పాము విషానికి గొప్ప మందు – ఒంటె కన్నీళ్లు.

website 6tvnews template 17 పాము విషానికి గొప్ప మందు - ఒంటె కన్నీళ్లు.

Camel tears can save snake bite patient. ఒంటె కన్నీళ్ళ లో అత్యధిక రసాయనాలు పాము విషానికి విరుగుడు గా అద్భుతం గా పనిచేస్తుందని పలురకాల నిర్వహించడం వల్ల కనుగొన్నారు. తాము చేస్తున్న రిసెర్చ్ లో పాము విషాన్ని వేరుచేయగల శక్తి ఒక్క ఒంటె కన్నీరు లో మాత్రం ఉందని అందుకు మేము చేసే ప్రయత్నాలు కూడా స్పీడ్ గా చేస్తున్నామని శాస్త్రవేతలు తెలియ చేసారు.

ప్రతీ ఏటా ప్రపంచ వ్యాప్తం గా పాము కాటు కు గురి అయ్యి 1.25 లక్షల మంది చనిపోతున్నారని సైంటిస్ట్ లు చెప్తున్నారు. పాములలో అన్ని పాములు విష పూరితమైనవి కావని, కొన్ని పాములు మాత్రమే కాటువేయ్యగానే మనిషి చనిపోతున్నాడని ఆయన చెప్పారు. ఇప్పుడు దీనికి సంబందించి దుబాయ్ లో సెంట్రల్ వెటర్నరి రీసెర్చ్ లాబొరేటరీ ఒక అడుగు ముందుకు వేసి తాము విషానికి మందు కనుగొన్నామని అయితే దీనికి ఒంటె కళ్ళ నుండి కారే కన్నీరు బాగా ఉపయోగపడుతుందని అందుకు సంబందించి మరిన్ని పరిశోధనలు చేస్తున్నామని చెప్పారు.

234600 nagu pamu పాము విషానికి గొప్ప మందు - ఒంటె కన్నీళ్లు.


అయితే దీనికి సంబందించి దుబాయి ల్యాబ్ లో చాల సంవత్సరాల నుండి దీనిమీద రిసెర్చ్ లు చేస్తున్నప్పటికీ తగినన్ని నిధులు లేక పరిశోధనలు చేయలేకపోయామని ఆ ల్యాబ్ ప్రతినిధులు తెలియచేసారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి అవసరమైన నిధులు సేకరించి మరిన్ని పరిశోధనలు చేయ్యబోతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. తొందర్లోనే పాము విషాన్ని అత్యంత సమర్దవంతం గా ఎదుర్కునేటట్లు మెడిసిన్ బయటకి తీసుకువస్తామని పరిశోధన సంస్ద అధిపతి డాక్టర్ వార్నర్ ఒక ప్రకటన లో తెలిపారు.

తాము ఒంటె కన్నీరు లో అనేక రకాలైన ప్రోటీన్లు తో పాటు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇవి కాపాడతాయని చెప్పారు. ఇప్పటికి ఒంటె కన్నీరు లో ఉన్న ఔషద లక్షణాలపై అమెరికా,ఇండియా ఇంకా అనేక దేశాల్లో పలు రకాల పరిశోధనలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. అంతే కాకుండా ఒంటె కన్నీరు లో లైసోజైమ్ లు ఉంటాయని ఇవి బాక్టీరియా తో పటు పలు రకాల వైరస్ లను కూడా నిరోదిస్తాయని కనుగొన్నామని ఆయని చెప్పారు. ఒంటె శరీరం లో ఉండే కన్నీరే కాదు ఒంటె మూత్రం లో కూడా పలు రకాల ఔషధ గుణాలు ఉన్నాయని తేలిందని ఆయన చెప్పారు.

Leave a Comment