‘యానిమల్ పార్క్’విలన్‌‎గా విక్కీ కౌశల్?

website 6tvnews template 2024 03 01T155348.814 ‘యానిమల్ పార్క్’విలన్‌‎గా విక్కీ కౌశల్?

Bollywood Young Hero plays Negative role in Sandeep Reddy Vanga Animal Park : బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో వచ్చింద మూవీ ‘యానిమల్‌’ (Animal). బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ రికార్డుల వర్షం కురిపించింది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ లోనూ మంచి రెస్పిన్స్ సొంతం చేసుకుంది.

ఈ సినిమాపై మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం భారీ వసూళ్లను రాబట్టింది. ఇక యానిమల్ సీక్వెల్ గా సందీప్ రెడ్డి ఆయనిమల్ పార్క్ తెరకెక్కిస్తున్నాడు. దీంతో ప్రేక్షకులంతా ఈ సీక్వెల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే హీరో రణ్‎బీర్ కపూర్ ఈ మూవీ యానిమల్ కన్నా మరింత బోల్డ్ గా ఉంటుందని చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇక యానిమల్ పార్క్ పైన రోజుకో రూమర్ బాలీవుడ్ లో షికారు చేస్తోంది. ఈ మూవీలో విలన్ పాత్రపై రోజుకో వార్త వైరల్ అవుతోంది.

వాస్తవానికి యానిమల్ క్లైమాక్స్ లో బాబీ డియోల్ (Bobby Deol)క్యారెక్టర్ ముగుస్తుంది. ఎండ్ క్రెడిట్స్ లో సీక్వెల్‌లో రణబీర్ కపూరే విలన్‌గా కనిపించనున్నట్టు డైరెక్టర్ రివీల్ చేశాడు. ఇదిలా ఉంటే ఈ మూవీలో మరో విలన్‌ కూడా ఉండవచ్చని తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal) విలన్ పాత్ర పోషిస్తున్నాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

ఆ స్థానంలోకి విక్కీ కౌశల్ :


యానిమల్ సినిమాలో రణ్‌బీర్‌ (Ranbir Kapoor) కు థీటుగా బాబీ డియోల్ (Bobby Deol)విలన్ గా కనిపించాడు. ఈ పాత్రకు బాబీ 100 శాతం న్యాయం చేశాడు. సిక్స్ ప్యాక్ బాడీతో అందరిని అట్రాక్ట్ చేశాడు. ఇక‘యానిమల్ పార్క్’ (Animal Park)లో రణబీర్ కపూర్‌ను ఎదిరించేందుకు యంగ్ హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal)రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ ‘సంజు’(Sanju) మూవీలో కలిసి నటించారు. ఈ మూవీ విక్కీ కౌశల్‌కు మంచి బిగ్ బ్రేక్ ఇచ్చింది. అప్పటి నుంచి విక్కీ చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. ఈ మధ్యనే విక్కీ నటించిన మూవీ శామ్ బహద్దూర్ (Sambahadur)లో చాలా న్యేచురల్ గా నటించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు.

దీంతో యానిమల్ పార్క్ లో అవకాశం దక్కించుకున్నాడని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే ఈ విషయాన్ని మాత్రం బాబీ డియోల్ ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. ‘యానిమల్ పార్క్’లో బాబీ డియోల్ లేడనే వార్త వైరల్ కావడంతో ఫీల్ అవుతున్నారు. మరికొందరు మాత్రం విక్కీ కౌశల్ విలన్‌గా పూర్తి న్యాయం చేస్తాడని విశ్వసిస్తున్నారు. ఈ న్యూస్ బాలీవుడ్ లో ఆసక్తిని పెంచుతోంది.

విక్కీ సినిమాలో విలన్‎గా రణ్‌బీర్‌ :


బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న మూవీ ‘లవ్ అండ్ వార్’(Love And War). ఈ మూవీలోనూ విక్కీ, రణ్ బీర్ కలిసి నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఇలా రణబీర్, విక్కీ కౌశల్ బ్యాక్ టు బ్యాక్ ఒకే స్క్రీన్‌పై కనిపించడం అద్భుతంగా ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


ఇక విక్కీ ఈ సినిమాలతో పాటు ఛావ (Chhava)లోనూ నటిస్తున్నాడు. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోంది. అంతే కాదు ఈ సినిమా కోసం విక్కీ కౌశల్‌ తీసుకున్న నిర్ణయం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. విక్కీ కౌశల్‌ ఛావ కోసం ఏకంగా 25 కిలోలు బరువు పెరగబోతున్నాడట. ఈ సినిమాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్‌(Chatrapathi Sambhaji Maharaj) క్యారెక్టర్ ను విక్కీ పోషిస్తున్నాడు. ఈ రోల్‌ కోసమే విక్కీ బరువు పెరిగేందుకు నిర్ణయం తీసుకున్నాడని సమాచారం.

Leave a Comment