Game Changer Director Shankar: దర్శకుడు శంకర్ పై రాంచరణ్ ఫాన్స్ గరం..గేమ్ చేంజర్ పై అప్ డేట్స్ గురించి చెర్రీ ఫాన్స్ రచ్చ..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రస్తుతం ఈ హీరో మాంచి జోరు మీదున్నాడు. చిరంజీవి నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ ఎంట్రీ పాస్ ఓన్లీ ఫస్ట్ మూవీ వరకే అని అర్ధం చేసుకున్నాడు.
కాబట్టి ఒక్కో సినిమాతో తనను తాను మలచుకుంటూ వచ్చాడు. అందుకే మెగా పవర్ స్టార్ నుండి గ్లోబల్ స్టార్ రేంజ్ కి ఎదిగిపోయాడు. ఇక రామ్ చరణ్ ఫాన్స్ తమ హీరో నుండి ఎలాంటి సినిమా, వస్తుందా ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని ఆశక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.
కానీ ఈ మధ్య మాత్రం చెర్రీ ఫాన్స్ డైరెక్టర్ శంకర్ పై గుర్రుగా ఉన్నారు. అందుకు కారణం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చరణ్ – శంకర్ కంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ ఆలస్యం అవుతూ ఉండటమే.
రామ్ చరణ్ శంకర్ కలయికలో ఈ గేమ్ చేంజర్ ను అనౌన్స్ చేసిన సమయంలో శంకర్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు పైగా కమల్ తో తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయి ఉంది. అలాంటి దర్శకుడికి అవకాశం ఇవ్వడమే గొప్ప అనుకుంటే ఇప్పుడు ఆ సినిమా ఊసే ఎత్తకపోవడం పై చరణ్ ఫాన్స్ మండిపడుతున్నారు.
శంకర్ తమ హీరో సినిమాను అశ్రద్ధ చేస్తున్నాడని అంటున్నారు. రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ నుండి ఈ మధ్య కాలంలో ఒక్కటంటే ఒక్క అప్ డేట్ కూడా ఇవ్వలేదని అంటున్నారు. కేవలం సంవత్సరం లో సినిమాను తీసి రిలీస్ చేస్తాడు లే అనుకుంటే 2024 దసరా నాటికి కూడా ఈ సినిమా వచ్చే ఛాన్స్ కనిపించడం లేదని గుబులుగా ఉన్నారు చెర్రీ ఫాన్స్.
చరణ్ తో గేమ్ చేంజర్ సినిమాను మొదలు పెట్టిన శంకర్ కొన్నాళ్ళు బాగానే అప్ డేట్స్ ఇచ్చాడు. షూటింగ్ సమయంలో చరణ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు పంచుకున్నాడు.
కానీ అదే సమయంలో కమల్ తో ఒప్పుకుని ఆగిపోయిన ఇండియాన్ 2 సినిమా పట్టాలెక్కడంతో చరణ్ తో చేస్తున్న గేమ్ చేంజర్ ను పూర్తిగా పక్కన పెట్టాడు. అయితే ఈ తరహా వ్యవహారాన్ని చరణ్ ఫాన్స్ అస్సలు సహించలేకపోతున్నారు.
కెరియర్ ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్ కి చరణ్ అవకాశం ఇచ్చాడని, దిల్ రాజు వంటి పెద్ద ప్రొడ్యూసర్ సినిమాను నిర్మిచడానికి ముందుకి వచ్చారని, అటువంటి సినిమాను అశ్రద్ధ చేయడం తగదని అంటున్నారు.
పైగా ఇప్పుడు ఇండియన్-2 షూటింగ్ చేస్తున్న శంకర్ ఇండియన్ 3 అనౌన్స్ చేయడంతో వీరి కోపం మరింత కట్టలు తెచ్చుకుంటోంది. శంకర్ తీరు చూసిన చరణ్ ఫాన్స్ అసలు గేమ్ చేంజర్ ను పూర్తిగా వదిలేసినట్టేనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు వేస్తున్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమా చేసేందుకు బుచ్చి బాబు రెడీ గా ఉన్నాడు. ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా బుక్ అయినట్టు తెలుస్తోంది. మరో హీరోయిన్ గా నిన్నటి తరం నటి రవీనా టాండన్ కుమార్తె, రషా టాండని ని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట.