Bullet Train: ముంబయి (Mumbai)- అహ్మదాబాద్(Ahmadabad) బుల్లెట్ రైలు ప్రాజెక్టు ను కేంద్ర సర్కారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఎలాగైనా దీనిని పూర్తి చేసేందుకు బాటలు వేయాలని కృతనిశ్చయంతో ఉంది. అయితే అందుకు అడ్డంకిగా ఉన్న ప్రధానమైన సమస్య నుండి విముక్తి లభించింది. అదే భూసేకరణ.
ఈ ప్రాజెక్టుకి సంబంధించిన భూ సేకరణనను దిగ్విజయంగా పూర్తిచేశారు. గుజరాత్(Gujarat), మహారాష్ట్ర(Maharashtra), దాద్రా నగర్ హవేలీ(Dadra nagar Haveli) ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టు కోసం 100శాతం భూసేకరణ పోర్తయింది.
ఈ విషయాన్నీ నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(NHSRCL) స్వయంగా ప్రకటించింది. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 1,389.49 హెక్టార్ల ల్యాండ్ ను సేకరించినట్టు తెలుస్తోంది.
ప్రాంతాల వారీగా చుస్తే మహారాష్ట్రలో 430.45 హెక్టార్లు, గుజరాత్‌లో 951.14 హెక్టార్లు; దాద్రానగర్ హవేలీలో 7.90 హెక్టార్లు సేకరించారట. ఈ వివరాలను రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ (Central Minister Aswini Vaishnav) లెక్కలతో సహా ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
సముద్రగర్భ మార్గం ఎన్ని కిలోమీటర్లంటే – Total Distance Of Under Sea Route
మనదేశంలో తోలి బులెట్ రైలు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు పనులు వేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే బాంద్రా(Bandra) -కుర్లా కాంప్లెక్స్(Kurla Complex),
శిల్‌ఫాటా(Silpata) మధ్య ఉన్న సొరంగం పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మార్గంలో 21 కిలోమీటర్ల స్వరంగా మార్గం ఉంది,
ఆ స్వరంగా మార్గంలోని 7 కిలోమీటర్లు సముద్ర గర్భంలో స్వరంగాన్ని నిర్మిస్తున్నారు. అందుకు కూడా పనులు ప్రారంభమయ్యాయి.
ఈ బులెట్ రైలు ప్రాజెక్టు లో భాగంగా గుజరాత్ రాష్ట్రం లోని వాపి(Vapi), బిలిమోరా(Bilimora), సూరత్(Surath), భరూచ్(Bharooch), ఆనంద్(Aanand), వడోదర(Vadodara), అహ్మదాబాద్(Ahmadabad), సబర్మతి(Sabarmathi) స్టేషన్ల నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి
ఆ పనులు ఒక్కో స్టేషన్ లో ఒక్కో దశలో ఉన్నాయి. సూరత్, బిలిమోరా ఈ బులెట్ ట్రైన్ పనులను మొత్తాన్ని 2026 నాటికి పూర్తి చేయాలనీ బీజేపీ సర్కారు టార్గెట్ గా పెట్టుకుని పనిచేస్తోంది. ఇక ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1.10 లక్షల కోట్లు అని అధికారికంగానే వెల్లడించారు.