China new virus – pneumonia: చైనా లో కొత్త వైరస్.. ఎలా వ్యాప్తి జరుగుతోంది?

How is the new virus spreading in China

China new virus pneumonia: చైనా లో కొత్త వైరస్..వైరస్ వ్యాప్తి ఎలా జరుగుతోంది.

చైనా ఈ దేశం కొత్త కొత్త ఫోన్లను, అత్యంత వేగంగా పరుగులు పెట్టె రైళ్లనే కాదు, కొత్త కొత్త వైరస్ లను, అత్యంత వేగంగా వ్యాపించే వైరస్ లను కూడా వ్యాపిస్తుంది. ఒకప్పుడు కరోనా వైరస్ డ్రాగన్ దేశంలోనే పుట్టింది.

ఆ వైరస్ అక్కడితో ఆగకుండా ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాపించి, భీభత్సాన్ని సృష్టించింది. కరోనా చేసిన విలయ తాండవంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక దేశాలు ఆర్ధికంగా వేల కోట్లు నష్టపోయాయి. ప్రజలు భయం గుప్పిట్లో నలిగిపోయారు.

ఇళ్లకే పరిమితం అయ్యారు. కుటుంబానికి దగ్గరగా ఉంటూ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటూ వచ్చారు. ఫోన్ మోగిందంటే ఎటువంటి చేదు వార్త వినాల్సి ఉంటుందో అని ఆందోళనకు గురయ్యారు.

బంధువులను ఆత్మీయులను ఆప్యాయతతో ఆలింగనం చేసుకోలేకపోయారు. ఎవరిని ముట్టుకుంటే కరోనా వస్తుందో, ఎవరిని పట్టుకుంటే కరోనా వస్తుందో అన్న అనుమానంతో బ్రతుకు వెళ్లదీశారు. అయినవారిని కోల్పోయిన కుటుంబీకులు వారి కడసారి చూపుకి కూడా నోచుకోలేకపోయారు.

ఆస్పత్రినుండి నేరుగా ఖర్మకాండలకే సాగనంపడంతో దిగాలుగా చూస్తూ ఉండిపోయారు. ఇటువంటి విపరీత విషాదకర పరిస్థితులన్నీ చైనా దేశం నుండి వ్యాపించిన కరోనా వల్లే తలెత్తాయి.

Where the new virus leads:

Untitled design 5 China new virus - pneumonia: చైనా లో కొత్త వైరస్.. ఎలా వ్యాప్తి జరుగుతోంది?


అయితే అదే చైనా లో ఇప్పుడు మరో కొత్త వైరస్ తలెత్తింది. దాని పేరే న్యూ నిమోనియా వైరస్. ఈ వైరస్ కూడా కరోనా మాదిరిగానే చాల వేగంగా వ్యాప్తి చెందుతోంది.

కేవలం వారం రోజుల వ్యవధిలోనే రోజుకు 7 వేల కేసులు నమోదైతున్నాయి. ఈ వ్యాప్తి తో అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇది కేవలం చైనా దేశస్థులను మాత్రమే కాదు ప్రపంచంలోని అన్ని దేశాల వారిని ఇది వణికిస్తోంది.

ఎందుకంటే ఒకప్పుడు కరోనా వైరస్ మొదట చైనా లోని వుహాన్ నగరంలోనే పుట్టి అక్కడి దేశం నలుచెరగులా వ్యాపించినప్పటికీ ఆ తరువాత ప్రపంచంలోని అన్ని దేశాలకు ఇది విస్తరించింది. అలాగే ఈ కొత్త వైరస్ కూడా వ్యాప్తి చెందుతుందేమో అని హడలి పోతున్నారు.

అయితే గతం లో వ్యాపించిన కరోనా వైరస్ ఎక్కువగా పెద్ద వారిలో కనిపించింది. ఈ వైరస్ బారిన పడి మరణించిన చిన్నారులు దాదాపుగా లేరనే చెప్పాలి. కానీ ఈ దఫా మాత్రం కొత్త వైరస్ బారిన బడుతోంది అచ్చగా చిన్న పిల్లలే.

