Kajal Aggarwal: తెల్లని చీరలో చందమామ అందాలు..పిక్స్ వైరల్.

Chandamama beauty in white saree..pics viral.

Kajal Aggarwal: తెల్లని చీరలో చందమామ అందాలు..పిక్స్ వైరల్.

టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ తెల్లని చీరలో తళుక్కుమంది. తన వయ్యారాలతో చానాళ్ల తరువాత సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మొదట్లో సన్నగా నాజూకుగా…

పెళ్లైన తర్వాత బేబీ బంప్‌తో..నిన్నటి వరకు చంకలో బిడ్డను ఎత్తుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు తన గ్లామర్ తో మైండ్ బ్లాక్ చేస్తుంది. మళ్లీ తనలోని పాత కాజల్‌ని చూపిస్తూ కుర్రాళ్లకు నద్ర లేకుండా చేస్తోంది.

తెల్లని చీరలో ఓ రేంజ్‌లో నాభి అందాలను ప్రదర్శిస్తూ అభిమానుల దృష్టి తనపై పడేలా చేస్తోంది. తాజాగా కాజల్ తెల్లని చీరను కట్టుకుని మత్తెక్కించే చూపులతో మ్యాజిక్ చేస్తోంది.

లేటెస్ట్ ఫోటో షూట్ చిత్రాలను తన ఇన్ స్టాగ్రామ్‎లో పోస్ట్ చేసి అందరిని ఫిదా చేసేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

కాజల్ అగర్వాల్ తన అందంతో, నటనా నైపుణ్యంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో మంచి స్థానాన్ని సంపాదించుకుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించిన ఈ అందాల చందమామ అప్పట్లో డైరెక్టర్ల ఫేవరెట్ ఛాయిస్.

అయితే తన చిన్ననాటి మిత్రుడు గౌతమ్‎ను వివాహం చేసుకొని ఓ పాపకు తల్లి అయ్యిద్ది. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి ఫ్యామీలీ లైఫ్ ఎంజాయ్ చేసింది. ఇక ఆల్ ఈజ్ వెల్ అనుకున్న ఈ చిన్నది ఇఫ్పుడు సెకండ్ ఇన్నింగ్స్‎లోనూ వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది.

ఓ వైపు వెబ్ సిరీస్‎లు మరోవైపు సినిమాలు ఇంకో వైపు హాట్ ఫోటో షూట్లతో తన కెరీర్‎ను ఎంతో ప్లాన్‎గా డిజైన్ చేసుకుంటోంది కాజల్.

అందుకు తగ్గట్లుగా నాజూకుగా మారుతూ దర్శకుల దృష్టిని ఆకర్షించేందుకు హాట్ ఫోటో షూట్లు చేస్తోంది. నిన్నటికి నిన్న గులాబీ రంగు గౌను ధరించి అదరగొట్టిన కాజల్ ఇప్పుడు తెల్లని చీర కట్టుకుని అందరినీ టెంప్ట్ చేస్తోంది.

లేటెస్టుగా చేసిన ఫోటో షూట్ పిక్స్ లో కాజల్ ఎంతో గ్లామరస్ గా కనిపించింది. తెల్లని చీరలో చందమామలా మెరిసిపోయింది. తన నడుము అందాలను ప్రదర్శించి..

ఒంపు సొంపులను చూపిస్తూ అందరిని అలరిస్తోంది. ఈ చిన్నది అందమైన చీరకట్టుతో ఇంటర్నెట్ లో మంటలు రేపుతోంది. కాజల్ అందాలు ఈ చీరలో మరింత రెట్టింపు అయ్యాయి. తన లేటెస్ట్ లుక్ చూసి కాజల్ అభిమానులను ఫిదా అయిపోయారు. లైకులు ,కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కాజల్ అగర్వాల్ ఈ అందాల దాడితో మళ్లీ ఇండస్ట్రీలో తన స్థానంలోకి రావాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. ప్రెజెంట్ లీడింగ్‌లో ఉన్న హీరోయిన్‌లకు గట్టి పోటీ ఇవ్వాలని మైండ్‎లో బ్లైండ్‎గా ఫిక్స్ అయ్యింది అందుకే ఈ గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో దాడి చేస్తోంది.

భగవత్ కేసరి హిట్‎తో మంచి ఊపులో ఉన్న కాజల్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో కమల్‌హాసన్‌తో ఇండియన్‌-2లో నటిస్తోంది.

ఈ సినిమా కోసం కాజల్ కేరళలో ప్రసిద్ధి చెందిన మార్షల్ ఆర్ట్ కలరిపట్టుని నేర్చుకుంటోంది. ఈ విషయాన్ని స్వయంగా కాజల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ సినిమాతో పాటు కాజల్ సత్యభామ మూవీ కూడా చేస్తోంది.

Leave a Comment