Check bounce rules changed by RBI : చెక్ బౌన్స్ నిబంధనలను మార్చిన RBI…

6tv projects 17 Check bounce rules changed by RBI : చెక్ బౌన్స్ నిబంధనలను మార్చిన RBI…

Check bounce rules changed by RBI : చెక్ బౌన్స్ నిబంధనలను మార్చిన RBI… ఇలా చేస్తే 2 ఏళ్ల జైలు శిక్ష ఖాయం..

డిజిటల్ లావాదేవీలు పెరిగి పోతున్నాయి. అయినా, వినియోగదారులు చెక్ బుక్స్ సేవలను విరివిగానే వాడుతున్నారు. కానీ, ఈ చెక్కులను చాలా మంది వ్యక్తులు, సంస్థలు దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఒకొక్కసారి పొరపాటున వారి ఖాతాలో డబ్బులు తగినంత లేకపోవడం వలన కూడా చెక్ బౌన్స్ అయ్యో అవకాశాలు ఉంటాయి.

ఏది ఏమైనప్పటికీ చెక్కుల రూపంలో లావాదేవీలను నిర్వహించే వారికి పెద్ద ఎత్తున నష్టాన్ని తెచ్చిపెడుతుంటాయి. అలాంటి, మోసాలను అరికట్టటానికి RBI కొత్తనిబంధనలని అమల్లోకి తెచ్చింది. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…

బ్యాంకింగ్ వ్యాపారం చేస్తే, బ్యాంకులు చాలా సౌకర్యాలను అందిస్తాయి. బ్యాంకులో ఖాతాను తెరిచిన తర్వాత, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, చెక్ బుక్ వంటి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఈ రోజులలో దాదాపుగా ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో ఆర్థిక లావాదేవీలు చేయడానికె మొగ్గుచూపుతున్నారు. అయితే, పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలకు చెక్ రాసి ఇస్తూ వుంటారు. అలాంటి, చెక్ బౌన్స్ అయితే ఏమి జరుగుతుంది.

కొత్తగా RBI మార్చిన నిబంధనలలు ఇప్పుడు చూద్దాం..
చెక్ బుక్ ద్వారా చాలా ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి. అంతే, ఈ రోజుల్లో చెక్ బౌన్స్ కేసులు కూడా పెరుగుతున్నాయి. వీటన్నింటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చెక్ బౌన్స్ నిబంధనలలో పలు మార్పులు తీసుకొచ్చింది. ప్రతి బ్యాంకులోనూ దీన్ని అమలు చేయాలని ఆర్బీఐ ఆదేశించింది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, కొత్త చెక్ బౌన్స్ రూల్స్ త్వరలో అమలులోకి రానున్నాయి. దీని కోసం సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పలువురు నిపుణులు చేసిన సిఫార్సులను, సూచనలను స్వీకరించింది. ఈ సూచనలన్నింటినీ ఏకీకృతం చేసి, కొత్త చెక్ బౌన్స్ వివరాలను పొందుపరిచింది.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చెక్ బౌన్స్ రూల్స్ లో
కొన్ని ముఖ్యమైన అంశాలను స్పష్టం చేసింది. ఖాతాదారుడి బ్యాంక్ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేనప్పుడు చెక్కు ఇచ్చినట్లయితే, అటువంటి ఖాతాదారుని ఇతర బ్యాంకు ఖాతాల్లోని డబ్బును తీసి, బ్యాలెన్స్ లేని ఖాతాలోకి జమ చేస్తుంది.

చెక్కు ద్వారా లావాదేవిలను జరుపుతున్నట్లయితే, చెక్కులో రాసిన మొత్తం డబ్బులు వారి బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. లేకపోతే చెక్ బౌన్స్ పెనాల్టీని చెల్లించవలసి ఉంటుంది. అలాగే, అటువంటి కస్టమర్లు కొత్త బ్యాంక్ ఖాతాలను తెరవకుండా
నిషేధించబడతారు మరియు ఇతర చట్టపరమైన చర్యలను తీసుకుంటుంది. నూతన నిబంధనల ప్రకారం, చెక్ బౌన్స్ కేసులను నివారించడానికి, వారి ఖాతాలో డబ్బులేని వారు, చెక్కు ఇస్తే, వారిపై కఠిన
చర్యలను తీసుకోవాలని RBI బ్యాంకులకు దేశాలను జారీ చేసింది. వారి అకౌంట్ లో సరిపడినంత డబ్బులు లేకపోతే ఆ వ్యక్తి చెక్కులను జారీ చేయరాదు. బ్యాంకులో బ్యాలెన్స్ లేని


చెక్కు, అదేవిధంగా, చెక్కు బౌన్స్ అయిన వ్యక్తి కొత్త బ్యాంక్ ఖాతాను తెరవడానికి కూడా అనుమతిని నిలిపి వేస్తారు. అతనిని రుణ ఎగవేతదారుగా కూడా పరిగనిస్తారు. దానితో పాటు, ఇది నేరుగా CIBIL స్కోర్ ను కూడా ప్రభావితం చేస్తుంది. చెక్కు బౌన్స్ అయిన వ్యక్తికి బ్యాంకు నుంచి రుణం పొందేందుకు అర్హతను కూడా కోల్పోతాడు. ఏ బ్యాంకు కూడా అతనికి రుణం ఇవ్వదు.

ఇంకా చెక్ బౌన్స్ అయితే శిక్షను కూడా పెంచారు.
మన దేశంలో ఇప్పటికే ఈ నిబంధన అమల్లో ఉంది. చెక్ బౌన్స్ పెనాల్టీతో పాటు, వ్యక్తికి జైలు శిక్ష కూడా విధించబడుతుంది. కానీ, ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం, చెక్ బౌన్స్ పెనాల్టీకి సంబంధించి ఎటువంటి మార్పులు చేయలేదు. చెక్ బౌన్స్ అయితే, చెక్కు జారీ చేసిన వ్యక్తిపై కేసు నమోదైతే, అతనికి చెక్ కు సంబంధించి ఎటువంటి మార్పులు చేయలేదు. చెక్ బౌన్స్ అయితే, చెక్కు జారీ చేసిన వ్యక్తిపై కేసు నమోదైతే, అతని నుంచి చెక్ బౌన్స్ రుసుమును వసూలు చేస్తారు.

ఇది చెక్కులో పేర్కొన్న మొత్తం కంటే రెండింతలు ఉంటుంది. ఇంకా రెండేళ్ల వరకు జైలు శిక్ష కూడా విధించబడుతుంది. ఇటీవలి కాలంలో పెరుగుతున్న చెక్ బౌన్స్ కేసులను నిరోధించేందుకు ఆర్బిఐ (ఆర్బిఐ) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలను అమలు చేయడానికి కసరత్తులు చేస్తుంది.

Leave a Comment