తెలంగాణా లో BRS పార్టీ కి దెబ్బ మీద దెబ్బ – ఇపుడు మరొకరు ?

367405 picsart24 03 2815 55 30 703 తెలంగాణా లో BRS పార్టీ కి దెబ్బ మీద దెబ్బ - ఇపుడు మరొకరు ?

లోక్‌సభ ఎన్నికలు వస్తున్న సమయం లో BRS పార్టీ కి మరో షాక్ తగిలిందనే చెప్పాలి. BRS సీనియర్ MP కే కేశవరావు, అలాగే ఆయన కుమార్తె, GHMC మాజీ మేయర్ విజయలక్ష్మి వీరు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అనే మాట నిజం చేస్తూ ఈరోజు విజయలక్ష్మి కాగ్రెస్ పార్టీ లో చేరారు. TPCC చీఫ్, CM రేవంత్ రెడ్డి సమక్షంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అధికార పార్టీలో ఉంటేనే సమస్యల పరిష్కారం తొందరగా లభిస్తుందని అందుకే కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నట్లు ఆమె చెప్పారు.

MP కే కేశవరావు కూడా పార్టీ మారడం పై స్పందించారు తాను కుడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలనుకుంటున్నానని, ఇంతకు ముందు ఆ పార్టి లోనే చాలా కాలం పాటు కాంగ్రెస్ కు తన సేవలు అందించానని ఆయన చెప్పారు. KCR తనకు చాలా గౌరవ మర్యాదలు ఇచ్చారని, తనకు కూడా ఆయన అంటే గౌరవం ఉందని చెప్పారు. తాను ఈ BRS లో ఉన్నంత కాలం తనకు నేతలు, కార్యకర్తలు కూడా తనకు బాగా సహకరించారని చెప్పారు. తాను మళ్ళి 84 ఏళ్ల వయస్సులో తిరిగి సొంత పార్టీకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాని ఆయన చెప్పారు.

ఇంతకు ముందు ఆయన BRS అధినేత, మాజీ CM – KCR ను ఆయన ఫాంహౌస్‌ లో కలిసి చాల సేపు చర్చలు జరిపారు. పార్టీ జరుగుతున్న పరిణామాలు, కవిత అరెస్టు తో పాటు ఇతర అంశాల పై KCR తో మాట్లాడినట్లు ఆయన చెప్పారు. అయితే MP కే కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరడం KCR కొంత అసహనం తో ఉన్నట్లు తెలుస్తోంది.

MP కే కేశవరావు పార్టీ లో ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన ఎందుకు వెళుతున్నారో తనకి అర్థం కావడం లేదని KCR ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే MP కే కేశవరావు కుమారుడు తాను మాత్రం BRS పార్టీలోనే ఉండాలని అనుకున్తున్నాని అయితే తన తండ్రి, సోదరి నిర్ణయాలతో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు.

Leave a Comment