Chat GPT : చాట్‌జీపీట్‌ సృష్టికర్తకు అనుకోని ఝలక్..సీఈవో బాధ్యతల నుండి తొలగింపు.

Add a heading 89 Chat GPT : చాట్‌జీపీట్‌ సృష్టికర్తకు అనుకోని ఝలక్..సీఈవో బాధ్యతల నుండి తొలగింపు.

Chat gpt : చాట్‌జీపీట్‌ సృష్టికర్తకు అనుకోని ఝలక్..సీఈవో బాధ్యతల నుండి తొలగింపు.

ప్రపంచం లో ఎక్కడ చూసినా ఇప్పుడు చాట్‌జీపీట్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. సాఫ్ట్ వేర్ నుండి చాలా రకాల విషయాలపై చాట్‌జీపీట్‌ తో ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్న వారు అనేక మంది.

చాట్‌జీపీట్‌ తో వారు ఎంతో లబ్ది పొందుతున్నట్టు చెబుతున్నారు, అంతే కాకుండా వారి పని సమయం కూడా దీనిని ఉపయోగించడం వల్ల కలిసి వస్తోందని అంటున్నారు. అయితే ఈ చాట్‌జీపీట్‌ ను రూపొందించిన వ్యక్తి శామ్‌ ఆల్ట్‌మన్‌‌ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కానీ ఇప్పుడు అతనికి ఓపెన్ఏఐ సంస్థ గట్టి గానే షాకిచ్చింది. అతడిని ఓపెన్ఏఐ సంస్థ సీఈవో బాధ్యతల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి కారణం కూడా చెప్పుకొచ్చింది సదరు సంస్థ. అదేమిటంటే మైక్రోసాఫ్ట్‌ ఆర్థిక సహకారం ఉన్న ఓపెన్‌ఏఐ ఆయనను పూర్తిగా నమ్మలేకపోవడమేనట.

సదరు సంస్థ తీసుకున్న ఈ సడన్ డెసిషన్ విన్నవారంతా షాక్ అవుతున్నారు. కేవలం మాములు జనాలే కాదు, టెక్‌ వర్గాల్లో నిపుణులు దీని గురించి తీవ్రం గా చర్చించుకుంటున్నారు.

ఇక ఈ విషయమై ఓపెన్ఏఐ సంస్థ బోర్డు మాత్రం శామ్‌ ఆల్ట్‌మన్‌‌ పై తీవ్ర ఆరోపణలే చేసింది. శామ్‌ ఆల్ట్‌మన్‌‌ బోర్డులో జరుగుతున్న అంతర్గత చర్చల్లో నిజాయితీ గా ఉండటం లేదని చెబుతోంది.

కంపెనీ తో అతడు సమాచారాన్ని సరైన రీతిలో పంచుకోవడం లేదని అంటోంది. పైగా శామ్‌ ఆల్ట్‌మన్‌‌ ఎల్లపుడు బోర్డు తీసుకుంటున్న నిర్ణయాలకు అడ్డు పడుతూనే ఉన్నాడని, నాయకత్వం వహించే అతడి సామర్థ్యంపై నమ్మకం సడలిపోయిందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.

సీఈఓ బాధ్యతల నుంచి తనను తప్పించడంపై శామ్‌ ఆల్ట్‌మన్‌‌ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఓపెన్ఏఐ సంస్థలో తానూ ఎంతో ఇష్టపడి పనిచేశానని, అక్కడ ఎంతోమంది టాలెంటెడ్ పీపుల్ తో కలిసి వర్క్ చేశానని అన్నాడు.

ప్రస్తుతం ఆపద్ధర్మ సీఈవోగా శామ్‌ ఆల్ట్‌మన్‌‌ స్థానంలో ఆ సంస్థ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ మిరా మురాటీని కూర్చోబెట్టారు. ఇక ఈ చాట్‌జీపీట్‌ గురించి మాట్లాడుకుంటే ఈ యాప్‌ కృత్రిమ మేధలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది.

ఈ చాట్‌జీపీట్‌ ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ప్రపంచంలోని ప్రతి టెక్ నిపుణుడు దాని పనితనాన్ని చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఈ చాట్‌జీపీటీ వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కుడా అదే స్థాయిలో ఉన్నాయని అంటున్నారు. ఆల్ట్‌మన్‌ సైతం ఏఐ తో పెను ముప్పు పొంచి ఉందని చెప్పడం విశేషం.

Leave a Comment