BSNL New Plans: బి.ఎస్.ఎన్.ఎల్ కొత్త ప్లాన్.

BSNL New Plan

BSNL New Plans: బి.ఎస్.ఎన్.ఎల్ కొత్త ప్లాన్.

భారత దేశంలో ఇప్పుడు మొబైల్ వినియోగదారుల(Mobile Phone Usage) సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. పట్టణ, నగర ప్రాంతాల్లోనే కాదు చిన్న కుగ్రామాల లో కూడా మొబైల్ వినియోగం అధికంగా ఉంటుంది.

ఒకప్పుడు గ్రామాల్లో కేవలం పోస్టాఫీస్(Post Office) లో మాత్రమే ల్యాండ్ లైన్(Land Line Phone) ఉండేది, లేదంటే సంపన్నుల ఇళ్లలో మాత్రమే ఫోన్లు ఉండేవి, తరువాతి కాలంలో సెల్యులార్ ఫోన్లు(Cellular Phones) రావడాన్ని వింతగా చూశారు, కాలక్రమంలో అవి కూడా సాధారణమయ్యాయి.

ఇప్పుడు స్మార్ట్ ఫోన్(Smart Phones) హవా వచ్చేసింది. సాధారణ సెల్యులార్ ఫోన్, ల్యాండ్ లైన్ ఫోన్ ఉన్న సమయంలో రీఛార్జులు(Recharge) లేదంటే నెలవారీ బిల్ పేమెంట్లు(Monthly Payments) కేవలం టాక్ టైం(Talk Time) కోసమే ఉండేవి,

కానీ ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ వచ్చింది అప్పటి నుండి డేటా కి(Data Usage) మాత్రమే రీఛార్జ్ చేయడం మొదలైంది. టాక్ టైం అనేది ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ అనేవి ఫ్రీ(Incoming & Out Going Free) అయిపోయాయి.

ల్యాండ్ లైన్ ఫోన్ లు ఉన్నప్పుడు భారత్ సంచార్ నిగమ్ మూడు పువ్వులు ఆరుకాయలు అన్నట్టు కళకళలాడుతూ ఉండేది.

స్మార్ట్ ఫోన్ల విప్లవం మొదలయ్యాక రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్ టెల్9Air Tel), వోడాఫోన్ ఐడియా(VodaPhone Idea) వంటి కంపెనీల హవా ఎక్కువైపోయింది.

Add a heading 2023 12 26T123830.306 BSNL New Plans: బి.ఎస్.ఎన్.ఎల్ కొత్త ప్లాన్.

ఈ కంపెనీలు అందించే ఆఫర్ల ధాటికి BSNL కాస్త వెనకపడింది అని చెప్పక తప్పదు. అయితే ఇప్పటికి కూడా భారతదేశంలోని(India) పల్లెటూళ్లలో ఉండేవారు స్మార్ట్ ఫోన్ వాడని వారు, ఇంటర్నెట్ వియోగించని వారు,

కేవలం టాకింగ్ అవసరాల నిమిత్తమే మొబైల్ ను వాడేవారు BSNL ను వినియోగించడానికి మొగ్గు చూపుతున్నారు. పైగా పట్టణాల సంగతి ఎలా ఉన్నా, గ్రామాల్లో BSNL కి మెరుగైన సిగ్నల్ కూడా అందుబాటులో ఉంది.

ఇలాంటి కస్టమర్లను దృష్టిలో పెట్టుకునే BSNL ఒక అద్భుతమైన ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. చాల తక్కువ ధరకు నెలవారీ రీఛార్జ్ ఆఫర్ ను(Monthly Recharge offer) అందించడానికి సిద్ధమైంది.

కేవలం 50 రూపాయల లోపు నెలవారీ చెల్లింపుతో టాక్ టైం అలాగే డేటాను కూడా అందిస్తామని అంటోంది సదరు కంపెనీ. అదేమిటంటే BSNL తీసుకొచ్చిన ఈ కొత్త ఆఫర్ 48 రూపాయల రీఛార్జ్ ప్లాం తో 30 రోజుల(30Days Validity) వీలిడిటీ ఉంటుంది.

అయితే ఈ ఆఫర్ పొందాలంటే ఒక చిన్న కండీషన్ ఉంది. అదేమిటంటే ఈ ప్లాన్ తీసుకోవడానికన్నా ముందు సదరు కస్టమర్ ఏదైనా యాక్టివ్ రీఛార్జ్ ప్లాన్(Active Recharge Plan) చేసుకుని ఉండాలి. అప్పుడే ఈ 30 రోజుల ప్లాన్ కి అర్హులు అవుతారు.

అయితే ఈ ప్లాన్ ను ఎవరు పడితే వారు తొందరపడి రీఛార్జ్ చేసుకోకండి, ఇది భారతదేశ వ్యాప్తంగా అందుబాటులో లేదు, ఇది మనదేశంలోని కొన్ని రాష్ట్రాల వరకే పరిమితం అయింది ఇప్పటివరకు.

ఉత్తర్ ప్రదేశ్(Uttar Pradesh), హరియాణా(Haryana), రాజస్థాన్(Rajasthan) రాష్ట్రాల్లో మాత్రమే దీనిని అందుబాటులోకి తెచ్చినట్టు తెలుస్తోంది.

అయితే ఏరియాల్లో ఈ ప్లాన్ అందుబాటులో ఉందొ లేదో తెలుసుకోవాలంటే BSNL ను సంప్రదించాల్సి ఉంటుంది.

ఇది ఎవరెవరికి బాగా ఉపయోగపడుతుంది అంటే, డ్యూయల్ సిం కార్డులు(Dual Sim Cards) వాడుతూ తమ మొబైల్ లోని రెండు సిమ్ కార్డులకు ప్రతి నెల తప్పక రీఛార్జ్ చేయవలసి వస్తోంది అని బాధపడే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

రీఛార్జ్ చెయయకపోతే సిమ్ కార్డు వెలిడిటీ(Sim Card Validity) పోతుంది కాబట్టి తప్పని పరిస్థితుల్లో అవసరం ఉన్నా లేకుండా నెల నెలా రీఛార్జ్ కోసం వంద రూపాయలకి పైగా ఖర్చు చేస్తున్నవారు దీనిని ఉపయోగించుకోవచ్చు.

అలాగే కేవలం ఇన్ కమింగ్ (Incoming Calls)సేవలను మాత్రమే వినియోగించేవారు కూడా ఈ రీఛార్జ్ ప్లాన్ తో బాగా లబ్ది పొందగలుగుతారు.

Leave a Comment