అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి (Sridevi)ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లెజెండరీ యాక్ట్రెస్ గా ఓ వెలుగు వెలిగారు. సౌత్, నార్త్ అనే తేడాలేకుండా కొన్ని వందల సినిమాల్లో హీరోయిన్ గా నటించి తన అందంతో నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. స్టార్ హీరోలతో జోడీ కట్టి ఎన్నో హిట్ సినిమాలను చేసింది శ్రీదేవి. రియల్ లైఫ్ లోనూ బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూజర్ బోనీ కపూర్ (Boney Kapoor) ను పెళ్లి చేసుకుని ఇద్దరు కూతుర్లకు అమ్మైంది. కూతుర్లు ఇద్దరికీ తల్లి అందం వచ్చింది.
వారిని స్టార్స్ గా నిలబెడదామనుకునేలోపే దుబాయ్(Dubai)లో అనూహ్య రీతిలో ఆమె చనిపోయింది. దీంతో సినీ అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. చిత్ర పరిశ్రమ ఓ దిగ్గజ నటిని కోల్పోయింది. ఆమె చనిపోయిన తర్వాత చాలా మంది శ్రీదేవి బయోపిక్ ను తెరకెక్కించేందుకు ప్రయత్నించారు. కానీ అది గుదరలేదు. శ్రీదేవీ భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ అందుకు అడ్డుగా నిలుచున్నారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి బోనీ కపూర్ శ్రీదేవి బయోపిక్ పై స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
శ్రీదేవి బయోపిక్ తీయనివ్వను :
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ (Ajay Devgan)వరుసగా హిట్లు కొడుతున్నారు. ఈ మధ్యనే బాలీవుడ్ లో అజయ్, తమిళ స్టార్ హీరోయిన్ జ్యోతిక (Jyothika), మాధవన్ (Madhavan)కాంబినేషన్ లో షైతాన్ (Shaitan )అనే సినిమా విడుదలైంది. ఈ హారర్ మూవీకి ప్రేక్షకులు బాగానే మార్కులు వేశారు. ఆ సినిమా తర్వాత అజయ్ దేవగన్ ‘మైదాన్’(Maidan) మూవీ చేశాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ మూవీని బోనీ కపూర్ (Boney Kapoor)ప్రొడ్యూజ్ చేస్తున్నాడు. ఈనెల 10న ఈ మూవీ రిలీజ్ కానుంది. రిలీజ్ టైం దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. రీసెంట్ గా బోనీ కపూర్ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యారు.
ఈ క్రమంలో ఆయన శ్రీదేవి బయోపిక్ (Sridevi Biopic) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బోనీ కపూర్ మాట్లాడుతూ…”శ్రీదేవి సెలబ్రిటీ అయినా తన పర్సనల్ లైఫ్ ను ఎప్పుడూ ప్రైవేట్ గా ఉంచుకునేది. ఆమెకు అలా ఉండటమే ఇష్టం. ఆమె ఎప్పుడూ తన పర్సనల్ విషయాలను షేర్ చేసేది కాదు. ఆమె చనిపోయే వరకూ అలాగే ఉంది. ఇప్పుడు ఆమె పర్సనల్ విషయాలను బయటకు చెప్పేందుకు నాకు ఇష్టం లేదు. నేను బతికుండగా ఆమె బయోపిక్ తీయనివ్వను”. అని బోనీ కపూర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.
అప్పట్లో‘శ్రీదేవి బంగ్లా’పై కేసు :
అప్పట్లో బాలీవుడ్ లో శ్రీదేవి (Sridevi) బయోపిక్ కు దగ్గరగా ఉన్న ఓ సినిమా విడుదలకు రెడీ అయ్యింది. శ్రీదేవి బంగ్లా(Sridevi Banglow) పేరుతో రూపొందిన ఈ మూవీలో కన్నుగీటు భామ ప్రియా ప్రకాష్ వారియర్ (Priya Prakash warior)హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ట్రైలర్ అప్పట్లో సెన్సేషనల్ అయ్యింది. ఇది చూసిన బోనీ కపూర్ మూవీ రిలీజ్ ను అడ్డుకున్నారు. ఈ సినిమా శ్రీదేవి రియల్ లైఫ్ కు దగ్గరగా ఉండటంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.
తీర్పు బోనీకి మద్దతుగా రావడంతో ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత మరెవర్వూ ఆమె సినిమాను విడుదల చేసే ప్రయత్నం చేయలేదు. ఇదిలా ఉంటే శ్రీదేవి జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను బేస్ చేసుకుని ఫేమస్ రైటర్ ధీరజ్, ఆమె బయోగ్రఫీని రాస్తున్నారు. ‘ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్’ అని ఓ బుక్ ఆయన రాయబోతున్నారు. శ్రీదేవి ఫ్యామిలీ మెంబర్స్ పర్మీషన్ కూడా తీసుకున్నారు.