ఈ వైరస్ కారణంగా ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ తలెత్తడం, అధిక జ్వరం రావడం, శ్వాస సమస్యల ఏర్పడటం జరుగుతోంది. గతంలో కరోనా వైరస్ అనేది వుహాన్ నగరంలో వ్యాపించగా ఈ కొత్త రకం వైరస్ బీజింగ్ లియోనింగ్ నగరాల్లో ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

Avian influenza:

Untitled design 6 China new virus - pneumonia: చైనా లో కొత్త వైరస్.. ఎలా వ్యాప్తి జరుగుతోంది?


ఇప్పటివరకు ఈ వైరస్ గురించిన వివరాలు పూర్తిగా తెలియరాలేదు. కానీ ఈ వైరస్ ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కుటుంబానికి చెంది ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ వైరస్ యొక్క ముఖ్య లక్షణాలు గనుక చుస్తే జ్వరం, దగ్గు,శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి, కండరాల నొప్పి, తలనొప్పి, వాంతులు, వికారం వంటివి ఉంటున్నాయి.

How the new virus spreads:

Untitled design 7 China new virus - pneumonia: చైనా లో కొత్త వైరస్.. ఎలా వ్యాప్తి జరుగుతోంది?


గతంలో వచ్చిన కరోనా వైరస్ అనేది గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందింది. ఎక్కువగా ఇది కరోనా బారిన పడిన వారిని ముట్టుకోవడం, వారికి దగ్గర మెసలడం, వారు ముట్టుకున్నా వస్తువులను మనం ముట్టుకోవడం వల్ల కూడా వ్యాపించింది.

అందుకే అప్పట్లో మనిషికి మనిషికి దూరం పాటించాలని సూచించారు. ప్రస్తుతం ఈ వైరస్ కూడా గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది అనే అంచనాకి వచ్చారు. కానీ దానికి ఖచ్చితమైన నిర్ధారణ లేదు. ఈ వైరస్ అసలు ఎలా వ్యాప్తి చెందుతోంది అందానికి రుజువు దొరకలేదు.

ఈ వైరస్ బారిన పడిన పక్షులు లేదా జంతువులతో సంబంధం కలిగి ఉన్న వ్యక్తులకు ఈ వైరస్ సోకే అవకాశం ఉటుందని తెలుస్తోంది.

How the new virus spreads:

Untitled design 8 China new virus - pneumonia: చైనా లో కొత్త వైరస్.. ఎలా వ్యాప్తి జరుగుతోంది?

నేపథ్యంలో, భారతదేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. మొదట్లో చైనా లో మొదలైన కరోనా మనదేశ వాతావరణంలో మనుగడ సాగించడానికి సాధ్యం కాదని అనుకున్నారు.

అంతర్జీతీయ విమానాల రాకపోకలను నిలుపుదల చేయకుండా యధావిధిగా కొనసాగించారు. దాని వల్ల వైరస్ భారత దేశంలోకి చాలా తేలికగా వ్యాపించేసింది. వైరస్ భారత్ లో వ్యాపించినంత తేలికగా నివారించబడలేదు.

ఎంతో వేగంగా వ్యాప్తి చెందిన ఈ వైరస్ మొత్తం భారతదేశాన్ని చుట్టబెట్టేసింది. కాబట్టి ఈ దఫా భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ముందుగానే అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు భారతదేశ సరిహద్దు ప్రాంతాలలో తక్షణ చర్యలు చేపట్టింది.

WHO tightens the Situation:

Untitled design 9 China new virus - pneumonia: చైనా లో కొత్త వైరస్.. ఎలా వ్యాప్తి జరుగుతోంది?


ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్ గురించి ప్రజలకు అవగాహనా కల్పించేందుకు నడుం బిగించింది. ఇందుకోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైంది.

ఇందులో భాగంగా డబ్ల్యు హెచ్ ఓ ఏమంటోందంటే బయటనుండి ఇంటిలోకి వెళ్లి వచ్చిన ప్రతిసారి చేతులను శుభ్రంగా కడుక్కోవాలని అంటోంది.

