Anurag Kashyap: నా రేటు గంటకు రూ. 5 లక్షలు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

WhatsApp Image 2024 03 23 at 5.34.42 PM Anurag Kashyap: నా రేటు గంటకు రూ. 5 లక్షలు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ కాంట్రవర్సీ డైరెక్టర్ అనురాగ్ కష్యప్ (Anurag Kashyap)షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. ఇక నుంచి కొత్త వ్యక్తులను కలిసేందుకు డబ్బులు వసూలు చేస్తానని అనురాగ్ ఇన్‎స్టాగ్రామ్‎లో ఓ నోట్ పోస్ట్ చేశాడు. ఎవరైనా నన్ను 10 నుంచి 15 నిమిషాలు కలవాలనుకుంటే లక్ష రూపాయలు, అరగంట పాటు కలవాలంటే 2 లక్షలు ,గంట పాటు కలవాలంటే 5 చార్జ్ చేస్తానని చెప్పి అందరినీ షాక్ చేశారు. నేను కొత్తవారిని కలిసి చాలా సమయం వృధా చేసి విసిగిపోయాననని మండిపడ్డారు. అసలు ఉన్నట్లుండి అనురాగ్ కష్యప్ ఇలా తన రేట్లు ఎందుకు చెప్పాడు ? ఎవరిమీద ఫైర్ అవుతున్నాడు అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‎గా మారింది.

ఎలాంటి విషయం అయినా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి అనురాగ్ కష్యప్. ఆయన ఏం మాట్లాడినా అది వివాదం కావ్వాల్సిందే. ఈ డైరక్టర్ పై ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అయినా ఎలాంటి ప్రూఫ్స్ లేకపోవడంతో అవన్నీ ఫేక్ వార్తలని కొట్టిపారేశాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఒకపక్క డైరెక్టర్ గా, నటుడిగా అనురాగ్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే నెట్టింట్లో ఒక వైరల్ పోస్ట్ ను షేర్ చేశాడు. ఇకనుంచి తాను ఏ పని ఫ్రీగా చేయనని చెప్పేశాడు. తనతో ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే.. డబ్బులిచ్చి మాట్లాడవచ్చని తన రేట్లను చెప్పుకొచ్చాడు.

ఇన్ స్టాగ్రామ్ పోస్టులో “నేను ఇండస్ట్రీకి ఎంతోమందిని ఇంట్రడ్యూజ్ చేశాను. దాని వల్ల నా సమయాన్ని వృథా చేశాను. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఇకపై నేనేది ఫ్రీగా చేయను. నన్ను కలిసి, మాట్లాడాలని అనుకునేవారు ఖచ్చితంగా నేను పెట్టిన రేటును గౌరవించి డబ్బులు చెల్లించాలి. 10-15 నిమిషాలు నాతో మాట్లాడాలంటే రూ.1 లక్ష ఇవ్వాలి. అరగంట కలవాలంటే రూ.2 లక్షలు ఇవ్వాలి.. అదే గంటసేపు నాతో మాట్లాడటానికి రూ.5 లక్షలు చెల్లించాలి. మీ దగ్గర అంత డబ్బు ఉంటే.. నాతో మాట్లాడటానికి రండి. లేకపోతే మీ పని మీరు చూసుకోండి. షార్ట్ కట్ లో ఎదగాలి అనుకున్నవారిని చూసి చాలా విసిగిపోయాను. అంతే కాదు నా దగ్గరికి రావాలనుకునే వారు ఆ డబ్బులు మొత్తం ముందే అడ్వాన్స్ గా ఇవ్వాలి” అని తన పోస్ట్ ద్వారా అసహనం వ్యక్తం చేశారు.

Leave a Comment