ఈరోజు పోలీసులు BJP గోషామహల్ MLA రాజ సింగ్ ని గృహ నిర్భందం చేసారు. ఈరోజు సాయంత్రం ఆయన చెంగిచెర్ల కి వెళ్తానని ప్రకటించారు. అయితే పోలీసులు ఆయను వెళ్ళవద్దని వారించి నట్లు తెలుస్తోంది. అయిన పోలీసుల మాటలు పెడచెవిన పెట్టి ఆయన బయలుదేరుతుండగా ఆయనను గృహ నిర్బంధం చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.
అయితే రాజా సింగ్ మాత్రం నేను హోళీ రోజున గాయపడిన వారిని చూడడానికి వెళ్తున్నాని చెప్పిన పోలీసులు ఆయనకి అనుమతి ఇవ్వలేదు. గుర్తు తెలియని వ్యక్తులు హిందువులపై దాడి చేసారని ఆ సమయం లో చాల మంది మహిళలు యువకులు గాయపడ్డారని ఆయన చెప్పారు. కేవలం వారిని పరామర్శించడానికి మాత్రమే వెళ్తున్నట్లు ఆయన చెప్పారు. దీనిని పోలీసులు అడ్డుకోవడం అలాగే అరెస్ట్ చెయ్యడం చాలా విడ్డురం గా ఉందని ఆయన విమర్శించారు.
ప్రభుత్వం మారిన కుడా హిందువుల పై దాడులు జరుగితున్నాయని ఆయన ఆరోపించారు. ఇకమీదట ఎవరైనా హిందువుల పై దాడులకి పాల్పడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. అలాగే హిందువులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని పోలీసులను అయన కోరారు. గాయ పడిన మహిళ కోసమే నేను వెళ్తుంటే అడ్డుకోవడం సబబు కాదని ఆయన అన్నారు. అయితే ఆ హిందు మహిళకు న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేస్తానని ఆయన అన్నారు.