జాబితాలో ఆఖరు నిమిషంలో టికెట్లు కోల్పోయిన వారెవరు? అలాగే మిగిలిన స్థానాల్లో తలపడబోయే నేతలేవరు అన్న విషయంపై ఒక లుక్కేద్దాం.
భారతీయ జనతా పార్టీ నవంబర్ 10వతేదీన 14 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. వాటితో పటు మూడు స్థానాలలో మార్పులు చేసింది.
వనపర్తిలో అశ్వద్ధామరెడ్డికి బదులు అనుగ్నారెడ్డికి టికెట్ కేటాయించారు బీజేపీ పెద్దలు. మరోవైపు బెల్లంపల్లి స్థానాన్ని గతంలో శ్రీదేవికి కేటాయించగా ఇప్పుడు ఆమె స్థానంలో కొయ్యాల ఏమాజీ పేరు వచ్చింది.
టికెట్ కేటాయించారన్న సంతోషంలో శ్రీదేవి ఇప్పటికే నామినేషన్ కూడా వేశారు. ఇక చాంద్రాయణగుట్టలో పాత వారిని తప్పించి మహేందర్ కు అవకాశాన్ని కల్పించారు.
మరోవైపు తాజాగా టికెట్లు కేటాయించిన స్థానాలు చూస్తే.. పెద్దపల్లి లో- దుగ్యాల ప్రదీప్ రావు, సంగారెడ్డి లో – రాజేశ్వరరావు, నర్సంపేట లో – పుల్లారావు, దేవరకద్ర లో – కొండా ప్రశాంత్ రెడ్డి, నాంపల్లి లో – రాహుల్ చంద్ర, కంటోన్మెంట్ లో- గణేష్, శేరిలింగంపల్లి లో – రవికుమార్ యాదవ్, మల్కాజ్ గరి లో – రామచంద్రరావు, మేడ్చల్ లో – ఏనుగు సుదర్శనరెడ్డి, మధిర లో – విజయరాజు ఉన్నారు.
ఇక వీరికి నామినేషన్ వేయడానికి కూడా నేడే ఆఖరు తేదీ కావడంతో ఎన్నికల బరిలో దూకేందుకు సమాయత్తం అవుతున్నారు.