Congress Elections Manifesto 2024: 2024 ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో ఛైర్మన్​గా చిదంబరం.

Chidambaram as Congress Manifesto Chairman for 2024 elections.

Congress Elections Manifesto 2024: 2024 ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో ఛైర్మన్​గా చిదంబరం.

రాష్టాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి, 2024 లో జరిగే సార్వత్రిక ఎన్నికలు కూడా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

వివిధ రాజకీయ పార్టీలు తమ వ్యూహాలతో ఓటర్లను ఆకట్టుకునే పనిలో పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రణాళికను రూపొందించేందుకు కాంగ్రెస్‌ పార్టీ తన మేనిఫేస్టో కమిటీని కూడా ప్రకటించింది.

16మందితో కూడిన ఈ కమిటీకి ఛైర్మన్‌గా మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరంను నియమించింది. కన్వీనర్‌గా ఛత్తీస్‌గఢ్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి టి.ఎస్‌ సింగ్‌దేవ్‌ వ్యవహరిస్తారని తెలిపింది. ఈ మేరకు జాబితాను కూడా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.

మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ, ఆనంద్‌ శర్మ, జైరామ్‌ రమేశ్‌, శశిథరూర్‌ లు ఉన్నారు.

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం దిల్లీలో జరిగింది. ఆ మర్నాడే ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటుచేయడం విశేషం. పార్టీ నేతలపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ రాష్ట్ర విభాగాలు అనుసరించిన వ్యూహాలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు.

వాటిలో చిన్న పార్టీలతో సీట్ల సర్దుబాటుకు తమ పార్టీ అంగీకరించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ మూడు కీలక రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలవడంపై దిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో చర్చలు జరిపారు.


విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంబీజేపీని ఓడించేందుకు చిన్న పార్టీలతో ఆయా రాష్ట్రాల్లో తమ పార్టీ విభాగాలు ఎందుకు పొత్తు పెట్టుకోలేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారని సమాచారం.

మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటుకు అంగీకరించి ఉంటే కనీసం కొన్ని చోట్లైనా గెలిచే వారమని పేర్కొన్నారని విశ్వాసనీయ వర్గాల సమాచారం.

ప్రధానంగా మధ్యప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) చేసిన పొత్తు ప్రతిపాదనను కమల్‌నాథ్‌ నేతృత్వంలోని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ తిరస్కరించడాన్ని దృష్టిలో పెట్టుకొని రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కమలదళంపై పోరులో ప్రతి ఓటూ కీలకమేనని అన్నారు.

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌ తగిన స్థాయిలో ప్రచారం నిర్వహించలేదనీ ఆయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణలో ఏడాది కిందట మూడో స్థానంలో ఉన్నప్పటికీ గొప్పగా పుంజుకొని విజయం సాధించడాన్ని రాహుల్ ప్రస్తావించారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ కొంత బలంగా ఉందని కొందరు నాయకులు పేర్కొనగా ఆ పార్టీ అజేయమైనదేమీ కాదంటూ రాహుల్‌ వ్యాఖ్యానించారు.

Leave a Comment