BRS’s defeat. KCR’s hat-trick hopes lost: బి.ఆర్.ఎస్ ఓటమి.. కేసీఆర్ హ్యాట్రిక్ ఆశలు గల్లంతు

kcr

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి, ఈ దఫా ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలను ఇచ్చారు తెలంగాణ ప్రజలు, ఓటమి ఎరుగని నేతలు అని భావించిన వారికి కూడా పరాజయం ఎలా ఉంటుందో కాస్త రుచి చూపించారు.

అందుకు బి.ఆర్.ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు కేసీఆర్ కూడా అతీతుకు కాలేకపోయారు. గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో పోటీ చేసిన కేసీఆర్ కామారెడ్డి లో ఓటమి పాలయ్యారు. ఇక గజ్వేల్ లో కేసీఆర్ ను గెలిపించిన ఓటర్లు ఆయన పరువును నిలిపారు.

ఒకప్పుడు కామారెడ్డి అంటే కేసీఆర్ అడ్డా అన్నట్టు ఉండేది, 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని కేసీఆర్ కాంగ్రెస్ కి త్యాగం చేశారని, ఆ సమయంలో అక్కడ పోటీకి నిలబడ్డ కాంగ్రెస్ కాండిడేట్ షబ్బీర్ అలీ కేసీఆర్ ను బ్రతిమలాడి మరీ కాంపెయినింగ్ చేయించుకున్నారని కేటీఆర్ చాలా గొప్పగా చెప్పుకున్నారు.

అయితే ఇప్పుడు అదే స్థానం లో తిరిగి పోటీ చేసిన కేసీఆర్ ను అక్కడి ప్రజలు మర్చిపోయారా ? లేదంటే కేసీఆర్, కామారెడ్డి ప్రజలను విస్మరించడంతో వారు ఆయనకు ఓటు తో మర్చిపోలేని వాత పెట్టారా అని ఆయనే అధ్యయనం చేసుకోవాలి. ఈ దఫా ఎన్నికల్లో మాత్రం హ్యాట్రిక్ కొట్టి, రికార్డ్ బ్రేక్ చేస్తా అని ధీమా గా చెప్పిన కేసీఆర్ ఆశలు గల్లంతయ్యాయి.

ఇప్పటి వరకు ఎవరు కూడా మూడో సరి ముఖ్య మంత్రి కాలేదని అది కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని మంత్రి హరీష్ రావు కూడా చాలా నమ్మకాన్ని పెట్టుకున్నారు. కానీ ఓటర్లు తెలంగాణ ఓటర్లు ఆయన నమ్మకం పై నీళ్లు చల్లారు.

Leave a Comment