గత రెండు మూడు రోజులుగా సింగర్ చిన్మయి(Chinmai) పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆడవాళ్ళపై సీనియర్ నటి అన్నపూర్ణమ్మ(annapurnamma) చేసిన కామెంట్స్ కి ఆమె ఇచ్చిన ఘాటు రిప్లై అందుకు కారణం అని చెప్పవచ్చు. కొంతమంది చిన్మయికి సపోర్ట్ గా మాట్లాడగా మరికొంతమంది అన్నపూర్ణమ్మకు మద్దతు తెలిపారు. ఇది ఎలా ఉంటే తాజాగా చిన్మయిపై హైదరాబాద్ (Hyderabad )లోని గచ్చిబౌలి (Gachibowli )పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ అయ్యింది.
చిన్మయి నెట్టింట్లో షేర్ చేసిన వీడియోపై అభ్యంతరం తెలుపుతూ ఆమె దేశాన్ని అవమానించేలా మాట్లాడిందని హెచ్‌సీయూ(HCU) స్టూడెంట్ కుమార్ సాగర్ (Kumar Sagar ) పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. దీనితో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. బాధ్యత కలిగిన పౌరురాలిగా దేశాన్ని కించపరిచేలా మాట్లాడ్డం సరికాదని విద్యార్థి తన కంప్లైంట్ లో పేర్కొన్నాడు.
అన్నపూర్ణమ్మ కంట్రోవర్సీ కామెంట్స్ :
ఓ ఇంటర్వ్యూలో అన్నపూర్ణమ్మ (annapurnamma) ఈనాటి అమ్మాయిల గురించి మాట్లాడుతూ..”ఆ రోజుల్లో స్వతంత్య్రం అనగానే ఆడవారు అర్ధరాత్రి బయటకు వచ్చేవారా? అసలు ఆడవాళ్లకు స్వాతంత్య్రం ఎందుకు ? 12 గంటల తర్వాత బయట ఏం పని ఉంటుంది ?.
ఇప్పటి ఆడవాళ్లు ఎక్స్‌పోజింగ్ ఎక్కువ చేస్తున్నారు. అమ్మాయిలను ఏమీ అనకూడదని అనుకున్నాను. కానీ అలా అనేటట్లుగా వారు తయారయ్యారు. ఎప్పుడూ ఎదుటి వారిదే తప్పంటే ఎలా? ఆడవాళ్లది కూడా తప్పు ఉంటుంది “. అని అన్నపూర్ణమ్మ షాకింగ్ కామెంట్స్ చేసింది.
అన్నపూర్ణమ్మ పై చిన్మయి ఫైర్ :
చిన్మయి శ్రీపాద (singer chinmai)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన గాత్రంతో సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్, కోలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించింది. పాటలు పాడటంలోనే కాదు, సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటుంది. చిన్మయి మీటూ ఉద్యమం గురించి ఎప్పుడూ షాకింగ్ కామెంట్స్ చేస్తుంటుంది.
అమ్మాయిల విషయానికి వస్తే మొహమాటం లేకుండా తన మనసులోని మాటలను చెప్పేస్తుంటుంది చిన్మయి. ముఖ్యంగా ఆడవారికి సంబంధించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వెంటనే రియాక్ట్ అవుతుంది. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేస్తుంది.
ఈ క్రమంలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ (annapurnamma) ఆడవాళ్ళపై చేసిన కామెంట్స్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది. ఆడవాళ్ళ డ్రెస్సింగ్ వల్లే వారిపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని అన్నపూర్ణమ్మ లాంటివాళ్లు అనడం సిగ్గుచేటని, ఇలాంటివాళ్లు ఉన్న దేశంలో ఆడవాళ్లుగా పుట్టడం మనం చేసుకున్న కర్మ అని చిన్మయి వీడియోలో ఫైర్ అయ్యింది.కంట్రీ అంటూ చిన్మయి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
బాధ్యత గల మహిళ అయ్యి ఉండి దేశాన్ని కించపరిచేలా చిన్మయి మాట్లాడ్డం సరికాదని, అందుకే కంప్లైంట్ ఇచ్చినట్లు హెచ్‌సీయూ స్టూడెంట్ తెలిపాడు. అయితే ఈ కేసుపై చిన్మయి ఇప్పటి వరకు రెస్పాండ్ కాలేదు.