వార్ 2 నుంచి సాలిడ్ అప్డేట్..60 రోజుల్లోనే షూటింగ్

download 14 వార్ 2 నుంచి సాలిడ్ అప్డేట్..60 రోజుల్లోనే షూటింగ్

update from War 2 Shootingstarts in 60 days : బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)కాంబోలో వస్తున్న పవర్ ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ వార్ 2 (War2). ఈ మూవీ కోసం అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ మూవీకి సంబంధించిన ప్రతి న్యూస్ నెట్టింట్లో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. రిలీజ్ కు ముందే సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నారు. ఈ నేపథ్యంలో వార్ 2 గురించి తాజాగా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ (Ayan Mukerji)ఒక గుడ్ న్యూస్ చెప్పాడు. ఈ మూవీ షూటింగ్ కేవలం 60 రోజుల్లోనే పూర్తవుతుందంటూ అందరూ షాక్ అయ్యేలా చేశాడు.

వార్ 2 వెరీ డిఫరెంట్ :

సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాల షూటింగ్‌లకు కనీసం ఒకటి రెండు సంవత్సరాలైనా పడుతుంది. మన టాలీవుడ్ లో అయితే జక్కన్న తీసే సినిమాల షూటింగ్ కు హీరోలు మూడేళ్లు కేటాయించాల్సిందే. డిఫరెంట్ లొకేషన్ లలో గ్రాఫికల్ వర్క్ తో భారీ సీన్లను షూట్ చేయడం వల్ల కచ్చితంగా సినిమా విడుదలకు కాస్త ఆలస్యమవుతుంటుంది. అయితే వార్ 2 (War2) సినిమా విషయంలో మాత్రం ఇది వర్తించదని తెలుస్తోంది.

హృతిక్ రోషన్ (Hrithik Roshan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) హీరోలుగా రూపుదిద్దుకుంటున్న యాక్షన్ మూవీ వార్ 2 ని బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కేవలం 60 రోజుల్లోనే పూర్తవుతుందని తాజాగా డైరెక్టర్ షాకింగ్ న్యూస్ చెప్పాడు. దీంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. రెండు నెలల్లోనే షూట్ పూర్తైతే వార్ 2, 2024లోనే రిలీజైనా ఆశ్చర్యపోనవసరం లేదని ఇండస్ట్రీలో టాక్.

షూటింగ్ కు 30 రోజులే

సిద్ధార్థ్‌ ఆనంద్‌ (Siddarth Anand) డైరెక్షన్ లో వచ్చిన ‘వార్‌’ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హాట్ సాధించింది. ఈ సినిమాలో హృతిక్, టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) నటించారు. అయితే క్లైమాక్స్ లో టైగర్ చనిపోతాడు.

ఇప్పుడు వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ (NTR), హృతిక్‌తో నటిస్తున్నాడు. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో షూటింగ్ ఓ రెండేళ్లు ఉంటుందని అంతా భావించారు కానీ డైరెక్టర్ అయాన్(Ayan Mukerji) మాత్రం హీరోలిద్దరి నుంచి కేవలం 60 రోజుల కాల్ షీట్స్ మాత్రమే తీసుకున్నాడట. వీరిద్దరి కాంబోలో వచ్చే సీన్స్ ను 30 రోజుల్లోనే షూట్ చేస్తాడట. మిగిలిన 30 రోజులు తన పార్ట్ షూటింగ్ చేస్తాడని సమాచారం.

జూన్‌లో హృతిక్‌ రోషన్‌ సీన్స్ షూటింగ్‌ పూర్తి చేసి, జూలైలో ఎన్టీఆర్‌ తో షూట్ చేస్తాడని సమాచారం. ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా స్టూడియోలోనే జరగనుందని టాక్. ఇందుకోసం అయాన్ ముఖర్జీ అన్ని ప్రిపరేషన్స్ చేస్తున్నాడట. అయితే స్క్రిప్ట్ వర్క్‌ కోసం కాస్త సమయం వెచ్చించాడు. దీంతో షూటింగ్ సులువుగా, వేగంగా జరుగుతుందని మేకర్స్‌ అంచనా వేస్తున్నారు.

ఎన్టీఆర్ కు రూ.100కోట్ల రెమ్యునరేషన్ ? :

భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రా ఏజెంట్ గా ఎన్టీఆర్ నటిస్తున్నాడని టాక్. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ కూడా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజాగా వార్ 2 గురించి అలాంటి న్యూస్ ఒకటితో ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా రూ.100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది.
ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ స్టార్స్ అవాక్కవుతున్నారట.

Leave a Comment