China new step forward in the Internet : ఇంటర్నెట్ లో చైనా మరో ముందడుగు కొత్త ఇంటర్నెట్ వేగం తెలిస్తే షాక్.

China new step forward in the Internet

China new step forward in the Internet: ఇంటర్నెట్ లో చైనా మరో ముందడుగు.. చైనా కొత్త ఇంటర్నెట్ వేగం తెలిస్తే షాకే..

చైనా దేశం ఒకప్పుడు అత్యంత వేగంగా నడిచే రైళ్లను తయారు చేసి అబ్బురపరిచాయి. వాయువేగంతో పరుగులు పెట్టె ఈ రైళ్లు ప్రపంచంలో మారే ఇతర దేశాల్లో అప్పటివరకు లేవు.

కానీ చైనా తరువాత కొన్ని దేశాలు ఆ స్థాయి వేగంతో నడిచే రైళ్లను రూపొందించగలమని నిరూపించుకున్నాయి. ఇప్పుడు తాజాగా డ్రాగన్ దేశం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన అంతర్జాలాన్ని ఆవిష్కరించింది. ఈ ఇంటర్నెట్ స్పీడు తెలిస్తే ఔరా అని నోరెళ్లబెడతారు.

ఇది సెకనుకు 1.2 టెరాబైట్‌ డేటాను ప్రసారం చేయగలుగుతుంది. ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ సోర్సెస్ తో పోల్చుకుంటే దీని వేగం వాటికన్నా పది రేట్లు అధికమని తెలుస్తోంది.

సింఘువా విశ్వవిద్యాలయం, చైనా మొబైల్, హువాయ్ టెక్నాలజీస్, సెర్నెట్ కార్పొరేషన్ సంస్థలు కలిసికట్టుగా ఈ ప్రాజెక్టు ను టేకప్ చేశాయి.

బీజింగ్, వుహాన్, గ్వాంగ్జూల ప్రాంతాలలో ఈ సర్వీస్ అందుబాటులో ఉంది. పైగా ఆప్రాంతాల్లో ఇప్పటికే విస్తరించి ఉన్న ఆప్టిక్ ఫైబర్ ద్వారా ఇది సేవలను అందిస్తున్నట్టు తెలుస్తోంది.

అగ్రరాజ్యం అమెరికా ఇటీవలే 400 గిగాబైట్ల వేగంతో నడిచే 5జీ అంతర్జాలాన్ని తెరపైకి తెచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా చుస్తే 100 గిగాబైట్ల వేగంతో పనిచేసే ఇంటర్నెట్ సర్వీసులు మాత్రమే ఇపుడు మనకు అందుబాటులో ఉన్నాయి.

జాతీయ చైనా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నెట్‌వర్క్ చేసిన కృషికి ఇది ఫలితం అని చెప్పొచ్చు. పైగా ఇది ఒక నెలలోనే ఒక వారంలోనే చేసింది కాదు, దాదాపు దశాబ్ద కాలంపాటు నిరీక్షిస్తే వచ్చిన ఫలితం ఇది.

దీనిని రూపొందించిన అనంతరం అన్ని రకాలుగా పరీక్షలు కూడా జరిపారు. ఇది కేవలం ఒక సెకనులో అత్యంత నాణ్యత కలిగిన 150 సినిమాలను డౌన్ లోడ్ చేయగల సత్తా కలిగి ఉన్నట్టు చెబుతున్నారు.

చైనా దేశానికి ఇది భవిష్యత్తులో అధునాతన సాంకేతికతను అందించడానికి దోహదపడుతుందని వారు భావిస్తున్నారు. దీనికి అవసరమైన సిస్టమ్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ వంటి వాటినన్నిటిని దేశీయంగానే తయారు చేసినట్టు పేర్కొన్నారు.

Leave a Comment