Citadel Web Series: మీరు రెడీనా..? సీటాడెల్ నుంచి బిగ్ అప్డేట్

WhatsApp Image 2024 03 18 at 2.45.56 PM Citadel Web Series: మీరు రెడీనా..? సీటాడెల్ నుంచి బిగ్ అప్డేట్

ఖుషీ(Kushi) తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సమంత (Samantha ruth prabhu)సీటాడెల్ (citadel)తో అలరించేందుకు రెడీ అయ్యింది. ఆమెను స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తారు. అయితే సామ్ చేతిలో ప్రస్తుతం సినిమాలు ఏమీ లేవు. దీంతో ఆమెను వెండితెరపై ఇప్పట్లో చూసే ఛాన్స్ లేదు. కానీ ఈ భామ త్వరలోనే తాను నటించి యాక్షన్ వెబ్ సిరీస్‌తో అభిమానులను పలకరించడానికి రెడీ అయ్యింది.

‘సిటాడెల్’షూట్ ఇప్పటికే పూర్తయ్యిందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో లేటెస్టుగా ‘సిటాడెల్’ నుండి సాలిడ్ అప్డేట్ వచ్చేసంది. ఈ వెబ్ సిరీస్ లో సమంతతో జోడీ కట్టిన బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhavan) ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. ఒక వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

వరుణ్ ధావన్ వీడియో వైరల్ :

వీడియోలో వరుణ్(Varun Dhavan) మాట్లాడుతూ”అందరికీ హాయ్..నేను మీ ప్రైమ్ ఫ్రెండ్ ని.మీకోసం ఓ సీక్రెట్ న్యూస్ మోసుకొచ్చాను. 2024లోనే అతిపెద్ద అనౌన్స్‌మెంట్ వచ్చేస్తోంది” అని వరుణ్ ఏదో చెప్పబోతుండగా.. సార్ ఇవన్నీ చెప్పకూడదు అంటూ మరో వాయిన్ వినిపిస్తుంది. “ఇప్పుడు చెప్పకూడదు కానీ మార్చి 19కి చెప్పొచ్చు కదా. మీరు రెడీనేనా?” అంటూ వీడియోను ఎండ్ చేశాడు వరుణ్ ధావన్. అయితే వరుణ్ షేర్ చేసిన వీడియోలో ఎక్కడా కూడా ‘సిటాడెల్’ పేరును వాడలేదు. కానీ అమెజాన్ ప్రైమ్‌తో కలిసి పోస్ట్ చేసిన వీడియో కాబట్టి ఇది ‘సిటాడెల్’(citadel)వెబ్ సిరీస్ అప్డేట్ గురించే అని అర్థమవుతోంది.

సీటాడెల్ షూటింగ్ కంప్లీట్ :

WhatsApp Image 2024 03 18 at 2.45.56 PM 1 1 Citadel Web Series: మీరు రెడీనా..? సీటాడెల్ నుంచి బిగ్ అప్డేట్

అమెరికన్ వెబ్ సిరీస్‌కు హిందీ వర్షన్‌గా తెరకెక్కుతోంది సిటాడెల్(citadel). అమెరికన్ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ కమ్ హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra)లీడ్ రోల్‌ను పోషించింది. ఈ హిందీ వర్షన్ రీమేక్‌లో ప్రియాంక చోప్రా పాత్రను సౌత్ సెన్సేషనల్ స్టార్ సమంత (Samantha)పోషిస్తోంది. రాజ్, డీకేలు డైరెక్ట్ చేస్తున్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయ్యింది. డైరెక్టర్లతో కలిసి వరుణ్ ధావన్, సమంత ఓ టీజర్ కట్‌ను కూడా చూశారు. టీజర్ చాలా బాగా వచ్చిందని చాలా కాలం క్రితమే సమంత సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.

సమంత పాత్రపైనే ఆసక్తి :

సినిమాలకు ధీటుగా హిందీ వెబ్ సిరీస్‌లను ఒక రేంజ్‌కు తీసుకెళ్లిన డైరెక్టర్లు రాజ్, డీకే (Raj&DK). వీరిద్దరూ రూపొందించిన ప్రతీ హిందీ వెబ్ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఓటీటీలో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నాయి. ఇప్పుడు అదే లిస్ట్‌లోకి ఎంటర్ అవుతోంది‘సిటాడెల్’(citadel).పైగా ఈ సిరీస్ లో సమంత (Samantha)లీడ్ రోల్ చేస్తుండటంతో ఈ సిరీస్‌కు భారీగా హైప్ క్రియేట్ అయ్యింది.

ఇప్పటికే సామ్ రాజ్, డీకే ల కాంబినేషన్ల లో ఫ్యామిలీ మ్యాన్ (Family Man) సిరీస్ చేసింది. ఈ సిరీస్ లో సమంత నెగిటివ్ షేడ్స్ లో కనిపించింది. అంతే కాదు యాక్షన్ సీన్స్‌లోనూ నటించి హిందీ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అందుకే ఇప్పటివరకు ఒక్క హిందీ సినిమా కూడా చేయకపోయినా సమంతకు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ వచ్చింది.

Leave a Comment