B.R.S. MLA లాస్య నందిత హఠాన్మరణం – KCR దిగ్బ్రాంతి.

website 6tvnews template 86 B.R.S. MLA లాస్య నందిత హఠాన్మరణం - KCR దిగ్బ్రాంతి.

Brs mla lasya died in car accident : రోజు రోజు కి రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. దీనికి కారణం నిర్లక్ష్య దోరణి అని చెప్పవచ్చు. ఈరోజుల్లో ఎవరు, ఎక్కడ,ఎప్పుడు, ఎలా చనిపోతున్నారనే విషయం చెప్పడం కష్టం గా ఉంది. నిన్న కనిపించిన వారు ఈరోజు ఉంటారో లేదో చెప్పలేకపోతున్నం.

తాజా గా ఎమ్మెల్యే లాస్య నందిత మరణం మాటల్లో చెప్పలేనిది. ఔటర్ రింగ్ రోడ్డు మీద జరిగిన ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ బలం గా డీకొట్టడం వల్ల ప్రమాదం జరిగిందని అదేసమయం లో ఆమె ఆ ప్రదేశం లోనే ప్రాణాలు కోల్పోవడం భాధాకరం.

ఈ మూడు కారణాలు వల్లే ప్రమాదం:

ఈ ప్రమాదం జరగడానికి 3 కారణాలు గా తెలుస్తోంది. మొదటగా సేఫ్టీ రేటింగ్ లో తక్కువ రేటింగ్ ఉన్న మారుతీ సుజుకి XL 6 మోడల్ కారు అని, ఇక రెండవది లాస్య నందిత సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, మూడవది మిడిల్ కాని లేదా వెనక కూర్చున్నవారు సీటు బెల్ట్ పెట్టుకోవలసిన అవసరం లేదు అనే భ్రమ.

ఇక ముందు కూర్చున్న వారు ఎక్కువగా ప్రమాదానికి గురి అవుతారు. వెనక కూర్చున్నవారికి ఎం కాదు అనుకోవడం ఇంకో కారణం. మధ్యలో కూర్చున్నవారు కుడా 90% మంది సీటు బెల్ట్ పెట్టుకోకపోతే ఎం కాదు అనుకుంటారు. కాని ఇప్పుడు మధ్యలో కూర్చున్న లాస్య నందిత సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగినపుడు ఆమె బలం గా ముందు సీటును కొట్టుకోవడం వల్ల ఆమె మెదడు లోపల నరాలు దెబ్బ తినడం వల్ల అమె అక్కడికక్కడే చనిపోయారు.

ముఖ్యం మూడో కారణం నిద్ర మత్తు, ఆమె P A కారు నడపడం అదే సమయం లో అతను నిద్ర మత్తు లో ఉన్నాడని తెలుస్తోంది. ఇంతకుముందు ఒకసారి ఇతనే కారు నడిపి నపుడు స్కార్పియో కారుకు ప్రమాదం జరిగింది. ఆ సమయం లో లాస్య చిన్న చిన్న దెబ్బలతో ప్రమదం నుండి బయటపడ్డారు. మళ్ళి అదే డ్రైవర్ డ్రైవింగ్ చేస్తుండగా ఈ సారి ప్రాణాలే పోయాయి. ఇది చాల దురదృష్టకరం.

ఈమె దివంగత ఎమ్మల్యే సాయన్న కుమార్తె. క్రిందటి సంవత్సరం ఫిబ్రవరి 19 న సాయన్న మృతి చెందారు. సంవత్సరం తిరిగే సరికి ఆయన కూతురు లాస్య నందిత ఎలా ప్రమాదం లో ప్రాణాలు కోల్పోవడం చాల భాధాకరం. ఆమె ఇటీవల కంటోన్మెంట్ ఏరియ నుండి పోటీ చేసి గెలిచారు.

Leave a Comment