4 మంది AAP లీడర్లను అరెస్ట్ చేయాలని BJP ప్రయత్నిస్తోంది – అతిషి

website 6tvnews template 2024 04 02T113340.096 4 మంది AAP లీడర్లను అరెస్ట్ చేయాలని BJP ప్రయత్నిస్తోంది - అతిషి

BJP is trying to arrest 4 AAP leaders – AAP leader Atishi’s key comments : AAP లీడర్ అతిషి విలేఖరుల సమావేశం లో మాట్లాడుతూ తనని BJP లో చేరమని అడుగుతున్నారని లేకపోతే మీ మీద కూడా ED రైడ్స్ జరుగుతాయని బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. మోదీ ప్రభుత్వం AAP లీడర్లను అణిచివేయాలని చూస్తున్నారని ఇప్పుడు మరో నలుగురు AAP నేతలను అరెస్ట్ చేయాలని BJP చూస్తోందని ఆమె ఆరోపించారు.

“ఇప్పుడు బీజేపీ ఉద్దేశం ప్రకారం AAP చెందిన మరో ఇద్దరు నాయకులను వచ్చే రెండు నెలల్లో అరెస్ట్ చేయడమే టార్గెట్ పెట్టుకున్నారని, నాతో పాటు, సౌరభ్ భరద్వాజ్, దుర్గేష్ పాఠక్, రాఘవ్ చద్దాను తప్పకుండా అరెస్ట్ చేస్తారని ఆమె అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ముక్కలు అవుతుందని అని అనుకున్నారని ఆమె ఆరోపించారు.

సోమవారం విచారణ సందర్భంగా ED ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అయిన అతిషి మర్లెనా, సౌరభ్ భరద్వాజ్‌ల గురించి ప్రస్తావించినట్లు పేర్కొంది. లిక్కర్ పాలసీ కేసులో సహ నిందితుడు విజయ్ నాయర్‌తో అతని పరస్పర సంభాషణలు గురించి ప్రశ్నించినప్పుడు, నాయర్ తనకు నివేదించలేదని, ఆతిషి మర్లెనా మరియు సౌరభ్ భరద్వాజ్‌లకు నివేదించారని, నాయర్‌తో తన సంబందం చాల పరిమితంగా ఉందని కేజ్రీవాల్ చెప్పారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసులో రిమాండ్ ముగిసిన సందర్భంగా సోమవారం రోస్ అవెన్యూ కోర్టులో ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ విధించారు.

కేజ్రీవాల్ కు తీహార్ జైలు నంబర్ 2 కేటాయించి నట్లు జైలు అధికారులు తెలిపారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ లింక్డ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి మార్చి 21న కేజ్రీవాల్‌ను ED అరెస్టు చెయ్యడం జరిగింది. అనంతరం ఢిల్లీ కోర్టు మార్చి 28 వరకు కస్టడీలో ఉంచింది. అతని కస్టోడియల్ రిమాండ్ గడువు ముగియడంతో, అతన్ని రూస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు.

Leave a Comment