పుష్పతో జాన్వీ కపూర్ ఐటెం సాంగ్

website 6tvnews template 2024 03 01T111829.697 పుష్పతో జాన్వీ కపూర్ ఐటెం సాంగ్

Bollywood Actress Janhvi Kapoor to perform Pushpa-2 special song : అల్లు అర్జున్ (Allu Arjun) ఫ్యాన్స్, సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్స్ ‘పుష్ప2’ (Pushpa2) సుకుమార్ (Sukumar ) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప మొదటి భాగంలో బన్నీ యాక్టింగ్, ఫహద్ ఫాజిల్ (Fahad Fazil ) పెర్ఫార్మన్స్, రష్మిక మందన్న ( Rashika Mandanna) క్యూట్ నెస్ అందరిని బాగా ఆకట్టుకున్నాని.

మరీ ముఖ్యంగా ఈ ఒక్క సినిమాతో బన్నీ ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. అంతేకాదు జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారాన్ని కూడా అందుకున్నాడు . సౌత్ లోనే కాదు నార్త్ లోనూ పుష్ప ఓ రేంజ్ లో దుమ్ము దులిపింది బాక్స్ ఆఫీస్ లో భారీ వసూళ్లను సాధించింది.

బన్నీతో జాన్వీ?:

పుష్ప మొదటి భాగంలో సమంత (Samantha ) స్పెషల్ అట్రాక్షన్. ఆమె చేసిన ఉ అంటావా మావా సాంగ్ థియేటర్స్ లో ఓ రేంజ్ లో దుమ్ముదులిపింది. మాస్ మూమెంట్స్ తో బన్నీ, సామ్ స్క్రీన్ మీద రచ్చ రచ్చ చేశారు. ఈ జోడిని చూసి ఫ్యాన్స్ ఇలలతో గోల చేశారు.


ఇక ఇప్పుడు పుష్ప-2(Pushpa 2) లోనూ అలాంటి ఓ క్రేజీ పాట ఉందని సమాచారం. ఈ పాటలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీకపూర్(Janhvi Kapoor) కనిపించబోతోందని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తోంది. ఈ చిన్నది బన్నీ పక్కన మాస్ స్టెప్స్ వేసేందుకు రెడీ అయినట్లు సమాచారం. అయితే దీనిపై మేకర్స్ ఇప్పటి వరకు స్పందించలేదు.

దేవరలో ఎన్డీఆర్ సరసన జాన్వీ :

జాన్వీ కపూర్ (Janhvi Kapoor )కు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. కెరీర్ స్టార్ట్ చేసి కొద్ది రోజులే అయినా అమ్మడు ఓ వైపు సినిమాలు మరోవైపు ఫోటో షూట్స్ చేస్తూ సిల్వర్ స్క్రీన్ మీద, సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. బాలీవుడ్ లో పలు ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తోంది. మొదటిసారిగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR ) సరసన తెలుగులో భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తోంది ఈ భామ.

ప్రస్తుతం దేవర షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో నే పుష్ప టీమ్ స్పెషల్ సాంగ్ కోసం జాన్వీ కపూర్‌ని సంప్రదించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్ గా ఈ సాంగ్ ఆఫర్ టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela )కి చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆమె 2 కోట్లు డిమాండ్ చేయడంతో మేకర్స్ ఇప్పుడు జాన్వీ ని సంప్రదించినట్లు తెలుస్తోంది.

Leave a Comment