BRS MLA met with CM Revanth Reddy : ఇటీవలి కాలంలో భారతీయ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు(BRS MLA’s) కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని(Telangana CM Revanth Reddy) కలవడం చర్చనీయాంశంగా మారింది.
మొన్నటికి మొన్న మెదక్ పార్లమెంట్(Medak Parliament Constituency) నియోజకవర్గం లోని నలుగురు ఎమ్యెల్యేలు రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవగా ఇప్పుడు మరో బిఆర్ఎస్ నేత, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్(MLA Prakash Goud) రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు.
వీరి భేటీ దాదాపు గంట పాటు సాగినట్టు తెలుస్తోంది. ప్రకాష్ గౌడ్, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఒకప్పుడు తెలుగు దేశం పార్టీలో(Telugu desam party) కలిసి పనిచేసినవారే. ఈ ఇద్దరు నేతలు కూడా 2009, 2014 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ నుండి గెలుపొందిన వారే.
అయితే 2014 తరువాత ప్రకాష్ గౌడ్ బిఆర్ఎస్ గూటికి చేరుకోగా, 2017 లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్(Congress Party) పార్టీ లో జాయిన్ అయ్యారు.
ప్రస్తుతం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ(Chevella parliament Constituency) సమావేశం నిర్వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ, ఇలాంటి తరుణంలో ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ తో భేటీ అవ్వనుండటం సంచలనాలకు దారి తీస్తోంది. అందులోను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం చుస్తే చేవెళ్ల పార్లమెంట్ స్థానం కిందే ఉంటుంది.
మర్యాద పూర్వక భేటీనే అంటున్న ఎమ్మెల్యే : MLA says it is Just courtesy Meet Only
వీరిద్దరు కలిసి భేటీ అయినా సమయంలో రేవంత్ మిత్రుడు వేం నరేందర్ రెడ్డి కూడా అక్కడే ఉండటం గమనించదగ్గ విషయం.
అయితే ఈ భేటీ కన్నా ముందే తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ప్రకాష్ గౌడ్ తో ఒకదఫా భేటీ అయినట్టు తెలుస్తోంది.
ఇక ముఖ్య మంత్రి, మంత్రి తో కరిగిన ఈ భేటీలపై ప్రకాష్ గౌడ్ పెదవి విప్పారు. ఇవి కేవలం మర్యాదపూర్వక కలయిక మాత్రమే అని అన్నారు. తన నియోజకవర్గ సమస్యల విషయంలో ముఖ్య మంత్రి అలాగే మంత్రితో చర్చించానని చెప్పారు.
తన కాన్స్టిట్యూఎన్సి డెవెలప్మెంట్ కోసం నిధులు మంజూరు చేయాలనీ కోరినట్టు పేర్కొన్నారు. తన విన్నపాన్ని సీఎం రేవంత్ కూడా సానుకూలంగానే స్పందించారని అన్నారు.