Celebrities Congratulating Megastar chiranjeevi : మెగాస్టార్ కి అభినందనల వెల్లువ

website 6tvnews template 2024 01 27T122645.359 Celebrities Congratulating Megastar chiranjeevi : మెగాస్టార్ కి అభినందనల వెల్లువ

Celebrities Congratulating Megastar chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) పద్మవిభూషణ్(Padmavibhushan) అవార్డుకు ఎంపిక కావడం పట్ల తెలుగు సినీ ఇండస్ట్రీలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మెగాస్టార్ అభిమానులతోపాటు, పవర్ స్టార్(Pavan Kalyan) అభిమానులు సంతోషంతో ఉబ్బి తబ్బిబవుతున్నారు.

2006 లో పద్మభూషణ్ అందుకున్న చిరంజీవి మరల 2024 లో పద్మవిభూషణ్ ను అందుకున్నారు. పునాదిరాళ్ళు సినిమాతో తన సినిమా కెరియర్ కు పునాది వేసుకున్న చిరు, స్వయం కృషి తో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నారు.

తన నటనతో ఆబాలగోపాలాన్ని అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరంజీవి నిజంగా చిరంజీవిగా నిలిచిపోయారు.

మెగాస్టార్ కు దేశ రెండవ అత్యున్నత పురస్కారం దక్కడంతో ఆయన ఇంటికి సెలెబ్రెటీలు క్యూ కడుతున్నారు. పుష్ప గుచ్చాలను అందించి శాలువాలు కప్పి తమ ప్రేమపూర్వక అభిమానాన్ని తెలియజేస్తున్నారు.

చిరు ఇంటికి మంత్రి కోమటిరెడ్డి : Minister Komatireddy Facilitated Chiranjeevi

Film Celebs ANd politicians Congratulate Chiranjeevi On Padma Vibhushan Honour Photos 1 Celebrities Congratulating Megastar chiranjeevi : మెగాస్టార్ కి అభినందనల వెల్లువ

ఈ క్రమం లోనే తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి(Komatireddy Venkat Reddy) మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయనను అభినందించారు.

చిరంజీవికి ఈ అవార్డు దక్కడం పట్ల మిక్కిలి ఆనందాన్ని వ్యక్తపరిచారు. చిరు కి ఫ్లవర్ బొకే ఇచ్చి శాలువా కప్పి సన్మానించారు. అయన ఇటువంటి అత్యున్నత పురస్కారాలు మరిన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.

చిరంజీవి కేవలం ఉత్తమ నటుడు మాత్రమే కాదని అయన మంచి మనసున్న వ్యక్తి, సేవ తత్పరత కలిగిన మనిషి కూడా అని అన్నారు. చిరంజీవి నిర్వహిస్తున్న రక్తదాన, నేత్రదానం సినీరాలను అందుకు ఉదాహరణగా చెప్పారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరికో ప్రాణదానం చేసిన వ్యక్తి చిరంజీవి ఈ అవార్డుకు నిజమైన అర్హుడు అని చెప్పారు.

ఇక పొలిటికల్ గా చుస్తే చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు. కాబట్టి చిరు టెక్నీకల్ గా కాంగ్రెస్ పార్టీ కి చెందిన నేతగానే చెప్పుకోవలసి ఉంటుంది.

ఇక మంత్రి కోమటిరెడ్డికి ఒక వైపు సినిమా పరంగా చిరు అంటే అభిమానము, మరోవైపు పార్టీ పరంగా తమా నేతకు ఈ ఘనత దక్కడం సంతోషం. కాబట్టి అయన స్వయంగా చిరు ఇంటికి వెళ్లి కలిసినట్టు భావిస్తున్నారు పొలిటికల్ విశ్లేషకులు.

చిరంజీవి తోపాటు వైజయంతిమాలకు పద్మవిభూషణ్ : Padma Vibhushan for Chiranjeevi and Vyjayanthimala

WhatsAppImage2024 01 25at11.27.34PM 170620646898016 9 Celebrities Congratulating Megastar chiranjeevi : మెగాస్టార్ కి అభినందనల వెల్లువ

ఇక కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చిరంజీవి తోపాటు పద్మ విభూషణ్ అవార్డుకి అలనాటి అందాల నటి, శాస్త్రీయ నృత్యంలో నిష్ణాతురాలు ఆయిన వైజయంతి మాలను(Vyjayanthi mala) కూడా ఎంపిక చేసింది.

ఇక పద్మ భూషణ్ అవార్డులకు మరో ఇద్దరు కళారులకు ఎంపిక చేసింది. వారిలో ఒకరు బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి(Mithun Chakravarty) కాగా, మరొకరు గాయని ఉషా ఉతుప్(Usha Uthup).

Leave a Comment