మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడికి(Ex CM Chandrababu Naidu) త్రుటి లో ప్రమాదం తప్పింది. రాజమహేంద్రవరంలో(Rajamandry) నిర్వహించిన రా కదలిరా కార్యక్రమం లో పాల్గొన్న చంద్రబాబు నాయుడు కాలుజారి పడిపోబోయారు.
వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మెరుపువేగంతో స్పందించి ఆయనను రక్షించారు. చంద్రబాబును కింద పడిపోకుండా పట్టుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రా కదలి రా : Raa Kadhali Raa Program Held By TDP
రా కదలిరా పేరుతో తెలుగుదేశం పార్టీ(Telugudesam Party) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు.
ఈ క్రమం లోనే అయన జనవరి 29 వ తేదీన రాజమహేంద్రవరం రూరల్ లోని కాతేరులో ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
(Chandra Babu Slipped On Stage)ఇక ఈ సభకు అటు తెలుగుదేశం పార్టీ నాయకులు, మద్దతుదారులు, అభిమానులు కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
వేదికపైకి పెద్ద సంఖ్యలో వచ్చిన జనం : Huge People Came On To Dias
ఈ క్రమంలో వేదికపైకి వచ్చిన చంద్రబాబు తన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు, అధికార వైకాపా పై విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు.
అయితే సభ ముగిసే సమయానికి చిన్నా పెద్దా నాయకులంతా వేదికపైకి వచ్చేశారు. దీంతో వేదిక మొత్తం నిండిపోయింది, చంద్రబాబు కూడా వేదిక అంచున నిలబడే పరిస్థితి ఏర్పడింది.(Chandrababu Slipped On Stage) ఈ సమయంలో చంద్రబాబు ముందుకు వెళుతూ కాలు జారీ స్లిప్ అయ్యారు.
సెక్యూరిటీ సిబ్బంది బాబును కింద పడకుండా చేతులు అడ్డుపెట్టారు. ఆపై వేదిక మీది నుండి చంద్రబాబును సిరక్షితంగా కిందికి తీసుకెళ్లారు.