ముందు మీ భార్యల చీరలు కాల్చండి – బంగ్లాదేశ్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

website 6tvnews template 2024 04 02T123004.181 ముందు మీ భార్యల చీరలు కాల్చండి - బంగ్లాదేశ్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

Burn your wives’ sarees first – Bangladesh PM’s sensational comments : బంగ్లాదేశ్‌లోని ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ చేపట్టిన ‘బాయ్‌కాట్ ఇండియా’ ఆందోళనల పై ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తీవ్రంగా స్పందించానే చెప్పాలి. బంగ్లాదేశ్ లో భారత వ్యతిరేక సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్ష నాయకులపై ఆవిడ మండిపడ్డారు. భారత ఉత్పత్తులను తర్వాత బాయ్‌కాట్ చేద్దామని అంతకంటే ముందు మీ భార్యలు కట్టుకున్న భారత చీరలను తగలబెట్టండి అని ప్రతిపక్ష నేతలను ఆవిడ కోరారు.

హసీనా, ఆమె పార్టీ అవామీ లీగ్‌పై భారత అనుకూల ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష BNP ఈ ఏడాది జనవరిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హసీనా గెలుపునకు భారత్ ఎంతో సహకరించినట్లు ఆరోపిస్తోంది. అందులో భాగంగా భారత ఉత్పత్తులను బహిష్కరించాలని BNP కోరుతూ ‘బాయ్‌కాట్ ఇండియా’ ఆందోళనలకు పిలుపునివ్వడం జరిగింది.

ప్రతిపక్షాల ఆరోపణలు జరుతున్న నేపద్యం లో , బాయ్‌కాట్ భారత్ పిలుపుపై బంగ్లా ప్రధాని షేక్ హసీనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌ను మాకు ‘గొప్ప స్నేహితుడు’ అని అభివర్ణించిన హసీనా ఆందోళన చేపట్టే ముందు BNP నేతలు ముందు వారి భార్యల వద్ద ఉన్న భారత చీరలను తగలబెట్టాలని ఆవిడ డిమాండ్ చేశారు.

బంగ్లా లో BNP అధికారంలో ఉన్నప్పుడు వారి భార్యలు భారత్ కి వెళ్లి మరీ అక్కడి చీరలు కొనుగోలు చేయడం తనకు అన్నీ తెలుసని ఆమె అన్నారు. అంతే కాదు వారు అక్కడ కొన్న చీరలను బంగ్లాదేశ్‌కు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకునే వారని ఆమె విమర్శించారు.

అంతేకాదు, చీరాల తో పాటు భారత్ నుంచి గరమ్ మసాలాలు , ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి పేష్టులు వంటి ఉత్పత్తులు కూడా ఇక్కడికి వస్తున్నాయని, అవి లేకుండా BNP నాయకులు వంటలు చేసుకోరని ఆమె విమర్శించారు. భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులు వాడకుండా ఉండగలర అని ఆమె ప్రశ్నించారు. అసలు ఇవి లేకుండా మీరు ఆహారం తినగలరా? అని ఎద్దేవా చేసారు.

Leave a Comment