ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు మిదున్ చక్రవర్తి కి గుండె పోతూ రావడం తో అత్యవసరం గా కోలకోత లోని అపోలో హాస్పిటల్ కి తరలించారు. ఆయన కు అత్యవసర చికిస్థ అందిస్తున్నట్లు హాస్పిటల్ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేసారు.
అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియరావలసి ఉంది. ఈ ఏడాది జనవరి 25 న కేంద్ర ప్రభుత్వం ” పద్మభూషణ్ ” అవార్డు తో ఆయన్ని సత్కరించింది. మిథున్ చక్రవర్తి బెంగాలీ కుటుంబానికి చెందిన వాడైన బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించి ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందారు.
Hero Midhun Chakravarthy Heart stoke?
గతంలో కిడ్నీ సమస్యతో మిదున్ చక్రవర్తి చాలా బాధపడ్డారు. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో సుమారు రెండేళ్ల క్రితం ఆయనకు ఆపరేషన్ జరిగింది.
మళ్లీ ఇప్పుడు గుండెపోటు రావడంతో ఆయన కోల్‌కతాలోని ఆపోలో ఆసుపత్రిలో చేరారు. కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. దీంతో అభిమానులు త్వరగా ఆయన కోలుకోవాలని కోరుతూ దైవ పార్ధనలు చేస్తున్నారు. ఒకప్పుడు హీరోగా బెంగాలీ, హిందీ ఇండస్ట్రీలలో మిథున్ చక్రవర్తి దుమ్మురేపినట్లు సినీవర్గాలు చెప్పాయి.
శ్రీదేవి మిథున్ చక్రవర్తి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇటీవల ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రంలో మిథున్ చక్రవర్తి మెప్పించిన విషయం అందరికి తెలిసిందే.