Janvi Kapoor: బ్లాక్ కలర్ వావ్..అందానికే అసూయ పుట్టిస్తోన్న జాన్వీ కపూర్.
స్టార్ కిడ్ జాన్వీ కపూర్ చీరకట్టుతో చంపేస్తోంది. తన ఒంపు సొంపులతో కుర్రాళ్ల హృదయాలను దోచేస్తోంది. బీ టౌన్ లో అత్యంత క్రేజ్, సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న ఈ బ్యూటీ తాజాగా హాట్ ఫోటోలతో ఇంటర్నెట్ లో హీట్ పెంచుతోంది.
అద్భుతమైన నటనా నైపుణ్యంతో పాటు ఉత్కంఠభరితమైన అందంతో జాన్వీ కపూర్ అందరినీ ఆకట్టుకుంటోంది. దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా జాన్వీ తన తల్లి నిజమైన ఫ్యాషన్ ట్రెంట్స్ ను ప్రదర్శిస్తూ శభాష్ అనిపించుకుంటోంది.
అందరినీ విస్మయానికి గురిచే అద్భుతమైన ఫ్యాషన్ ట్రెండ్స్ ఫాలో అవుతూ ఎంతో మంది ఫ్యాషన్ లవర్స్ కు ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది. జాన్వీ లేటెస్ట్ లుక్స్ కూడా సోషల్ మీడియాలో మంటలు రేపుతున్నాయి.
జన్వీ నల్లని చీర కట్టుకుని దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి. అమ్మడి చీరకట్టు అందాలను చూసి ఫ్యాన్స్ నోరెళ్లబెడుతున్నారు.
జాన్వీ కపూర్ హాట్ లుక్స్ అందరినీ అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిన్నది తాజాగా జరిగిన ఓ ఈవెంట్ కోసం జాన్వీ ఎత్నిక్ లుక్‌ని ఎంచుకుంది. నల్లని షిఫాన్ చీరను సాంప్రదాయబద్దంగా కట్టుకుని అదరగొట్టింది.
ఈ ఫిణారం చీరను అందమైన ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసిన డిజైనర్ బ్లౌజ్ ధరించింది ఫ్యషన్ ప్రియుల మనసు దొంగిలించింది. బ్లాక్ హార్ట్ ఎమోజీలను జతచేసి ఈ చీరలో దిగిన ఫోటోలను జాన్వీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అభిమానులు ఆమె ఫోటోషూట్‌కు ఫిదా అయ్యారు.
ఇక జాన్వీ చీర డిజైన్ అంశాల విషయానికి వస్తే, షిఫాన్ చీరకు కొంగుపై క్లిష్టమైన పూసలు, సీక్విన్ పూల నమూనాలు, బార్డర్‌లలో థ్రెడ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఉన్నాయి.
జాన్వీ చీరను బ్లాక్ కలర్ స్టేట్‌మెంట్ బ్లౌజ్ తో జత చేసింది. ఫుల్ షీర్ స్లీవ్‌లు, కఫ్‌లపై పూసలతో కూడిన టసెల్స్ , హెవీ ఎంబ్రాయిడరీ డీప్ నెక్ లైన్ ఉన్న ఈ బ్లౌజ్ శారీకి మరింత అందాన్ని తీసుకువచ్చింది.
జాన్వీ తన శారీ లుక్ కు సెట్ అయ్యే విధంగా హెయిర్ లూజుగా వదులుకుని బ్రాంజ్ బేస్ మేకప్ వేసుకుంది. కనులకు స్మోకీ ఐ షాడోను దిద్దుకుంది , చేతివేళ్లకు సొగసైన డైమండ్ రింగ్, లాకెట్ ను అలంకరించుకుంది.
తన మనోహరమైన రూపంతో అందరిని మంత్రముగ్ధులను చేసింది జాన్వీ కపూర్.జాన్వీ కపూర్ తెలుగులో కొరటాల శివ డైరెక్షన్ లో రూపొందుతున్న దేవర సినిమాలో ఎన్టీఆర్ కు జోడీ గా చేస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఇదే జాన్వీ మొదటి తెలుగు సినిమా.
దేవరలో జాన్వీ ఓ మత్స్యకారుని కూతురిగా కనిపించబోతోందని తెలుస్తోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన జాన్వీ లుక్ చూస్తే అలాగే అనిపిస్తుంది.
దేవరతో పాటు జాన్వీకి మరో తెలుగు ఆఫర్ వచ్చిందని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో తీయబోతున్న మూవీలో జాన్వీని హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయంలో త్వరలో అధికారికంగా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీతో పాటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలోను అమ్మడు ఛాన్స్ కొట్టేసిందని టాక్. బుచ్చిబాబు డైరెక్షన్ లో తీయబోతున్న సినిమాలో జాన్వీని హీరోయిన్గా ఖరారు చేసినట్లు సమాచారం.