వివాదంలో శరణ్య పొన్వన్నన్‌. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

website 6tvnews template 2024 04 02T135444.144 వివాదంలో శరణ్య పొన్వన్నన్‌. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

Case filed against artist Saranya Ponvannan : క్యారెక్టర్ ఆర్టిస్ట్ శరణ్య పొన్వన్నన్‌ ( Saranya Ponvannan)తెలియని వారంటూ ఉండరు. 1987లో సూపర్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan)నటించిన నాయ‌కుడు (Nayakudu)చిత్రంతో త‌మిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు శ‌ర‌ణ్య‌. ఆ త‌ర్వాత ఎన్నోసినిమాల్లో నటించారు. ఎక్కువ‌గా శరణ్య త‌ల్లి పాత్ర‌లు వేశారు.

త‌ల్లంటే ఇలానే ఉండాలి అని ఆమెను చూసిన వారు అనుకుంటారు. తమిళ నటి అయినప్పటికీ చాలా వరకు తెలుగు సినిమాల్లో తల్లి పాత్రలో నటించి తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. కోలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు శరణ్య. ఇదిలా ఉంటే ఇప్పుడు శరణ్య ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయ్యింది. త‌న‌ను చంపేందుకు శరణ్య ప్ర‌య‌త్నించింది అంటూ ఆరోపిస్తూ ఆమెపై పక్కింటివారే కేసు పెట్టారు. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

శ‌ర‌ణ్యపై హ‌త్యా య‌త్నం కేసు :

శ‌ర‌ణ్య పొన్వ‌న్న‌న్ ( Saranya Ponvannan)తన కుటుంబంతో కలిసి చెన్నైలోని విరుగంబాక్కం( Virugambakkam)లో ఉంటున్నారు. అయితే, ఆమె గ‌త కొద్ది రోజులుగా ప‌క్కింట్లో ఉంటున్న శ్రీ‌దేవి అనే మ‌హిళ‌తో గొడ‌వ పెట్టుకుంటున్నారట. పార్కింగ్ విష‌యంలో వీరిద్దరికీ గొడ‌వ జ‌రుగుతోందట. రీసెంట్ గానే వీరి మధ్య పెద్ద గొడ‌వ జరిగింది. అదే సమయంలో శ‌ర‌ణ్య త‌న‌ను చంపేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ శ్రీ‌దేవి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. అంతే కాదు సీసీటీవీ ఫుటేజ్ ని కూడా పోలీసులకు అందించింది. శ్రీదేవీ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.


శ్రీదేవి ఇంటి గేటు శరణ్య పొన్వన్నన్ కారు పార్క్ చేశారట. ఈ విషయంపైనే శ్రీదేవికి శరణ్యకు మధ్య వాగ్వాదం మొదలైందని కొన్ని త‌మిళ వెబ్ సైట్లు చెబుతున్నాయి. ఈ మధ్యనే విడుదలైన పార్కింగ్ సినిమా గురించి అంద‌రికీ తెలిసిందే. కారు పార్కింగ్ విష‌యంలో గొడ‌వ‌ప‌డి రెండు ఫ్యామిలీలు చంపుకునే వ‌ర‌కు వెళ్తాయి. అలాంటి ఘ‌ట‌నే ఇప్పుడు రియల్ లైఫ్ లోనూ అందులోనూ సినిమా స్టార్ తో జరుగుతోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు .

కోలీవుడ్ లో ధనుష్ (Danush) హీరోగా వచ్చిన రఘువరణ్ బీటెక్ (Raghuvaran Btech)సినిమాలో అమాయకపు తల్లిగా నటించి ప్రేక్షకులను హృదయాలను దోచుకున్నారు శరణ్య. 24 సినిమాలోనూ సూర్య (Surya)కు తల్లిగా నటించి అలరించారు . తెలుగులో వేదం (Vedam), కొమరం పులి (Komuram Puli), మనం (Manam),బ్రహ్మోత్సవం (Brahmotsavam)తో పాటు న్యాచురల్ స్టార్ నాని (Nani)గ్యాంగ్ లీడర్ (Gang Leader)మూవీలో శరణ్య నటించారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) , సమంత (Samantha)కాంబినేషన్ లో వచ్చిన ఖుషి (Kushi) సినిమాలోనూ హీరోకు తల్లిగా నటించారు శరణ్య.

Case filed against artist Saranya Ponvannan

Leave a Comment