Captain Miller Release Date Announced: సురేష్ ప్రొడక్షన్స్ టేకప్ చేసిందంటే కెప్టెన్ మిల్లర్ లో విషయం ఉన్నట్టేనా ?

Captain Miller Release Date Announced

Captain Miller Release Date Announced: కోలీవుడ్ హీరో ధనుష్(Dhanush) ప్రధాన పాత్ర పోషించిన సినిమా కెప్టెన్ మిల్లర్(Captain Miller), ఈ సినిమాలో ప్రియాంక మోహన్(Priyanka Mohan) నాయికగా నటించింది. అరుణ్ మాథెశ్వరణ్ద ర్శకత్వం వహించిన ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్(Sandeep Kishan) కీలక పాత్రలు పోషించారు.

ఇప్పటికే తమిళ్, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా ఆ రెండు భాషల్లోనూ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. హీరో ధనుష్ కేవలం తమిళ నటుడు మాత్రమే అనుకుంటే పొరపాటే, అతనికి దక్షిణాది తోపాటు ఉత్తరాది లోను మంచి క్రేజ్ ఉంది.

గడిచిన దశాబ్ద కాలంగా, ధనుష్ నటించిన తమిళ సినిమాల్లో, హిట్ అయిన ప్రతి సినిమాను తెలుగు లో కూడా విడుదల చేస్తున్నారు ప్రొడ్యూసర్లు.ఆలా వచ్చినవే త్రి(3), వి.ఐ.పి(VIP), మారి(Maari), తూట9Thoota), వి.ఐ.పి-2(VIP-2), సినిమాలు చెప్పుకోవచ్చు.

ఇక తెలుగు ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని సార్(SIR) సినిమాను డైరెక్ట్ తెలుగు లో చేశాడు. ఇక ధనుష్ బాలీవుడ్ లోకి కూడా వెళ్ళాడు. అత్రంగి రే9Atrangi Re), రాంఝాన(Raanjhana), షమితాబ్(Shamitaab) సినిమాలు చెప్పుకోవచ్చు. అక్కడ కూడా తన నటనతో అభిమానులను సొంతం చేసుకున్నాడు.

ఇతరభాషల్లోను ఫెమస్ : Acting In Other languages

Captain Miller Release Date Announced


సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా కి జీవి ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) సంగీతాన్ని అందించారు. అదితి బాలన్(Aditi Balan), సందీప్ కిషన్(Sandip Kishan) ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే ని కూడా దర్శకుడు అరుణ్ మాథెశ్వరణ్ అందించారు.

ఈ సినిమాను తెలుగులో ఈ నెల అంటే జనవరి 25వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్టు సురేష్ ప్రొడక్షన్స్(Suresh Productions) ప్రకటించింది. అలాగే సినిమా నుండి ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

ఈ సినిమాను ఆంధ్ర మరియి తెలంగాణ(Andhra And Telangana) ప్రేక్షకులకు సురేష్ ప్రొడక్షన్స్, అలాగే ఏషియన్ సినిమాస్ (AsianCinimas) సంయుక్తంగా అందిస్తున్నాయి. ఇక తెలుగు లో హీరోగా ఉన్న సందీప్ కిషన్ కెరియర్ తొలినాళ్ళ నుండే ఇతర భాషల సినిమాలపై కూడా దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కెప్టెన్ మిల్లర్ లో నటించిన సందీప్ డి 50(D50) పేరుతో తెరకెక్కుతున్న తమిళ సినిమాలో కూడా నటిస్తున్నాడు.

ఇప్పటికే కసడ తబర(Kasad Thabara), మాయావన్(Mayavan), నెంజిల్ తునివిరుండాల్(Nenjil Thunivirundal) సినిమాల్లో నటించాడు. మరో నటుడు శివ రాజ్ కుమార్ చూస్తే, మొన్నామధ్య రజని(Rajani Kanth) నటించిన జైలర్(jailor) లో మెరిశారు. ఒకప్పుడు నటసింహం నందమూరి బాలకృష్ణ(Bala krishnana) నటించిన గౌతమీ మూత్ర శాతకర్ణి9Gowthami Putra Sathakarni) లో నటించారు. ఇప్పుడు మరో మారు తమిళ్ లో వచ్చిన కెప్టెన్ మిల్లర్ లో ముఖ్య పాత్ర పోషించారు.

Leave a Comment