Challans Dates Extended: భలే మంచి చౌక బేరం.. పెండింగ్ చలాన్లకి మిగిలింది 4 రోజులే.

Really good cheap bargain.. Only 4 days left for pending challans.

Challans Dates Extended: తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) వినూత్న పోకడలను అవలంబిస్తోంది. ప్రజలకు ఎంతమాత్రం నొప్పి తెలియకుండానే పన్నులు వసూలు చేస్తోంది.

స్వామి కార్యం స్వకార్యం రెండు నెరవేరినట్టు ఉన్నది ప్రస్తుతం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సర్కారు వ్యవహారం చూస్తుంట

అందుకు మంచి ఉదాహరణ చెప్పాలంటే వాహనాలపై బకాయిపడ్డ చలాన్లకి(Pending Chalans) సంబంధించిన మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. అది కూడా వాహనదారులకు నొప్పి కలుగకుండా సున్నితమైన మార్గాన్ని అవలంబిస్తున్నారు.

traffice police representational1 Challans Dates Extended: భలే మంచి చౌక బేరం.. పెండింగ్ చలాన్లకి మిగిలింది 4 రోజులే.

అదేమిటంటే వాహనదారులు సాధారణంగా ఏదో ఒక సందర్భంలో హెల్మెట్(Helmet Less Ride) పెట్టుకోకపోవడం, ట్రిపుల్ రైడింగ్(Triple Riding) చేయడం,

లేదంటే రాష్ డ్రైవింగ్(Rash Riding) చేయడం, సిగ్నల్స్ జంప్(Signals Jump) చేయడం జరుగుతుంది. ఇలాంటి వాటిని ట్రాఫిక్ పోలీస్ చాలా చాకచక్యంగా ఫోటో కొట్టి చలాన్ ను ఆన్లైన్ విధానంలో మెయిల్ కి అలాగే ఇంటికి పోస్టు లో కూడా పంపిస్తారు.

ఈ చలాన్లు తప్పనిసరిగా కట్టి తీరాల్సిందే. కట్టకుండా ఉంటె మన వాహనంపై పెండింగ్ లో ఉంటాయి. అలా పెండింగ్ లో ఉన్న వాహనాలను పూర్తిగా విక్రయించడానికి కానీ, లేదంటే ఎక్స్ చేంజ్ చేసుకోవడానికి గాని వీలు పడదు. అందుకే ఎప్పటికైనా ఆ మొత్తాన్ని చెల్లించక తప్పదు.

చక్కని అవకాశం : Nice opportunity

అయితే ఇప్పుడు తెలంగాణ సర్కారు ఒక చక్కని సదవకాశాన్ని, ఇంకో మాటలో చెప్పాలంటే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యేమార్గంగా ఒక పరిష్కారాన్ని చూపెట్టింది.

అదేమిటంటే చలాన్లపై భారీగా డిస్కౌంట్ ఇస్తూ చెల్లించమని చెప్పింది. అయితే ఇది ఎప్పుడు పడితే అప్పుడు కట్టుకుందాం అనుకుంటే కుదరదు. దానికోసం నిర్ణీత సమయాన్ని కేటాయించింది.

ప్రభుత్వం ఇచ్చిన గడువులోగానే దానిని కట్టాలి. అలా చేస్తే ఆ డిస్కౌంట్ వస్తిస్తుంది. మరి ఈ డిస్కౌంట్ ఎప్పుడు మొదలైంది, ఎన్నిరోజులు ఉంటుంది, ఎవరెవరికి ఎంత డిస్కౌంట్ అన్న విషయాలు తెలుసుకుందాం.

డిస్కౌంట్ ఎవరికీ ఎంత : Discount Category ?

చలాన్లపై బకాయి ఉన్న మొత్తాన్ని చెల్లించడానికి 2023 డిసెంబర్ 25 నుండి 2024 జనవరి 10 వ తేదీ వరకు సమయం ఇచ్చారు. అయితే ఇక్కడ ఒక మెలిక ఉంది.

పాత చలాన్లు అంటే 2023 డిసెంబర్ 25 కి పూర్వం ఉన్న చలాన్లకి మాత్రమే డిస్కౌంట్ లభిస్తుంది. 2023, 25 డిసెంబర్ తరవాత పడిన పెనాలిటీ చలాన్లకు ఈ డిస్కౌంట్ వర్తించదు.

telugu samayam 7 Challans Dates Extended: భలే మంచి చౌక బేరం.. పెండింగ్ చలాన్లకి మిగిలింది 4 రోజులే.

ఇక ఏయే వాహనాలకు ఎంత డిస్కౌంట్ అంటే.. అన్నటికన్నా ఎక్కువ డిస్కౌంట్ తోపుడు బళ్ల వారికి, ఆర్టీసీ బస్సులకు(RTC Busses) దక్కింది. వీటిపై ఉన్న చలాన్లకి 90 శాతం డిస్కౌంట్ ఇచ్చారు.

ఆతరువాతి స్థానంలో ద్విచక్ర వాహనాల(Two Wheeler) చలాన్లు ఉన్నాయి. వీటికి 80 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

ఇక ఫోర్ వీలర్స్ అండ్ ఆటోవాలాలకి(Four Wheelers And Autos) 60 శాతం తగ్గింపు లభిస్తుంది. ఆతరువాత లారీల వంటి భారీ వాహనాలకు(Heavy Vehicles) 50 శాతం డిస్కౌంట్ ఇచ్చారు.

ఎంత డబ్బు వసూలైంది ? How much money was collected?

ఇక పొతే ఈ డిస్కౌంట్ ను భారీ స్థాయిలో వాహనదారులు వినియోగించుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 11 రోజులకు గాను 66.77 కోట్ల రూపాయలు వసూలైంది.

ఇది జోన్ల వారీగా చుస్తే హైదరాబాద్ కమిషనరేట్(Hyderabad Commissionerate) పరిధిలో 17 కోట్లు, సైబరాబాద్ కమిషనరేట్(Cyberabad Commissionerate) లో 13.99 కోట్లు,

రాచకొండ కమిషనరేట్(Rachakonda Commissionerate) పరిధిలో 7.17 కోట్లు వసూలైంది. ఇక జనవరి 10వ టీడీతో గడువు ముగుస్తుంది అంటే ఇంకా కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది అని చెప్పాలి.

Leave a Comment