Booking for Ayodya raama haarathi: అయోధ్య హారతి చూడాలని ఉందా.. ప్రీ పాసుల కోసం బుకింగ్ చేసుకోండిలా.

Do you want to see Ayodhya Aarti? Do you book for pre passes

Booking for Ayodya raama haarathi:అయోధ్య హారతి.. అయితే, ప్రీ పాసుల కోసం బుకింగ్ చేసుకోండిలా.

అయోధ్య రామాలయం ఓపెనింగ్ కి అన్నీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఆ ఆలయ ట్రష్టు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ రామలంలో హారతి కార్యక్రమానికి హాజరయ్యేందుకు భక్తులను కూడా ఆహ్వానిస్తున్నారు, ఆ ఆలయ ట్రస్టు అధికారులు.

ఇప్పటివరకు ఆఫ్​లైన్​లో జారీ చేస్తున్న ఈ పాసులను ఇకనుంచి ఆన్​లైన్​లోనూ అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది.

ప్రారంభోత్సవం అనంతరం రోజుకు మూడు పూటలు హారతి కార్యక్రమం ఉంటుందని, భక్తులకు ఉచితంగానే ఈ పాసులను అందిస్తామని ఆ ఆలయ ట్రస్టు అధికారులు తెలిపారు.

ఈ హారతి కార్యక్రమానికి 30 మంది భక్తులకే అనుమతి ఉంటుందని సంబంధిత సెక్షన్ మేనేజర్ ధ్రువేశ్ మిశ్ర స్పష్టం చేశారు.

రామజన్మభూమిలో రోజుకు మూడుసార్లు హారతి కార్యక్రమం ఉంటుందని, ప్రతి ఉదయం శృంగార హారతి, మధ్యాహ్నం భోగ హారతి, సాయంత్రం సంధ్యా హారతి నిర్వహిస్తారని తెలిపారు.

ఎవరి దగ్గర అయితే పాసులు ఉంటాయో వారే హారతి కార్యక్రమానికి వెళ్లే అవకాశం ఉంటుందని, నిబంధనల ప్రకారం ప్రస్తుతానికి 30 మంది వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉంన్నట్లుగా ఆ ట్రష్టు అధికారులు పేర్కొన్నారు.

ఆన్​లైన్​లోనూ ఈ సేవ అందుబాటులో ఉంంటుందని, రామజన్మభూమి అధికార వెబ్​సైట్​లో హారతి పాసు కోసం దరఖాస్తు చేసుకోవచ్చుని తెలిపారు.

ఆన్​లైన్​లో అప్లై చేసిన తర్వాత ఇక్కడి వచ్చి కేంద్రంలో పాసులు తీసుకొని హారతికి వెళ్లొచ్చని ధ్రువేశ్ మిశ్ర, ఆయోధ్య రామాలయం హారతి పాసుల సెక్షన్ మేనేజర్ తెలియజేసారు.

భద్రతా కారణాల రీత్యా హారతికి 30 మందిని మాత్రమే అనుమతిస్తున్నారని, భవిష్యత్​లో ఈ పరిమితిని సడలించే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్​పోర్ట్​లో ఏదైనా ధ్రువపత్రాన్ని చూపించి పాసులు తీసుకోవచ్చని తెలిపారు. ఆన్​లైన్​లో 20 చొప్పున పాసులు అందుబాటులో ఉంటాయని, నచ్చిన తేదీలకు ముందస్తు బుక్ చేసుకోవచ్చని చెప్పారు.

మరోవైపు, భక్తులు తమ వస్తువులను భద్రపరుచుకునేందుకు వీలుగా ఆలయ పరిసరాల్లో లాకర్ సెంటర్​ను ఏర్పాటు చేశారు. 700కు పైగా లాకర్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

సీసీ కెమెరాల నిఘా మధ్య ఈ లాకర్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. లగేజీ భద్రపరుచుకునేందుకు సైతం సెంటర్లను ఏర్పాటు చేసినట్టు ట్రస్ట్ అధికారులు తెలిపారు.

అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. రామాలయం ప్రాంగణంలో సెక్యూరిటీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు.

వాహనాల స్కానింగ్ పరికరాలు, రహదారులపై బ్యారియర్లు నెలకొల్పినట్లు అధికారులు తెలిపారు. వాహనాల్లో ఏదైనా నిషేధిత వస్తువులు తీసుకెళ్తే గుర్తించేలా సాంకేతికత ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.

Leave a Comment