371 కోట్ల స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం లో మాజీ CM చంద్రబాబు నాయుడు ప్రధాన కుట్రదారుడని మరొక సారి ఆంధ్రప్రదేశ్ సిఐడి ఆరోపించింది. స్కిల్ డెవలప్‌మెంట్ క్లస్టర్‌ల కోసం కేటాయించిన 371 కోట్ల నిధులను పలు రకాల షెల్ కంపెనీలకు మళ్లించారని ఆరోపించింది. ఈ స్కాం లో చంద్రబాబు నాయుడు అలాగే అతని పార్టీ లబ్ధిదారులు అని దర్యాప్తు లో పేర్కొంది. మరిన్ని వివరాలను సేకరించేందుకు గాను సిఐడి నాయుడుని మరో సారి కస్టడీలో విచారించాలని అభ్యర్థించింది. అయితే ఇప్పటివరకు జరిగిన విచారణ ప్రకారం, ఆరు స్కిల్ డెవలప్‌మెంట్ క్లస్టర్‌ల కోసం ప్రైవేట్ సంస్థలు ఖర్చు చేసిన మొత్తం రూ.
371 కోట్లు అని తేలింది అని వారు చెప్పారు. AP ప్రభుత్వం తో AP స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ లు రెండు అడ్వాన్స్‌డ్ చేసిన నిధుల నుండి ప్రత్యేకంగా తీసుకోబడిందని వారు చెప్పారు. అయితే ఇన్‌వాయిస్‌లలో పేర్కొన్న వస్తువుల లిస్టు అసలు డెలివరీ కాని లేదా అమ్మకం లేకుండా కానీ ఈ డబ్బులో ఎక్కువ భాగాన్ని నకిలీ ఇన్‌వాయిస్‌లను సృష్టించి పలు షెల్ ద్వారా ఇతర కంపెనీలకు మళ్లించారని మా ఎంక్దవయిరీ లో తేలింది” అని రిమాండ్ రిపోర్ట్ లో CID ఆరోపించింది.
ఆరు క్లస్టర్ల ఏర్పాటుకు రూ.371 కోట్లు ఖర్చు అయినట్లు లెక్కలు చూపారని అందులో కొంత భాగాన్ని కేటాయించగా మిగిలిన నిధులను షెల్ కంపెనీల ద్వారా మళ్లించారని CID ఆరోపించింది. ఈ దుర్వినియోగమైన నిధుల్లో చంద్రబాబు నాయుడు (ఏ-1) చెప్పాలని అంతేకాదు తెలుగుదేశం పార్టీల సబ్యులే అంతిమంగా లబ్ధి పొందినట్లు దర్యాప్తులో తేలిందని తన రిపోర్ట్ లో వివరించింది.
“A-1′ ఒక స్టెప్-డౌన్ MTT ని సృష్టించడానికి అలాగే నిధుల బదిలీకి సంబంధించిన అన్ని లావాదేవీలకు ఏకైక నిర్ణయాధికారంగా చంద్ర బాబు నాయుడు వ్యవహరించడానికి బాధ్యత వహించే ప్రధాన కుట్రదారుగా పరిగణించడం వల్ల అతను ఈ మొత్తం పథకానికి ప్రధాన రూపకల్పన చేసాడని CID ఆరోపించింది. GOMSNo.4తో సంబంధం లేకుండా ప్రభుత్వ నిధులను ప్రైవేట్ సంస్థకు మళ్లించడమే స్పష్టమైన ఉద్దేశ్యం అని తెలుస్తోంది అని ఇది ప్రైవేట్ లాభం కోసం ఇతర షెల్ కంపెనీల ద్వారా డబ్బును మళ్లించడానికి ఈ ఇన్వాయిస్ లు ఉపయోగించారని CID తెలిపింది. అలాగే ఈ షెల్ కంపెనీల ద్వారా వచ్చిన డబ్బును నిందితుడు వికాస్ ఖాన్విల్కర్ లాంటి వ్యక్తుల జేబుల్లోకి చేరిందని CID తన రిపోర్ట్ లో తెలిపింది. ఖర్చు చేసిన ప్రభుత్వ నిధులు పబ్లిక్ ఫండ్స్ కి పోతాయి అలాగే ప్రైవేట్ సంస్థలకు దీని వల్ల ఆర్ధిక ప్రయోజనం చేకూరుతుందని CID తెలిపింది.