ముక్కు, నోరు, కళ్ళు, అస్సలు తాకొద్దని అంటోంది. జ్వరం, జలుబు, దగ్గు ఉన్న వ్యక్తుల నుండి దూరంగా ఉండాలని సూచిస్తోంది. బయటకు వెళ్లే సమయంలో ముఖానికి మాస్క్ పెట్టుకోవడం చేతులకు గ్లౌజులు ధరించడం మంచిదని చెబుతోంది.

Even doctors can’t predict:

Untitled design 10 China new virus - pneumonia: చైనా లో కొత్త వైరస్.. ఎలా వ్యాప్తి జరుగుతోంది?


చైనా లో వ్యాప్తి లో ఉన్న ఈ కొత్త వైరస్ ఎటువంటిది అన్న విషయం పూర్తిగా తెలియకపోవడం తో అటు అధికారులు గాని ఇటు వైద్య నిపుణులు గాని దీని గురించి ఖచ్చితమైన నిర్ధారణ ఇవ్వలేకపోతున్నారు.

కానీ డబ్ల్యు హెచ్ ఓ మాత్రం ఈ వైరస్ మహమ్మారిగా మారే అవకాశం ఉందని అంటోంది. ఈ వైరస్ ను నివారించడానికి ఒక్కటే మార్గమంటోంది. ప్రజలు దీని పట్ల అవగాహనా కలిగి ఉండటం, అలాగే తగు జాగ్రత్త చర్యలు పాటించడమే మార్గమంటోంది

చైనా లో కొత్త రకం వైరస్ లు వ్యాపించడం ఇది కొత్తేమి కాదు. అయితే చాల మంది అనుకుంటారు గతంలో కరోనా వైరస్ ఇప్పుడు ఈ కొత్త వైరస్ లు చైనా నుండి ఇతర దేశాలకు వ్యాపంచాయని. కానీ వాటి కన్నా ముందు నుండే చైనా ఇతరదేశాల వైరస్ లను వ్యాప్తి చెందించింది.

2002 వ సంవాయిసారం లోనే SARS అనే వైరస్ చైనా లో పుట్టింది. H1N1 ఫ్లూ అనే వైరస్ కూడా ఈ డ్రాగన్ దేశంలోనే పుట్టింది. 2012లో SARS-CoV-2 అనే వైరస్ కి కూడా చైనా నే పుట్టినిల్లు.

ఇక తరువాత 2019 లో వెర్రితలలు వేసిన కోవిద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే 2012 వరకు వచ్చిన SARS-CoV-2 అనే వైరస్ వరకు అన్ని కూడా పరాయిదేశాలకు అంతగా పలకలేదు. అందుకు కారణం అప్పట్లో అంతటి కనెక్టయివిటి ఇతరదేశాలతో చైనా కి లేకపోవడమే.

పైగా 2012 నాటికి చైనా అంతటి అభివృద్ధిని సాధించడం గాని పారిశ్రామికంగా పరుగులు పెట్టడం కానీ లేదు. కాబట్టి అప్పట్లో ఆ వైరస్ల వ్యాప్తి కూడా తక్కువగానే ఉంది.

కానీ కరోనా సమయం వచ్చే సరికి చైనా అన్ని రంగాల్లో ముందుకి వచ్చింది. అనేక దేశాలతో వ్యాపార లావాదేవీలు చైనా దేశస్థులకు ఉన్నాయి. పైగా 2012 తో పోల్చితే విమాన యానాం, రోడ్డు మార్గం లో కూడా కనెక్టివిటి పెరిగింది. దీంతో వైరస్ వ్యాప్తి చాలా తేలికైంది.

పైగా భారత్ వంటి అధిక జనాభా కలిగిన దేశంలోకి వైరస్ అడుగు పెట్టడం వల్ల నియంత్రిచడానికి కష్ట తరమైంది.

WHO questioned China for:

Untitled design 11 1 China new virus - pneumonia: చైనా లో కొత్త వైరస్.. ఎలా వ్యాప్తి జరుగుతోంది?


చైనా లో పుట్టిన వైరస్ ఇతర దేశాల వ్యాప్తి చెందడం వల్ల ప్రప్రాంచవ్యాప్తంగా చూసుకుంటే మిలియన్ల సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది. అదే ఇప్పుడు డబ్ల్యు.హెచ్.ఓ చైనా దేశాన్ని వైరస్ వ్యాప్తి లేదా వైరస్ ఉద్భవంలో ప్రశ్నించడానికి ప్రధాన కారణం అయింది.

