
Sowbhagya Lakshmi Scheme : బి.ఆర్.ఎస్ పార్టీ కొత్త పధకం..ఈ పధకానికి ఎవరెవరు అర్హులు.. పథకంతో లబ్ది ఎంత..
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి బాగా కనిపిస్తోంది, వివిధ రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రసన్న చేసుకునేందుకు మేనిఫెస్టోను రెడీ చేసుకుని ప్రజల్లోకి వెళుతున్నాయి.
ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ప్రయత్నిస్తుంటే, చేతిలో ఉన్న అధికారాన్ని కోల్పోకుండా ఉండాలని అధికార పార్టీ పోరాడుతోంది.
ఈ క్రమంలోనే భారతీయ రాష్ట్రసమితి పార్టీ ఒక వినూత్న పథకంతో ప్రజల్లోకి వెళుతోంది. తాము గనుక హ్యాట్రిక్ కొడితే రాష్ట్రంలోని ఆడబిడ్డల కోసం కొత్తగా కార్యక్రమాలు చేపడతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘
సౌభాగ్యలక్ష్మి స్కీమ్ పేరుతొ ఒక సరికొత్త పధకాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు చెప్పారు. 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి మహిళ ఈపథకానికి అర్హులు అవుతారని చెప్పారు.
ఈ పధకం క్రింద వారికి నెలకు 3 వేల రూపాయలు అందిస్తామని అన్నారు. సౌభాగ్య లక్ష్మి వస్తోంది కదా అని కల్యాణ లక్ష్మి తీసివేయరని, ఆపధకం కూడా యధావిధిగా నడుస్తుందని పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకే 111 జీవోను ఎత్తివేశామని గుర్తుచేశారు.
రైతులకు 24గంటల కరెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా మాత్రమే అని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇప్పటివరకు ఎవ్వరూ చేయని విధంగా, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ రైతుబంధు పధకం తెచ్చారని కేటీఆర్ వెల్లడించారు.
ఈ పథకం కింద ఇప్పటివరకు 70 లక్షల మంది రైతులు లబ్ది పొందారని అన్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే 70 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతా లో జమచేశామని చెప్పారు.
2018 ఎన్నికల సమయంలో చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలో అమల్లో ఉన్న 111 జీవో ఎత్తివేస్తామని హామీ ఇచ్చామని, ఆ మాట ప్రకారమే 111 జీవో తొలగించామని మంత్రి వెల్లడించారు.
న్యాయపరమైన చిక్కులు తెచ్చి పెట్టేందుకు కొందరు ప్రతయత్నం చేసినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి 111 జీవో తొలగించుకోగలిగామని అన్నారు, చేవెళ్ల నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు శాశ్వతంగా మేలు జరిగేటట్లు చర్యలు తీసుకున్నామని చెప్పారు.
ఇక షాబాద్ మండలం లోని చందన్వెళ్లి, సీతారాంపూర్లో భారీ పరిశ్రమలు వచ్చాయని, శంకర్పల్లి మండలం కొండకల్లో రైల్వే పరిశ్రమ వచ్చిందని తెలిపారు. వీటి వాళ్ళ అనేమందికి ఉపాధి లభించిందని పేర్కొన్నారు.