BookMyShow Crashed due to Salaar Fans: సలార్ తాకిడికి బుక్ మై షో సర్వర్ క్రాష్.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ ఈ డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఇంతకు ముందు వచ్చిన ఆదిపురుష్ అందరి అంచనాలకు భిన్నంగా తలకిందులయింది. ఇక ప్రభాస్ అభిమనులు సలార్ మీద భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.
సలార్ టికెట్ బుకింగ్ లో బుక్ మై షో క్రాష్:
డార్లింగ్ ప్రభాస్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సలార్ సినిమా మరికొన్ని గంటలలో థియేటర్ లలోకి రానుంది.
టికెట్స్ కొనుగోలు సందడి మంగళవారం రాత్రి మొదలైంది, ఆన్లైన్ లో టిక్కెట్లను డిస్ట్రిబ్యూటర్లు ఇలా విడుదల చేయగానే, ప్రభాస్ అభిమనులంతా ఒక్కసారిగా సినిమా టిక్కెట్లు బుక్ చేయడం మొదలు పెట్టారు, లక్షల సంఖ్యలో ఈ టిక్కెట్ల కొనుగోళ్లు జరగడంతో బుక్ మై షో ఒక్కసారిగా క్రాష్ అయ్యింది.
దీనివల్ల టిక్కెట్లు బుక్ అవ్వడం ఆగిపోయాయి. దానితో నిరాశ చెందిన డార్లింగ్ ఫాన్స్, టికెట్ బుకింగ్ లో ఎదురైన ప్రాబ్లమ్ ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. వీరిలో బాహుబలి నిర్మాతలలో ఒకరైన శోభు యార్లగడ్డ కూడా ఉన్నారు.
ఇదంతా చూసిన బుక్ మై షో టీం, టిక్కెట్ల కొనుగోలుకి కాస్త బ్రేక్ ఇచ్చి అన్నీ థియేటర్ లు ఒక్కసారి కాకుండా ఒక్కో థియేటర్ లో ఒక్కసారి టిక్కెట్ల విక్రయాన్ని మొదలు పెట్టారు.
కౌంటర్ల వద్ద టికెట్ల అమ్మకాలు:
నైజాంలో మైత్రి మూవీ మేకర్స్ కేవలం మల్టీప్లెక్స్ లో మాత్రమే ఆన్లైన్ బుకింగ్ కి టిక్కెట్లు పెట్టింది. సింగల్ స్క్రీన్ లలో టిక్కెట్లు కౌంటర్ల దగ్గరే అమ్మకాలు జరుగుతున్నాయి.
టిక్కెట్లు అమ్మకం మొదలు పెట్టిన తరువాత ఆ సమయంలోనే ఫాన్స్ పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి కొనుగోలు ప్రారంభించారు, అయితే అంతా మంది రావడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడి తోపులాట జరిగినది,
దాంతో పోలీసులు అక్కడ లాఠి ఛార్జీలు చేశారు, కొంత మందికి గాయాలు కూడా అయ్యాయి. దీనితో సోషల్ మీడియాలో అభిమనులు మైత్రీ మూవీ మేకర్స్ పై మండి పడ్డారు, ఈ కాలం లో కూడా కౌంటర్ల వద్దే టిక్కెట్ల అమ్మకాలు ఏంటి అని..