Chinese flag on ISRO rocket – Tamilnadu govt admits mistake : తమిళనాడు లో ఇటీవల ఒక వార్తా పత్రిక లో ఇస్రో రాకెట్ మీద చైనా జెండాను ముద్రించడం తీవ్ర దుమారం లేచింది. అయితే ఇది ఒక మంత్రి అయిన అనితా రాధాకృష్ణన్ సంబందించిన దిన పత్రిక అవ్వడం ఒక విశేషం.
అయితే జరిగిన తప్పును ఒప్పుకున్న తమిళనాడు ప్రభుత్వం అది చిన్న పొరబాటు అని చెప్పే ప్రయత్నం చేసి జరిగిన వివాదానికి ఎండ్ కార్డ్ వేసే ప్రయత్నం చేసింది.
తమిళనాడు లో కులశేఖర పట్టణం లో ఇస్రో సంస్ద సెకండ్ లాంచ్ పాడ్ ఏర్పాటు చెయ్యడానికి సన్నాహాలు చేస్తోందని అనే వార్త దినపత్రిక లో వేసిన రాకెట్ మీద చైనా జెండా ని ముద్రించడం ప్రభుత్వ పని తీరుని BJP పార్టీ తీవ్రం గ పరిగణించింది.
దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కుద తీవ్రం స్పందించారు. తమిళనాడు ప్రభుత్వం తన పరిధులు దాటేసింది అని ఆగ్రహం వ్యక్తం చేసారు ఆయన. దీనికి DMK చేసిన తప్పుకి తప్పకుండా శిక్ష ను అనుభవించాల్సిందే అంటూ అయన తీవ్ర హెచ్చరికలు చేసారు.