చైనా లో వివిధ రకాల జంతువుల మాంసాలను తింటారు అన్నది తెలిసిన విషయమే. వాటిని విక్రయించడానికి ప్రత్యేకంగా మార్కెట్లు కూడా ఉంటాయి.

ముఖ్యంగా కప్పలు, గబ్బిలాలు, పాములు వంటి వాటిని వారు తింటూ ఉంటారు. అందుకే జంతువుల నుండి మానవులకు వ్యాపించే వైరస్ లు ఉద్భవించే ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంటోంది.

అయితే చైనా దేశం మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. తమ దేశం లో కావాలని ఎటువంటి వైరస్ లను వ్యాప్తి చేయడం లేదని అంటోంది. అవసరమైతే.

డబ్ల్యు.హెచ్.ఓ కు సహకరించడానికి ఎల్లప్పుడూ సిద్దమే అని అంటోంది. తాము ఎల్లప్పుడూ ఈ మాటలకూ కట్టుబడి ఉంటామని అంటోంది.

ఈ క్రమంలో డబ్ల్యు.హెచ్.ఓ డ్రాగన్ దేశం నుండి మరింత సమాచారాన్ని కోరుతున్నట్టు తెలుస్తోంది. అయితే డబ్ల్యు.హెచ్.ఓ చైనాను హెప్రశ్నించడం అనేది మంచి పనే అని ప్రపంచ దేశాలు కొన్ని భావిస్తున్నాయి.

అలా ప్రశించడం వల్లనే కొత్త వైరస్ లు పుట్టుకురాకుండా అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవడానికి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ప్రయత్నిస్తోంది.

Causes of virus spread:

Untitled design 12 China new virus - pneumonia: చైనా లో కొత్త వైరస్.. ఎలా వ్యాప్తి జరుగుతోంది?


ఇక చైనాలోనే కొత్త వైరస్ లు పుట్టుకురావడం మనము చూస్తూనే ఉన్నాం 2002 నుండి 2023 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ వ్యాప్తికి ప్రధాన కారణంగా అక్కడి జంతువుల మార్కెట్లను చూపెట్టవచ్చు.

అక్కడ జంతువుల మార్కెట్ లో అనేక రకాల జంతువులు ఒక చోట లభ్యమవుతాయి. దాని వల్ల ఒక జంతువుకి ఉన్న వైరస్ మరో జంతువుకి వ్యాప్తి చెందుతుంది. తద్వారా అది మనుషులకు కూడా సోకుతుంది.

ఎందుకంటే ఆ జంతువులను విక్రయించి తమతో తెచ్చుకున్నవారు ఈ వైరస్ బారిన పడుతున్నారు. వీరు జంతు మార్కెట్ కి వెళ్లి కొని తెచ్చు కున్న జంతువులను అయితే మాంసంగా వండుకుని తినడానికి ఉపయోగిస్తారు, లేదంటే పెంపుడు జంతువుగా మచ్చిక చేసుకుని ఇంట్లో పెంచుకోవడానికి ఉపయోగిస్తారు.

కానీ ఈ రెండు పద్ధతుల ద్వారాను వైరస్ వ్యాపించే వీలుందని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. పైగా చైనా లో అనేక సందర్శన ప్రక్రుతి దృశ్యాలు ఉన్నాయి.

ఆ ప్రదేశాల్లో అనేక రకాల వన్యప్రాణులు ఉన్నాయి. ఈ వన్యప్రాణులలో కూడా కొన్ని వైరస్ లను కలిగి ఉండవచ్చని శాస్త్రవేత్తల ద్వారా తెలుస్తోంది.

పైగా ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం గ మారింది. ఆతరువాతి స్థానంలో చైనా నే ఉంది. కాబట్టి ఆ దేశంలో ఉద్భవించిన వైరస్ లు వేగంగా వ్యాప్తి చెందే వీలుంటుందని తెలుస్తోంది.

Leave a Comment