BRS party Nominations dates : నామినేషన్లకు ముగియనున్న గడువు.చివరి రెండు రోజుల్లో నామినేషన్ వేస్తున్న బడా నేతలు.

13 1 BRS party Nominations dates : నామినేషన్లకు ముగియనున్న గడువు.చివరి రెండు రోజుల్లో నామినేషన్ వేస్తున్న బడా నేతలు.

BRS party Nominations dates : నామినేషన్లకు ముగియనున్న గడువు.చివరి రెండు రోజుల్లో నామినేషన్ వేస్తున్న బడా నేతలు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల గడువు నవంబర్ 10 వ తేదీతో ముగియబోతోంది. అంటే రేపే ఆఖరు తేదీ. నామినేషన్లకు ఆఖరు తేదీ రేపే అని అంత ప్రత్యేకంగా చెప్పాల్సిన వసరం ఏముంది అంటారా. అక్కడే ఉంది అసలు విషయం.

ఎన్నికల్లో పొటీ చేయదలచిన అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు ఈసీ నవంబర్ మూడవ తేదీ నుండి నవంబర్ 10 వ తేదీ వరకు గడువు ఇచ్చింది. అయితే ఈ సమయంలోపు ఖచ్చితంగా నామినేషన్ వేసి తీరాల్సిందే. లేదంటే పోటీ లో నిలబడే ఛాన్స్ మిస్సయినట్టే.

పైగా 3వ తేదీ నుండి 10వ తేదీ లో ఒక రోజు ఆదివారం కూడా వచ్చింది. ఆదివారం సెలవు దినం కాబట్టి ఒక రోజు హులక్కే. ఆదివారం విషయం పక్కనపెడితే మూడు నుండి 8 వ తేదీ లోపు చాల మంది నామినేషన్ వేసేసి ఉంటారేమో అనుకోవచ్చు. కానీ ఆలా జరగలేదు. కారణమేమిటంటే అవి మంచి ముహుర్తాలు కావట.

కాబట్టి నిన్నటివరకు నామినేషన్లు వేసినవారి సంఖ్య చాలా తక్కువే అంటున్నారు. 9, 10 తేదీల్లో నామినేషన్ వేసే వారి సంఖ్యా ఎక్కువగానే ఉంటుంది అంటున్నారు అధికారులు. 8వ తేదీ బుధవారం తిథి, వారం బాగున్నా.. పూర్వఫల్గుణి నక్షత్రం ఉండటంతో పలువురు అభ్యర్థులు మొదటి సెట్ నామినేషన్లు దాఖలు చేశారు.

దీనిని బట్టి చూస్తుంటే నేతలు ఎన్నికల నామినేషన్ వేసేందుకు పెళ్లి ముహూర్తం కన్నా బలమైన ముహుర్తాలు చూసుకుంతున్నట్టు ఉన్నారు. గురువారం ఏకాదశి కావడం, ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఉండడం, తేదీ తొమ్మిది సంఖ్య ఉండడంతో నామినేషన్‌‌‌‌‌‌‌‌ సమర్పించేందుకు ఈ రోజున ఎక్కువ మంది నామినేషన్లు వేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. పైగా ఈ రోజు చాల మంచిదని పండితులు కూడా చెబుతున్నారు.

కొంతమంది అభ్యర్థులు ముందు జాగ్రత్త కోసం 8వ తేదీన ఒక సెట్ నామినేషన్ వేసి, 2వ సెట్ నామినేషన్ పత్రాలను 9వ తేదీన సమర్పిస్తున్నారు అని తెలుస్తోంది. ఇక 10వ తేదీ చివరి రోజు, ఆ రోజున హస్త నక్షత్రం ఉంది, కాబట్టి అభ్యర్థుల్లో ఎవరికైతే ఆ హస్తా నక్షత్రం కలిసొస్తుందో వాళ్ళు 10వ తేదీన నామినేషన్లు దాఖలు చేసే ఛాన్స్ ఉంది.

ఇక వీరితోపాటు ఆఖరు నిమిషంలో బీ ఫామ్ తీసుకున్న వారు కూడా ఆఖరు తేదీనే నామినేషన్ వేస్తారు. ఇక వారికి ముహుర్తాలు, మూడాలతో పని ఉండదు. పోటీ చేసే అవకాశం వచ్చింది కాబట్టి నామినేషన్ గడువు లోగ వేయాల్సిందే.

ఇక నేడు నామినేషన్ దాఖలు చేస్తున్న బడా నేతలు ఎవరో ఒక్కసారి కుక్కేద్దాం. గజ్వేల్‌‌‌‌‌‌‌‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 9వ తేదీనే నామినేషన్ వేయనున్నారు. ఉదయం గజ్వేల్‌‌‌‌‌‌‌‌లో నామినేషన్ వేసిన తరువాత, మధ్యాహ్నం కామారెడ్డిలో నామినేషన్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేస్తారు గులాబీ బాస్.

మంత్రి కేటీఆర్​ ఉదయం 11.45 గంటలకు సిరిసిల్ల లో నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు. మరో మంత్రి మంత్రి హరీశ్​రావు సిద్దిపేటలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. వీరితోపాటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మాజీ మంత్రి జోగు రామన్న తదితరులు 9వ తేదీనే నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారు. వీరు మాత్రమే కాక 9 వ తేదీన నామినేషన్ వేసే లిస్ట్ పెద్దదే ఉందని తెలుస్తోంది.

Leave a Comment