కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్న BRS లీడర్లు – ఒకప్పుడు KCR చేసిందే

WhatsApp Image 2024 03 21 at 4.16.39 PM కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్న BRS లీడర్లు - ఒకప్పుడు KCR చేసిందే

BRS చెందినా ముధోల్ మాజీ MLA విఠల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి KCR కి షాక్ ఇచ్చారు. BRS పార్టీ అధికారం నుండి గద్దె దిగిపోయాక పలువురు నాయకుల వరస పెట్టి కాంగ్రెస్ లోకి జంప్ చేస్తున్నారు. నేడు విఠల్ రెడ్డి వంతు వచ్చింది. ఆయన కూడా BRS పార్టీ కి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. ఈరోజు CM రేవెంత్ రెడ్డి తో పాటు ఇతర మంత్రులు సీతక్క,కోమటిరెడ్డి వెంకట రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన్ను సీతక్క పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తునట్లు ప్రకటించారు.

విఠల్ రెడ్డి 2014 సంవత్సరం లో ముధోల్ నుండి BRS పార్టీ MLA గా పోటీ చేసి విజయం సాధించారు. అలాగే ఇంకో సారి 2018 ఇదే పార్టీ నుండి పోటీ చేసి గెలవడం జరిగింది. క్రిందటి ఎన్నికలలో అంటే 2023 లో BRS పార్టీ నుండి పోటీ చేసి BJP అభ్యర్ది చేతిలో అపజయం పొందారు. ఆయన సమీప BJP అభ్యర్ది రామారావు కి 24 వేల మెజార్టీ తో గెలిపొందారు.

Leave a Comment