రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు మందు BRS పార్టీకి షాకిస్తూ ఒక్కక్కరు బయటకి వస్తున్నారు. ఇక ఆ పార్టీ పని అయిపొయింది అనో లేక రక రకాల కేసుల విషయం లో తాము ఎక్కడ భాద్యులు అవుతామని భయమో అని భయపడి ఒక్కక్కరు పార్టీ వీడుతున్నారు. అయితే ఇప్పటికే వీరిలో కొంత మంది కాంగ్రెస్ లో జేరడం కూడా జరిగింది. చోట లీడర్ల నుండి బడా నేతల వరకు అందరు కాంగ్రెస్ కి క్యు కట్టడం BRS పార్టీ కి మింగుడు పడడం లేదు.
ఇప్పుడు స్టేషన్ ఘన్‌పూర్ కి చెందిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుడా కారుకు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయన కూతురు అయిన డాక్టర్ కావ్యతో కలిసి CM రేవంత్ రెడ్డి కలిసి వారి సుముఖతని తెలపడం తో ఆయనతో పాటు ఆయన కూతురు కావ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరగానే వరంగల్ MP అభ్యర్థిగా కావ్య పేరును ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. కడియం పార్టీ మారడం పై BRS నేతలు చాలా తీవ్రం గా ఫైరవుతున్నారు. తమ పార్టీలో ఎవ్వరికి కాదని ఆయనకి డిప్యూటీ CM తో పాటు ఎన్నో రకాల పదవులు ఇచ్చామని తీరా పార్టీ కష్టకాలంలో ద్రోహం చేసి ఎలా వెళ్లిపోతారని BRS మండిపడుతున్నారు.
పార్టీ మార్పుపై కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత మొదటిసారి స్పదించారు. ఇటీవల వరంగల్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అననతరం ఆయన BRS పార్టీని బయటకి రావడం కొంత బాధగానే ఉన్న అయిన బయటకి రాక తప్పలేదు అని ఆయన చెప్పారు. BRS అధినేత, మాజీ CM – KCR పట్ల నాకు ఇప్పటికీ గౌరవం ఉందని చెప్పారు. అందువల్ల నేను ఆయనపై ఎలాంటి విమర్శలు చెయ్యాలని అనుకోవడం లేదని చెప్పారు. అలాగే BRS పార్టీ కుడా తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చిందని, అయితే నేను వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయాను అంతే అని అన్నారు.
ప్రస్తుతం రోజు రోజుకి రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయని ఆయన అన్నారు. నా నియోజవర్గం స్టేషన్ ఘన్‌పూర్ అభివృద్ధి చెందాలంటే పార్టీ మారడం తప్ప వేరే దారి లేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పారు. అంతే కాదు కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థల అన్నింటిని నాశనం చేస్తోందన్నారు. నాకు ప్రతిపక్షంలో ఉండి అభివృద్ధి చేయలేనన్న ఆవేదన నాలో ఇప్పటికి ఉందని అన్నారు.
BRS పార్టీ వాళ్ళు సభ్యత, సంస్కారం మరిచి తనపై లేని పోనివి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కాని నేను వాళ్లలా దిగజారి మాట్లాడలేనని అన్నారు. కానీ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు గారు ఏం మాట్లాడుతున్నారో కూడా నాకు అర్థం కావటం లేదని అని అన్నారు. ఎర్రబెల్లి దయాకరరావు గారు అహంకారుపు, బలుపు మాటలు తగ్గించుకుంటే మంచిది అని ఆయన హెచ్చరించారు.