Chandrababu went to Yashoda for KCR: కేసీఆర్ కోసం యశోదాకి వెళ్లిన చంద్రబాబు..కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా.

Chandrababu went to Yashoda for KCR..asked about KCR's health..

Chandrababu went to Yashoda for KCR: కేసీఆర్ కోసం యశోదాకి వెళ్లిన చంద్రబాబు..కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా.

తెలంగాణ మాజీ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు.

ఎన్నికల ఫలితాల అనంతరం తన ఫామ్ హౌస్ కి వెళ్లి అక్కడే ఉన్నాయా కేసీఆర్ అర్ధ రాత్రి సమాయంతో బాత్ రూమ్ లో కాలు జారీ పడిపోయారు. కుటుంబ సభ్యులు ఆయనను సోమాజిగూడ లోని యశోద ఆసుపత్రికి తరలించగా అయన ఎడమ కాలి తుంటి ఎముక రెండు చోట్ల విరిగినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

అనంతరం ఆయనకు శాస్త్ర చికిత్స చేసి తుంటి ఎముకను రీప్లేస్ చేసినట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్న కేసీఆర్ ను పార్టీలకు అతీతంగా నేతలు పరామర్శిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానా రెడ్డి కేసీఆర్ ను ఆసుపత్రికి తన కుమారుడితో కలిసి వెళ్లి పరామర్శించగా, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కేసీఆర్ ను ఆసుపత్రికి వెళ్లి పలకరించారు.

అదే సమయంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లతో పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఇక రాజకీయంగా ఎన్నికల సమయంలో హోరా హోరీ గా ఫైట్ చేసిన రేవంత్ రెడ్డి కూడా ముఖ్య మంత్రి అయ్యాక తీరిక చూసుకుని కేసీఆర్ ను పరామర్శించారు.

అయన త్వరగా కోలుకుని తిరిగి రావాలని, ఆయనను అసెంబ్లీలో చూడాలని ఉందని చెప్పారు. సీఎం రేవంత్ ఆసుపత్రికి రావడానికి ముందే తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కార్యదర్శి రిజ్వి ని యశోద ఆసుపత్రికి పంపించారు, ఎప్పటికప్పుడు అయన ఆరోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలు తనకు అందించాలని ఆదేశించారు.

ఇక తాజాగా నారా చంద్రబాబు నాయుడు కేసీఆర్ ను నేరుగా యశోద ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. రాజకీయంగా చుస్తే కేసీఆర్ టీడీపీ నుండే బయటకు వెళ్లి టిఆర్ఎస్ అనే వేరు కుంపటి పెట్టుకున్నారు అప్పట్లో.

ఇక 2014 ఎన్నికల్లో ఈ ఇద్దరు చంద్రులు సీఎం లు అయ్యారు. ఒకరు తెలంగాణాను ఒకరు ఆంధ్ర ప్రదేశ్ ను సీఎం లుగా పాలించారు. ఇక కేసీఆర్ తన ఇంట్లో ప్రమాదవశాత్తు పడిపోయి ఆసుపత్రిలో చేరిన రోజు చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

అయితే అనాడు చంద్రబాబు నేరుగా వెళ్లి పరామర్శిచడానికి కుదరలేదు, అప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు వరద బాధితులను పరామర్శిస్తున్నారు.

ఆయా పనులను తీరిక చేసుకున్న చంద్రబాబు డిసెంబర్ 12 న నేరుగా వెళ్లి పలుకరించారు. ఇక లోకేష్ కూడా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం లోకేష్ పాదయాత్రలో ఉండటం వల్ల ఆసుపత్రికి వచ్చి పరామర్శించలేకపోయారు.

ఇక చంద్రబాబు కేసీఆర్ ను పరామర్శిచడం అనే విషయం మాత్రం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇక చంద్రబాబు కేసీఆర్ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా కేసీఆర్ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు, ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ఆరు నుండి 8 వరాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

Leave a Comment